Best Panchayat Award | ఢిల్లీ మెచ్చిన పల్లె.. మురిసిన బొమ్మసముద్రం
x

Best Panchayat Award | ఢిల్లీ మెచ్చిన పల్లె.. మురిసిన బొమ్మసముద్రం

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచారు. ఉత్తమ పంచాయతీగా ఆరోగ్య విభాగంలో జాతీయ అవార్డుకుఎంపికైంది.



ఢిల్లీకి 2,153.3 కిలోమీటర్ల దూరంలో మారుమూల ఉన్న చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మసముద్రం ఉత్తమ పంచాయతీ అవార్డుకు ఎంపికైంది. ఈనెల 11వ తేదీ ఢిల్లీలో రాష్ట్రపతి నుంచి దళిత సర్పంచ్ రఘు అవార్డు అందుకోనున్నారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారం కింద అవార్డుకు పంచాయతీకి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు అందివ్వనుంది. రాష్ట్రపతి ద్రౌపదీముర్మ బటన్ నొక్కడం ద్వారా ఈ మొత్తాన్ని పంచాయతీకి ఖాతాకు జమ చేస్తారు.
ఉత్తమ పంచాయతీగా ఎన్నికైందనే సమాచారం అందుకున్న తర్వాత బొమ్మసముద్రం దళిత సర్పంచ్ స్పందించారు.

'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి ఆయనకు శుభాకాంక్షలు చెప్పగానే ఆయన ఆనందపారవశ్వానికి గురయ్యారు. ధన్యావాదాలు చెబుతూనే, "దళితవాడ నుంచి వెళ్లి రాష్ర్టపతి చేతులమీదుగా అవార్డు అందుకుంటానని కలలో కూడా ఊహించలేదు సార్.. చాలా ఆనందంగా ఉంది. అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది" అని తన్మయత్వానికి లోనయ్యారు.
"పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో వైద్య శాఖ కీలక పాత్ర పోషించింది" అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకోవడం ద్వారా ప్రజలకు అందించిన సేవలకు కేంద్రం గుర్తించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.
వరసిద్ధి వినాయకుడు ఉన్న చోట..
చిత్తూరు జిల్లా ఐరాల మండలం వినాయక స్వామి ఆలయం గుర్తుకు వస్తుంది. ఇక్కడి ఐరాల మండలంలో మారుమూల జాతీయ రహదారిపై ఉన్న బొమ్మసముద్రం గ్రామం ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది.
ఐరాల మండలానికి 2153.3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఢిల్లీకి వెళ్లాలంటే 38 గంటలు ప్రయాణించాలి. అంత దూరంలో ఉన్న బొమ్మసముద్రంలో జరిగిన సంక్షేమాన్ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు అధికారులు గుర్తించడం ద్వారా ఇవ్వనున్న అవార్డు మా పల్లెకు పండగ తీసుకువచ్చిందని సంబరపడిపోతున్నారు.
రాష్ట్రంలో 1127 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. అందులో 1000 94 మండల ప్రజాపరిషత్ (mandal Praja Parishat) ల పరిధిలో 21 వేల 943 పంచాయతీలు ఉన్నాయి. అందులో..
పారిశుధ్యానికి ప్రాధాన్యం..
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండల పరిధిలో ఓ చిన్న పంచాయతీ బొమ్మసముద్రం. ఈ పంచాయతీలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం అని గ్రామ సచివాలయ కార్యదర్శి టీ. మోనిక చెప్పారు.

"పంచాయతీలో ప్రతి ఇంటి నుంచి ఉదయం పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరిస్తారు. ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి నిలిపాం " అని పంచాయతీ కార్యదర్శి మౌనిక చెబుతున్నారు.
బొమ్మసముద్రం పంచాయతీ పరిధిలో ఐదు గ్రామాలు ఉన్నాయి. తిరువనంపల్లె, తిరువనంపల్లె హరిజనవాడ, బొమ్మసముద్రం, బొమ్మసముద్రం హరిజనవాడ, తిమోజి పల్లె మజరా గ్రామాలతో ఈ పంచాయతీ ఏర్పడింది.
జనాభా... పాఠశాలలు
ఈ పంచాయతీలో మొత్తం జనాభా 1670 మంది ఉన్నారు. పంచాయతీలో తిరువనంపల్లెలో ఉన్న పాఠశాలలో 12 మంది, బొమ్మసముద్రం ప్రాథమిక పాఠశాలలో ఐదు మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఆ బడిలో ఒక ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతున్నారు. ఇవి కాకుండా అంగన్వాడీ కేంద్రాలు కూడా రెండు ఉన్నాయి.
ఈ ఐదు గ్రామాలకు బొమ్మసముద్రం గ్రామం పంచాయతీ కేంద్రంగా ఉంటే, ఇక్కడ నాలుగు వీధులు ఉన్నాయి. ఈ పల్లె తో పాటు మిగతా గ్రామాలలో కూడా పారిశుధ్య కార్మికులు ఉదయం ఇళ్ల వద్దకే వెళ్లి చెత్త సేకరించి వూరి వెలుపలకు తరలిస్తున్నారు.
"గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థను కూడా చక్కదిద్దాం. కార్మికులు కూడా బాగా పనిచేస్తున్నారు. వారికి వేతనాలు కూడా సకాలంలో చెల్లిస్తున్నాం" అందువల్లే పనుల్లో చిత్తశుద్ధి చూపిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి మోనిక చెబుతున్నారు.
ఆరోగ్య రక్షణ కోసం..

