తిరుపతిలో.. మారిషన్ ప్రధాని ఆధ్యాత్మిక పర్యటన
x
తిరుమల ఆలయం వద్ద మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్‌చంద్ర రాంగుళం, వీణా రాంగుళo దంపతులతో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, మంత్రి రాంనారాయణరెడ్డి, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి

తిరుపతిలో.. మారిషన్ ప్రధాని ఆధ్యాత్మిక పర్యటన

బ్రహ్మర్షి, శ్రీవారి ఆశీస్సుల కోసమే వచ్చా.. నవీన్ చంద్ర రాంగుళం


ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన కోసం మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్‌చంద్ర రాంగుళం, వీణా రాంగుళo దంపతులు సోమవారం మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామాపురంలోని బ్రహ్మర్షి గురూజీ సిద్ధేశ్వర తీర్థ ఆశ్రమాన్ని వారు సందర్శించారు. ఆ తరువాత తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు.


రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రాంగుళం, వీణా రాంగుళం దంపతులు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా అధికారులు స్వాగతం పలికారు.

చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం సి. రామాపురంలోని బ్రహ్మర్షి గురూజీ సిద్దేశ్వర తీర‌్థ ఆశ‌్రమాన్ని మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రాంగుళం, వీణా రాంగుళo దంపతులు సందర్శించారు. అక్కడి సిద్దేశ్వర తీర‌్థ ఆశ‌్రమ పీఠాధిపతి బ్రహ్మర్షి గురువానంద గురుజీ, రాష్ట్రదేవాదాయ,ధర‌్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్త నాని, తుడా అధ్యక్షులు దివాకరరెడ్డితో మారిషస్ ప్రధానమంత్రికి శంఖానాధంతో అపూర్వ స్వాగతం పలికారు. ప్రధానమంత్రి దంపతులను పీఠాధిపతి బ్రహ్మర్షి గురువానంద గురూజీ శాలువాలు కప్పి ,ప్రత్యేక జ్ఞాపికలతో ఆశీర‌్వదించారు.

మారిషస్ లో విద్య, వైద్య సేవలకు బ్రహ్మర్షి ఆశ్రమం నుంచి వెయ్యి మిలియన్ డాలర్లు వితరణ చేస్తున్నట్లు బ్రహ్మర్షి ఆశ్రమ గురూజీ ప్రకటించారు.
ఆశీర్వచనం కోసమే వచ్చా..
మారిషష్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్‌చంద్ర రాంగుళo మాట్లాడుతూ.. హిందువుగా బ్రహ్మర్షి ఆశ్రమానికి రావటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా అని అన్నారు. గురూజీ ఆశీస్సులతో తాను నాలుగు సార్లు మారిషస్ ప్రధానమంత్రి అయ్యానని తెలిపారు. గురూజీకి కృతజ్ఞతలు తెలియజేసి,వారి ఆశీస్సులు పొందటానికి ఆశ్రమానికి వచ్చానని మారిషన్ ప్రధాని డా, నవీన్‌చంద్ర రాంగుళo తెలిపారు. అనంతరం గురూజీ ఆశ్రమం నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు.
నిరాడంబర జీవనం
బ్రహ్మర్షి గురువానంద గురూజీ మాట్లాడుతూ ఉన్నత స్థితిలో ఉన్నా, సాధారణ జీవనం సాగించటం మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రాంగుళo ప్రత్యేకత అని ప్రశంసించారు. డాక్టర్ నవీన్‌చంద్ర రాంగుళo తండ్రి శివశంకర్ రాంగుళo మారిషస్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. "మారిషెష్ పితామహుడు"గా పేరుగాంచినట్లు తెలిపారు. నవీన్‌చంద్ర రాంగుళo చేపట్టిన ప్రజా సేవకు గుర్తింపుగా ఇప్పటికే నాలుగుసార్లు మారిషస్ ప్రధానమంత్రిగా ఎంపికయ్యారని వివరించారు. మారిషన్ ప్రధాన మంత్రి డా, నవీన్‌చంద్ర రాంగుళo దంపతులను "లక్ష్మీనారాయణలు"గా గురూజీ పేర్కొన్నారు. బ్రహ్మర్షి ఆశ్రమం నుంచి మారిషస్ దేశంలో విద్య వైద్య అభివృద్ధికి వెయ్యి మిలియన్ల డాలర్లను వితరణ చేస్తున్నట్లు గురూజీ ప్రకటించారు. రామచంద్ర పురం బ్రహ్మర్షి ఆశ్రమం వద్ద తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఆర్ సి పురం తహసిల్దార్ మధుసూదన్ రావు మారిషన్ ప్రధాన మంత్రి డా, నవీన్‌చంద్ర రాంగుళo గారికి వీడ్కోలు పలికారు.

శ్రీవారి సేవలో..
బ్రహ్మర్షి ఆశ్రమం నుంచి రోడ్డు మార్గంలో మారిషస్ ప్రధాని దంపతులు డాక్టర్ నవీన్ చంద్ర రాంగుళం, వీణా రాంగుళం రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి వారికి ఆలయ మర్యాదలతో స్వాగతించారు.

మారిషస్ డాక్టర్ నవీన్ చంద్ర రాంగుళం, వీణా రాంగుళం ఆలయంలోకి వెళ్లి, బలిపీఠం వద్ద మొక్కుక్కున్నారు. ఆ తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనాలు అందించారు. టీటీడీ అధికారులు వారికి శ్రీవారి తీర్ధ, లడ్డూ ప్రసాదాలు అందించారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఫొటో జ్ణాపికగా అందించారు.

ఆలయం వెలుపలికి రాగానే మారిషన్ ప్రధాని డాక్టర్ నవీన్‌చంద్ర రాంగుళం, వీణా రాంగుళం దంపతులు యాత్రికులకు అభివాదం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఆలయం వెలుపల గ్యాలరీల్లో బారికేడ్ల వెనుక ఉన్న యాత్రికులతో మారిషన్ ప్రధాని డాక్టర్ నవీన్‌చంద్ర కరచాలనం చేయడం ద్వారా వారితో ఆనందం
Read More
Next Story