
Markapuram District | జిల్లా కేంద్రంగా మార్కాపురం : సీఎం ప్రకటన
రాష్ట్రంలో అదనంగా మరో జిల్లా ఏర్పాటు కానుంది. ఎన్నికల హామీ నెరవేరుస్తా అని సీఎం చంద్రబాబు శనివారం ఈ ప్రకటన చేశారు.
రాష్ట్రంలో మరోసారి జిల్లాల విభజన జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు తోడు అదనంగా మరో కేంద్రం ఏర్పాటు కానుంది.ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లా చేయడానికి చర్యలు తీసుకుంటా అని సీఎం చంద్రబాబు శనివారం ప్రకటించారు.
"సార్వత్రిక ఎన్నికల ముందు మార్కాపురం జిల్లా కేంద్రం చేస్తా అని హామీ ఇచ్చా" అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఆ మాటను త్వరలోనే సహకారం చేస్తా అని హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్ర ఏర్పడిన విషయం తెలిసిందే. విభజిత రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా సీఎం ఎన్ చంద్రబాబు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత
2019 ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పార్లమెంట్ స్థానాలను జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేసి పునర్విభజన చేస్తానని అంతకుముందే వైఎస్ జగన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. దీనిపై స్పందించిన అప్పటి విపక్షంలోని టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ వివక్షతతో వ్యవహరించాలని కూడా ఆరోపించారు.
" జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది"అని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు.
బ్రిటిష్ కాలంలోనే ముందు చూపుతో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ జరిగింది. రెవెన్యూ డివిజన్ కేంద్రాలను కాదని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే కొత్త ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సమర్థించుకున్నారు.
రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమలో రాజంపేట, మదనపల్లి, హిందూపురం వంటి పట్టణాలు కాకుండా వేరే చోట జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కోవలో మార్కాపురం జిల్లా కేంద్రంగా కాకుండా చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు పక్క జిల్లాలో కలపడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు ఒక జిల్లాలో ఇంకొన్ని మండలాలు కొత్త జిల్లాల్లో ఉండడం వల్ల పరిపాలన వ్యవహారాలకు ఇబ్బందికరంగా మారింది. ఆ తరహాలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాలు నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చాయి. కొన్ని నియోజకవర్గాలు పాత ప్రకాశం జిల్లా పరిధిలోనే ఉన్నాయి. భౌగోళిక పరంగా పరిశీలిస్తే, రాయలసీమలోని కొన్ని పట్టణాలను ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కూడా జిల్లా కేంద్రం చేయడానికి అనువైన స్థలం, భవనాలు, పరిపాలన రీత్యా సౌలభ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ వివక్షతతోనే వ్యవహరించారని ఆరోపణలు ఎక్కువ వినిపించాయి.
ఆ కేంద్రాలను జిల్లాలు చేయాలని రాజకీయాలను పక్కన ఉంచిన అన్ని పార్టీలు ఐక్యంగా రోజుల తరబడి వైసీపీ ప్రభుత్వ కాలంలో నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. చాలామందిపై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి. అందులో ప్రస్తుత టిడిపి కూటమిలో ఎమ్మెల్యేలుగా ఉన్న వారి పైన కూడా కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా,
ఎన్నికల హామీ మేరకు మార్కాపురంలో జిల్లా కేంద్రం చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై ఆ ప్రాంతంలో హతం అవుతోంది.
సుదీర్ఘకాలం జిల్లా కేంద్రాల కోసం పోరాటాలు సాగించిన రాయలసీమ ప్రాంత ప్రజలు ప్రధానంగా జిల్లా సాధన సమితి మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై
మదనపల్లి జిల్లా సాధన సమితి కన్వీనర్ పిటీఎం శివ ప్రసాద్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో మాట్లాడుతూ "మదనపల్లి ను జిల్లా కేంద్రంగా చేయాలని ఉద్యమానికి ఊపిరి పోస్తాం. అన్ని పక్షాల మద్దతు మళ్ళీ సమీకరిస్తాం" అని స్పష్టం చేశారు.
Next Story