బొమ్మసముద్రం పంచాయతీలో సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వైద్య ఆరోగ్య శాఖ, అంగన్వాడి వర్కర్లు తమ బాధ్యతలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. అందువల్లే, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి బొమ్మసముద్రం పంచాయతీని ఉత్తమ కేటగిరీలో మొదటి స్థానం కేటాయించారు.
ఈ పంచాయతీలో ఏం జరిగింది..
సాధారణంగా ఉత్తమ పంచాయతీ అవార్డులకు ప్రధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని పారామీటర్స్ తో జాబితా ఇస్తుంది. ఆ మేరకు పంచాయతీలు నివేదికలు పంపించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే 15 ప్రశ్నలతో కూడిన నివేదికలను బొమ్మసముద్రం నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు ఏడాది కిందటే పంపించినట్లు పంచాయతీ కార్యదర్శి మోనిక చెప్పారు.
బొమ్మసముద్రం పంచాయతీలో మాత శిశు మరణాలు లేకుండా నివారించడంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన పాత్ర పోషించింది.
గర్భిణీలు, బాలింతల్లోనే కాకుండా, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందించారు. యుక్త వయసు బాలికలకు కూడా అదే తరహా ఆహారం అందించడం ద్వారా రక్తహీనత లేకుండా కాపాడి ఆరోగ్య సమస్యలకు తాగు లేకుండా చేశారు. అంతేకాదు,
2020-23 ఆర్థిక సంవత్సరంలో బొమ్మసముద్రం పంచాయతీలో ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. దీనికి ప్రధానంగా, గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితి మెరుగుపరచడంతో పాటు, మురుగునీటి కాలువల్లో నిలువ లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో దోమలు లేకపోవడం వంటి కారణంతో జ్వరాలు వ్యాపించకుండా పంచాయితీ, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
ఈ నివేదికలు పరిశీలించిన తర్వాత, కేంద్ర బృందం కూడా అధ్యాయం చేసింది. దీంతో బొమ్మసముద్రం ను ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేయడానికి ఆస్కారం ఏర్పడింది.
సిబ్బందికి కొరత లేదు..
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం కూడా ఐరాల మండలంలోనే ఉంది. ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (primary health centre- Phc) లో వైద్య సిబ్బంది కొరత లేదని డాక్టర్ రాజేశ్వరి చెప్తున్నారు. శనివారం సాయంత్రం ఆమె 'ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ,

"మా పీహెచ్సీలో సిబ్బంది కొరత లేదు. 14 మంది సేవలు అందిస్తున్నారు. అందులో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్స్ లు, నలుగురు సూపర్వైజర్లు ఉన్నారు" అని డాక్టర్ రాజేశ్వరి చెప్పారు. "24/7 ఉన్న ఈ ఆసుపత్రిలో సిబ్బంది రాత్రి కూడా అందుబాటులో ఉంటారు. అదనంగా ఓ స్టాఫ్ నర్స్ ను నియమిస్తే బాగుంటుంది" అని ఆమె కోరారు.
"ఆరోగ్యవంతమైన బొమ్మసముద్రంగా తీర్చిదిద్దారు. జాతీయస్థాయిలో అవార్డు సాధించినందుకు అభినందనలు" జిల్లా అధికారులు కురిపించిన ప్రశంసలకు మాకు బాగా ఆనందం కలిగించిన సందర్భం" ఇది మా జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి కలిగించింది అనే డాక్టర్ రాజేశ్వరి తన ఆనందాన్ని పంచుకున్నారు. బొమ్మసముద్రంలో ఏఎన్ఎం కోసం ఓ భవనం నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి " అని యువ డాక్టర్ రాజేశ్వరి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విలేజ్ క్లినిక్ ద్వారా వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
యువత తలుచుకుంతే ఏదైనా సాధ్యమే అనేది బొమ్మసముంద్రంలో యువ అధికారులు చెప్పకనే చెప్పారు.

