నెల్లూరు జిల్లాలో ఆంక్షల మధ్య వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బుధవారం పర్యటించనున్నారు. దీంతో నెల్లూరు నగరం పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు రేంజి ఐసీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ స్వయంగా జిల్లా అధికారులతో బందోబస్తుపై సమీక్షించారు.
జిల్లాలో క్వార్ట్జ్ అక్రమ రవాణా చేశారంటూ అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన మాజీ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డిని పరామర్శించడానికి వైసిపి అధ్యక్షుడు జగన్ జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు.
నెల్లూరు జిల్లా ఇన్చార్జి ఎస్పీ దామోదర్ ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. జిల్లాలో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు అకారణంగా ఆంక్షలు విధిస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నెల్లూరు నగరం తోపాటు జిల్లా జైలు వద్ద కూడా భారీగా పోలీసుల మోహరించారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు ఇస్తున్న పోలీసులు
రాష్ట్రంలో అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద పార్టీ అభిమానులు తీసుకురావడంతో హెలికాప్టర్ దెబ్బ తినడం. పల్నాడులో రెంటల పాడు వద్ద జగన్ కాన్వాయ్ కింద ఓ వ్యక్తి మరణించడం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం వద్ద మామిడి తోటల రైతులను పరామర్శించడానికి ys జగన్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలనే పద్యంలో నెల్లూరు జిల్లా పోలీసులు కూడా ఆంక్షలు విధించారు.
జగన్ పర్యటన ఇలా..
వైఎస్. జగన్ బుధవారం ఉదయం 10:30 నిమిషాలకు నెల్లూరు సెంట్రల్ జైలు పక్కన ఏర్పాటు చేసిన హెలిపాడ్ కు చేరుకుంటారు.
11 గంటలకు నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు చేరుకుంటారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములఖత్ అవుతారు.
11:30 నిమిషాలకు నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బయలుదేరి..11:50 నిముషాలకు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమారరెడ్డి నివాసానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 1:00 గంటకు బయలుదేరి 1:15 నిమిషాలకు హెలిపాడ్ కు చేరుకుని..1:25 నిమిషాలకు తాడేపల్లి బయలుదేరి వెళతారు.
కేసులు పెడతాం
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు
ఆత్మకూరు మండలం వాసిలి వద్ద 67వ నెంబర్ జాతీయ రహదారిపై ఆత్మకూరు ఎస్సై జిలానిబాషా ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు. నిర్వహించారు. నెల్లూరు నగరంలోకి రావడానికి ఉన్న అన్నిదారుల్లో పోలీసులు ఇలా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, తమ పార్టీ శ్రేణులను అడ్డకుంటున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. వాహనాల్లో వెళుతున్న వారి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. వాహనాల్లో ఉన్న వారు ఎక్కడి నుంచి వస్తున్నారు. ఎక్కడికి వెళుతున్నారనే విషయాలు తెలుసుకున్న తరువాత పోలీసులు అనుమతిస్తున్నారు.
బెదిరింపులు సరికాదు
వైఎస్ జగన్ పర్యటనలో పరిమితికి మించి జనాలను తరలిస్తే కేసులు తప్పవని పోలీసులు బెదిరిస్తున్నారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జైలు వద్దకు వెళ్లడానికి ముందు హెలిపాడ్ వద్దకు చేరుకోనున్నారు. ఇక్కడికి పదిమందికి మించి హాజరు కావడానికి వీలు లేదని పోలీసులు స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలవడానికి వైఎస్. జగన్ తోపాటు మరో ఇద్దరికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.
జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు కూడా పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు.
ప్రసన్న ఇంటికి
నెల్లూరు టిడిపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని వర్ష పదజాలంతో మాట్లాడిన వ్యవహారంపై అక్కడి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పై కూడా కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార రెడ్డిని కూడా వైఎస్ జగన్ ప్రమర్శించనున్నారు.
"మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ఇంటి వద్ద వందమంది మాత్రమే ఉండాలి. ఆ సంఖ్యకు మించితే వారిపై కేసులు నమోదు చేస్తాం" అని నెల్లూరు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత సంఘటన నేపథ్యంలో శాంతిని భద్రతల పరిరక్షణ కోసం పరిమితి మేరకే జనాలను తీసుకువెళ్లాలి. లేదంటే కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడానికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు.
నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డిని పరామర్శించడానికి ఈ నెల అంటే జూన్ మూడవ తేదీ జగన్ పర్యటనకు కార్యక్రమం ఖరారైంది. నెల్లూరు జిల్లా పోలీసులు అనుమతులు ఇవ్వకుండా వేధించారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
జగన్ ప్రయాణించే హెలికాప్టర్ దిగడానికి చెముడుగుంట వద్ద కేటాయించిన స్థలం అనువైనది కాదని కూడా వైసిపి నెల్లూరు జిల్లా నాయకులు ఆక్షేపన చెప్పారు. ఈ ప్రదేశంలో ముళ్లపదలతో పాటు హై టెన్షన్ విద్యుత్ వైర్లు కూడా ఉండడాన్ని వైసీపీ నాయకులు ప్రధానంగా ప్రస్తావించారు. దీనికి పోలీసులు నుంచి స్పందన లేని పరిస్థితుల్లో జగన్ పర్యటన మొదట వాయిదా పడింది.
8 కిలోమీటర్ల ప్రయాణం
నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్న వైఎస్. జగన్ నగరంలో 8 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో ప్రయాణించనున్నారు. ఎలిఫెంట్ లో దిగే జగన్ నేరుగా జైలు వద్దకు చేరుకుంటారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములఖత్ అవుతారు.
ఆ తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకొని ఆయనతో భేటీ అయ్యే విధంగా పార్టీ నాయకులు కార్యక్రమాలు ఖరారు చేశారు. మొత్తం ఈ పర్యటనలో వైఎస్ జగన్ నెల్లూరు నగరంలో 8 నుంచి 12 కిలోమీటర్ల ప్రయాణించే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమాన్ని సమీక్షించిన నెల్లూరు జిల్లా పోలీసులు అడుగడుగునా భారీగా పోలీసులను మోహరించారు. ప్రధాన కూడళ్లను కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. జనం తరలి రాకుండా నివారించడానికి అవసరమైన ఆంక్షలు అన్ని విధిస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
జగన్ నెల్లూరు పర్యటన ఎలాంటి అనుభవాలను చూపించనున్నది ఇంకొన్ని గంటల్లో తెలుస్తుంది.
భారీ భద్రత
పోలీస్ అధికారులతో సమీక్షిస్తున్న గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ
వైఎస్. జగన్ పర్యటన నేపథ్యంలో బందోబస్తు పర్యవేక్షించడానికి ఏకంగా గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి రంగంలోకి దిగారు. ఇన్ చార్జి ఎస్పీ A.R. దామోదర్ అధికారులతో సమీక్షించారు.
నెల్లూరులో జగన్ పర్యటనకు సుమారు 900 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
"జగన్ పర్యటనలో భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం" అని గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు.
ఆయన ఏమి చెప్పారంటే..
"నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా పర్యవేక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక బృందాలను నియమించాం. నిరంతర నిఘా ఉంటుంది. మాజీ సీఎం జగన్ పర్యటన హాజవుగా సాగేందుకు భద్రతా పరంగా సహకారం అందించండి" అని గుంటూరు రేంజి డీఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ కోరారు. అదనపు ఎస్పీ సీహెచ్. సౌజన్య సీరియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.