నెల్లూరు:ఆ.. ఆరేళ్ల బాలిక  మృత్యుంజయురాలు...
x
నెల్లూరు జిల్లా ఉదయగిరి వద్ద జరిగిన ప్రమాదం...

నెల్లూరు:ఆ.. ఆరేళ్ల బాలిక మృత్యుంజయురాలు...

ద్విచక్రవాహనాన్ని బోరులారీ ఢీకొన్న ఘటనలో తల్లిదండ్రులు, అక్క మృతి.


ఓ కుటుంబాన్ని బోరు లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. సింగిల్ రోడ్డులో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని బోరులారీ ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తూ ఆరేళ్ల బాలిక గాయాలతో బయటపడింది. శరీరానికి తగిలిన గాయాల బాధతో తల్లడిల్లుతున్న బాలిక తల్లి మృతదేహం వద్ద రోదిస్తూ ఉండడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. స్పందించిన గ్రామస్తులు, దారిన వెళ్లేవారు బాలికను ఆసుపత్రికి తరలించారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం తెల్లపాడు వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఓ కుటుంబం ప్రాణాలు ప్రాణాలు కోల్పోయింది.
నెల్లూరు జిల్లా కలిగిరి కలిగిరి నుంచి ద్విచక్ర వాహనంపై ద్విచక్ర వాహనంపై దూబగుంట గ్రామానికి బయలుదేరారు. వారంతా దూబగుంట గ్రామానికి చెందిన వారే అని పోలీసుల ద్వారా తెలిసింది. కలిగిరి గ్రామం నుంచి చేవలమూడి బాబు (34), భార్య మమత (27) దంపతులు పెద్ద కూతురు (పేరు తెలియలేదు) తో పాటు. ఆరు సంవత్సరాల పాపతో కలిసి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. సరదాగా మాట్లాడుకుంటూ బైక్ పై వస్తున్న వారిని బోరు బండి రూపంలో మృత్యువు వెంటాడింది.

ఉదయగిరి నుంచి సింగిల్ రోడ్డులో ప్రయాణిస్తుండగా తెల్లపాడు గ్రామానికి సమీపంలో కి వచ్చేసరికి ఎదురుగా వచ్చిన ఓ బోరు బండి ఢీకొంది. లారీ వేగానికి బైక్ ప్రయాణిస్తున్న వారు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో పెద్దకూతురు తోపాటు బాబు, మమత దంపతులు ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ లో వారి మధ్య కూర్చుని ప్రయాణిస్తున్న ఆరేండ్ల బాలిక పక్కన పడిపోయింది. తీవ్ర గాయాలకు గురైన ఆ బాలిక రోదన మినంటుంది.
స్పందించిన గ్రామస్తులు
తెల్లపాడు గ్రామం వద్ద బోరు బండి లారీ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఢీకొనడంతో మరణించిన తల్లిదండ్రుల పక్కన కూర్చుని ఆరేళ్ల పాప కన్నీరు మున్నేరుగా రోధిస్తుండడం చూసి గ్రామస్థులు చలించిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ఆరేళ్ల బాలికను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలికకు అక్కడే చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
Read More
Next Story