
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ..
టిటిడి ఆలయాల్లో అన్నప్రసాదాలు పంపిణీకి ఏర్పాట్లు చేశామన్న మంత్రి ఆనం
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమ్మవారికి సోమవారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు.
తిరుచానూరు ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి రామనారాయణరెడ్డికి ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వాగతించారు. టిటిడి జేఈఓ వి. వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
మంత్రి రామనారాయణరెడ్డికి పరివట్టం కట్టిన తరువాత వెండిపళ్లెంలో అమ్మవారికి సమర్పించే చీర, సారెను ఉంచారు. ఆ పళ్లెం తలపై పెట్టుకున్న మంత్రి రామనారాయణరెడ్డి అమ్మవారి ఆలయం ధ్వజస్తంభం వద్ద మొక్కులు చెల్లించి, ఆలయంలోకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుని వచ్చిన సారెను ఆలయ అర్చకులకు అందించారు. ఆ తరువాత ఆశీర్వాద మండపంలో మంత్రి రామనారాయణరెడ్డికి వేదపండితులు వేదాశీర్చనం అందించారు. టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం తీర్థప్రసాదాలు అందించారు. ఆయన వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ జీ. నరసింహయాదవ్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ. మునికృష్ణ తోపాటు నాయకులు అధికారులు ఉన్నారు.
అనంతరం మంత్రి రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..