మరో డాక్టర్ స్వాతిసింధూర మాట్లాడుతూ, "పల్లెల్లో ఆరోగ్యసూత్రాలు చెప్పడంలో సఫలం అయ్యాం. ప్రజలు సహకరించారు" అందుకే మాతాశివుమరణాలు లేకుండా చేశాం" అన్నారు. "ప్రజల సహకారం ఉంటే మాత్రం అద్భుతాలు చేయవచ్చు" అని కూడా డాక్టర్ సింధూర అభిప్రాయపడ్డారు. "రక్తహీనత వల్ల అనేక రోగాలు వస్తాయి. ఈ సమస్య నుంచి అధిగమించడానికి ప్రజలను చైతన్యం చేశాం" అని స్వాతిసింధూర చెప్పారు. "అంగన్ వాడీ కేంద్రాల సిబ్బంది అందించిన సహకారం వల్ల ప్రజలు, ప్రధానంగా, పిల్లలు, యుక్త వయసు ఆడపిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చాం" అని ఆమె వివరించారు.
ఇంజినీరింగ్ చదివి..

బొమ్మసముద్రం పంచాయతీ కార్యదర్శి చదువుకున్నది ఇంజినీరింగ్ (B.Tech), చేస్తున్న ఉద్యోగం మాత్రం గ్రామీణాభివృద్ధి శాఖలో కావడం గమనార్హం. ఈ విషయాన్ని ప్రస్తావిస్తే, ఆమె ఇచ్చిన సమాధానం... "సార్ నేను తిరుపతికి ఆనుకుని ఉన్న మంగళంలో పుట్టాను. అక్కడే ఇంజినీరింగ్ కాలేజీలో చదవాను. అదృష్టవశాత్తు ఈ ఉద్యోగం వచ్చింది " అని చెప్పారు.
"ఈ ఉద్యోగం నాకు చిన్నప్పుడే నేర్చుకున్న పాఠాలు, పారశుధ్య సిబ్బందిని ప్రశ్నించిన రోజులు గుర్తుకు వచ్చాయి " అని తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. "మంగళం వద్ద మురుగునీరు నిలిస్తే, ఫిర్యాదు చేశాం. అధికారులను ప్రశ్నించాం" అని చెబుతున్న ఆమె ప్రస్తుతం ప్రజలు ఎలాంటి సేవలు కోరుకుంటారు. వారి సమస్యలు ఏమిటనేది అీర్ధం చేసుకున్న మాకు పరిష్కరించడం అనేది చాలా సులభమైందని వివరించారు.
కేంద్రం ఇవ్వనున్న అవార్డును ప్రస్తావించగా, "ఇది చాలా ఆనందదాయకమైన సందర్భం. మాకు జీవితంలో గుర్తుండిపోయే రోజు " అని వ్యాఖ్యానించిన ఆమె, మా సేవలకు ప్రజల నుంచే ఆశీస్సుులు మెండుగా ఉన్నాయి సర్. ఇవే మాకు మొదట దక్కిన అవార్డులు అని అభివర్ణించారు.
కార్యాచరణ ఉందంటున్న సర్పంచ్
ఉత్తమ పంచాయతీ అవార్డు కింద బొమ్మసముద్రానికి కోటి రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అందించనున్నారు. ఇంతపెద్ద మొత్తం ఏమి చేస్తారని ఆ పంచాయతీ నుంచి సర్పంచ్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న వి. రఘు తన కార్యాచరణను వివరించారు.
"నాకు ఈ అదృష్టం దక్కుతుందని కలలో కూడా ఊహించలేదు. డాక్టర్లు, అంగన్వాడీ, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల కష్టానికి గుర్తింపు దొరికింది" అని సర్పంచ్ రఘు వ్యాఖ్యానించారు.
"కేంద్రం అందించే కోటి రూపాయలతో పంచాయతీలో తిరణంపల్లెలో మురుగునీటి పారుదల, మంచినీటి కోసం పైప్ లైన్లు, వేయిస్తా " అని సర్పంచ్ రఘు చెప్పారు. "శిథిలావస్థలో ఉన్న బొమ్మసముద్రం గ్రామంలోని పాఠశాల భవనం మరమ్మతుతో పాటు బీసీ కాలనీలో వీధిదీపాల ఏర్పాటు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటా" అని రఘు తన మదిలో మాటలు చెప్పారు. అధికారులు, ప్రభుత్వ శాఖల సిబ్బంది సహకారం వల్లే ఇదంతా జరిగింది. వారి తోడ్పాటుతో మరింతగా తీర్చిదద్దడానికి చర్యలు తీసుకుంటానని ఆయన చెబుతున్నారు. మత్తానికి కేంద్రం ప్రకటించిన ఉత్తమ పంచాయతీ అవార్డుతో బొమ్మసముద్రంలో పండుగే కాదు. ఆనందంలో మునిగితేలుతోంది.



Read More
Next Story