అయ్యో.. ఇంత కష్టం వచ్చిందా..
x

అయ్యో.. ఇంత కష్టం వచ్చిందా..

తల్లిదండ్రులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అమ్మమ్మ వద్ద ఉన్న ఇద్దరు బాలికల పరిస్థితిని చూసిన సీఎం చలించిపోయారు.


పిల్లలకు ప్రధానంగా ఆడబిడ్డలకు తల్లీదండ్రి ఆలన కోరుకుంటారు. తండ్రిపై ఆడపిల్లలకు ఉన్న ప్రేమ అనిర్వచనీయం. కొన్ని విషయాల్లో ఆడబిడ్డలు కొంగు చాటున ఉండాలని కోరుకుంటున్నారు. తల్లి కూడా అదేవిధంగా లాలిస్తుంది. పెరిగే కొద్దీ వారి అవసరాలు సమయానుకూలంగా తెలుసుకుని మసులుకోవాలి. వాటికి దూరమైన పిల్లల పరిస్థితి ఏమిటి?

జీడి. నెల్లూరులో అదే జరిగింది. తండ్రి మరో మహిళ మోజులో పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు తల్లి కూడా అదేవిధంగా వ్యవహరించింది. లోకం పోకడ ఏమాత్రం తెలియని అమాయక బాలికలకు కల్లుగీత కార్మిక కుటుంబానికి చెందిన అమ్మమ్మ సెల్వి (అవ్వ), తాత వాసు అండగా నిలిచింది. పేదరికంలో కష్టపడుతూనే ఆ ఇద్దరు ఆడబిడ్డల ఆలన చూసుకుంటున్నారు.
తలరాత మారింది...

తల్లిదండ్రుల ఆలనకు దూరమైన పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. వారి అవ్వాతాతల కన్నీటి గాథ మాటలకు అందనిది. ఈ పరిస్థితిలో..
చిత్తూరు జిల్లా జీడి. నెల్లూరు పర్యటనకు సీఎం చంద్రబాబు రావడం ఆ బాలికలే కాదు. ఆ పేద కుటుంబం తలరాత మారింది. ఆసరా దొరికింది. ఈ విషయం స్వయంగా చూసిన ద్రబాబు చలించిపోయారు. వారికి బతుకుకు భద్రత కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు.
జీడి నెల్లూరు దళితవాడలో లబ్దిదారుడైన కల్లుగీత కార్మికుడు స్వయంగా పింఛన్ పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు శనివారం వచ్చారు. ఆ సమయంలో పింఛన్ లబ్దిదారుడు వాసు పక్కనే ఉన్న ఆయన భార్య సెల్వి దగ్గర ఇద్దరు చిన్న ఆడబిడ్డలు ఉండడం గమనించి, వారి కుటుంబ పరిస్థితిని ఆరా తీశారు. తన దీనగాథను సెల్వి వివరించే లోపే జీడి. నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పూసగుచ్చినట్లు వివరించారు. దీంతో
అమ్మమ్మ వద్ద ఉన్న బాలికల పరిస్థితి విని సీఎం చంద్రబాబు చలించిపోయారు. పింఛన్ లబ్దిదారుడి భార్య సెల్వి నుంచి ఆమె వివరాలు తెలుసుకున్నారు.
"తన అల్లుడు మరో మహిళను పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడు. కూతురు కూడా మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఇద్దరు ఆడపిల్లల రక్షణ బాధ్యత చూసుకుంటున్నా" అని సెల్వి కన్నీటి పర్యంతమైంది. స్పందించిన సీఎం చంద్రబాబు ఇద్దరు ఆడబిడ్డలు రక్షిత (5 వతరగతి),హేమశ్రీ (3వ తరగతి) చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. వారి పేరు మీద చెరో రూ. రెండు లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ను ఆదేశించారు. సెల్వి కుటుంబ జీవనం కోసం రెండు పాడిఆవులు ఇవ్వడంతో పాటు మూడు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించమని కలెక్టర్ కుఆదేశాలు జారీ చేశారు. మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ. 4 వేలు వంతున ఇద్దరూ ఆడపిల్లలకు రూ. 8 వేలు (18 ఏళ్లు నిండే వరకు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసేవిధంగా, ఆర్థికసాయం కోసం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆ కుటుంబం ఆనందంతో కన్నీటి పర్యంతమైంది. కాళ్లుమొక్కడానికి సెల్వి ప్రయత్నించడంతో వద్దమ్మా.. తప్పు. ఈ ఇంటి పెద్ద కొడుకుగా అండగా ఉంటా అని ధైర్యం చెప్పారు.
దురదృష్టకరం
జీడి. నెల్లూరు రామానాయుడు పల్లె వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఆడపిల్లల పరిస్థితిని వివరిస్తూ, కలత చెందారు. ఆడపిల్లలు, అది కూడా లోకం తెలియని పసిబిడ్డలు వదిలేసి మానవత్వం లేకుండా వ్యవహరించిన ఆ తల్లిదండ్రులు దారుణమైన తప్పు చేశారు. దేశంలో ఇలాంటి మానవత్తం లేని వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఉండడం దురదృష్టకరం. వారి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు వేదిక నుంచి చెప్పే సమయంలో అందరి మొఖాల్లో విషాదం కనిపించింది.
Read More
Next Story