పుట్టపర్తిలో నాయక్ కాంస్య విగ్రహం... వెల్లడించిన మంత్రి లోకేష్
x

'పుట్టపర్తి'లో నాయక్ కాంస్య విగ్రహం... వెల్లడించిన మంత్రి లోకేష్

కల్లి తండాలో వీరజవాన్ నాయక్ స్మారక స్థూపం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు.


అనంతపురం జిల్లా పెనుగొండ నియోజవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చరిత్ర పుటల్లో రాష్ట్ర ప్రభుత్వం ఓ పేజీ కేటాయించింది.

కాశ్మీర్ యుద్ధభూమిలో ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ ఎం. మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలిచింది.

యుద్ధభూమిలో ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. భావితరాలకు నాయక్ త్యాగం గుర్తుండిపోయేలా చేస్తామని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.


శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదివారం ఉదయం చేరుకున్నారు. వీరజవాన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రులు సత్యకుమార్, ఎస్. సవితమ్మ, అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నాయక్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు
తండాలో స్మారకస్థూపం.. కాంస్య విగ్రహం
దేశ రక్షణ కోసం చివరి క్షణం వరకు పాకిస్థాన్ సైనికులతో పోరాడుతూ, వీరమరణం చెందిన ఎం. మురళీనాయక్ త్యాగాలను భావితరాలకు గుర్తుండేలా చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. దీని కోసం కల్లి తండాలో మురళీనాయక్ స్మారక స్థూపం నిర్మిం చాలని రాస్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
"తెలుగు ప్రజలే కాదు. భారతదేశం గుర్తించుకునేలా సత్యసాయి జిల్లా కేంద్రంలో నాయక్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది" అని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. చిన్నవయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మురళీనాయక్ ఆశయాలు వృథాకానివ్వబోమని ఆయన చెప్పారు.
తండ్రికి ఉద్యోగం
ప్రాణత్యాగం చేసిన మురళీనాయక్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
"కల్లి తండాకు చెందిన దంపతులు ఎం. జ్యోతి బాయి, శ్రీరామ నాయక్ వీర జవాన్ మురళీ నాయక్ ఒక్కడే కొడుకు" వారికి ప్రభుత్వం పెద్దకొడుకుగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. మురళీ తండ్రి శ్రీరామ నాయక్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి లోకేష్ వెల్లడించారు.
వీరజవాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ సాయం అందించాలనే నిర్ణయాన్ని మంత్రి నారా లోకేష్ తో కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. నాయక్ కుటుంబానికి రూ. 50 లక్షల ప్రభుత్వ పరిహారంతో పాటు వ్యక్తిగతంగా రూ. 25 లక్షలు సాయం అందిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
స్పందించిన మంత్రి సవిత

యుద్ధభూమిలో తన నియోజకవర్గంలోని జవాన్ ప్రాణాలు వదిలారనే సమాచారం అందిన వెంటనే మంత్రి ఎస్. సవితమ్మ మొదట స్పందించారు. పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ కల్లి తండాకు చేరుకున్నారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన మంత్రి సవితమ్మ వ్యక్తిగతంగా ఐదు లక్షలు పరిహారం అందించారు. ఆ తరువాత కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రూ.1.75 లక్షల చెక్కును మురళీనాయక్ తల్లిదండ్రులకు అందించడం ద్వారా అండగా నిలిచారు.

Read More
Next Story