జగన్ పర్యటనలో.. ప్రభుత్వంపై పెల్లుబుకిన ఆగ్రహం
x
బంగారుపాలెంలో రోడ్డుపై మామిడికాయలు తొక్కిస్తున్న రైతులు

జగన్ పర్యటనలో.. ప్రభుత్వంపై పెల్లుబుకిన ఆగ్రహం

బంగారుపాలెంలో మామిడికాయలు రోడ్డుపై తొక్కించి రైతుల నిరసన.


వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. ప్రభుత్వంపై మామిడి రైతుల నిరసన కట్టలు తెంచుకుంది. పోలీసుల ఆంక్షలు పటాపంచలు చేస్తూ, ఊహించని విధంగా రైతులు టన్నుల కొద్ది మామిడికాయలు జాతీయ రహదారిపై తొక్కించి, నిరసన వ్యక్తం చేశారు.

తన కాన్వాయిలో పార్టీ శ్రేణులపై లాఠీఛార్జ్ చేయడంపై వైయస్ జగన్ కన్నెర్ర చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం లో బుధవారం మధ్యాహ్నం కనిపించిన భావోద్వేగాలు ఇవి.

ధరలు లేక నష్టపోయిన మామిడి రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్ బెంగళూరు నుంచి బుధవారం ఉదయం బంగారు పాలెం చేరుకున్నారు. ఆయన కాన్వాయ్ హెలిపాడ్ నుంచి బయలుదేరింది.
వైయస్ జగన్ కాన్వాయ్ వెంట వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు జేజేలు పలుకుతూ వెంట సాగుతున్నారు.
అదే సమయంలో...
నలిగిన మామిడికాయలు

Ys జగన్ రాక నేపథ్యంలో బంగారుపాలెం వద్ద ఉన్న మామిడి మార్కెట్ యార్డు వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. పోలీసులు సైతం పసిగట్టలేని విధంగా మామిడికాయల లోడుతో ఉన్న ట్రాక్టర్లను సిద్ధంగా ఉన్నాయి. ట్రాక్టర్లకు ముందు వైసీపీ జెండాలు కట్టి ఉన్నారు. కొద్దిసేపట్లో మార్కెట్ యార్డు వద్దకు జగన్ కాన్వాయ్ చేరుకోబోతోంది. వైసిపి మద్దతుదారులైన రైతులు, కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఊహించని విధంగా..
మధ్యాహ్నం 1.30 :
వైసీపీ జెండాలు ఉన్న ఐదు టన్నుల మామిడికాయల లోడుతో ఉన్న ట్రాక్టర్లు రోడ్డుపైకి వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతుంటే..
ట్రాక్టర్ ట్రాలీ నుంచి మామిడికాయలు జాతీయ రహదారిపై వరుసగా తోలుకుంటూ వెళ్లారు. ఆ ట్రాలీ చక్రాల కింద మామిడికాయలు నుజ్జు అయ్యాయి. అదే బాటలో మరో ట్రాక్టర్ నుంచి తోతాపురి రకం మామిడికాయలు రోడ్డుపై జారవిడుచుకుంటూ వెళ్లారు. మరో ట్రాక్టర్ ఆ కాయలను తొక్కించుకుంటూ వెళ్ళింది.
"మామిడి ధరకు మద్దతు ధర దక్కని రైతులు ఇలా నిరసన" వ్యక్తం చేశారు.
బంగారుపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ పరిణామంతో పార్టీ కార్యకర్తలే కాదు. స్థానికులు, ప్రజలు నివ్వెర పోయారు.
రైతుల నుంచి నిరసన ఈ విధంగా ఉంటుందని ఊహించని పోలీసులు కూడా అవ్వక్కయ్యారు. జగన్ పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
వైసిపి క్యాడర్ అభిమానం ముందు ఆంక్షలు పనిచేయలేదు. నిర్బంధాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఊహలకు అతీతంగా వైసిపి మద్దతుదారులు భారీగా హాజరు కావడం వల్ల బంగారి పాలెం జనసంద్రంగా మారింది.
రైతు కడుపు మండింది
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పూతలపట్టు నియోజకవర్గంలో మామిడి దిగుబడి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పోతాపురి రకం మామిడికి 12 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. అందులో నాలుగు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహ నగదు ఇస్తే, మిగతా ఎనిమిది రూపాయలు మామిడి కాయలు కొనుగోలు చేసే గుజ్జు పరిశ్రమలు చెల్లించే విధంగా ఆదేశాలు జారీ చేశారు.
చిత్తూరు జిల్లాలోని మామిడి గుచ్చు పరిశ్రమలు రైతులు నుంచి నేరుగా మామిడికాయలు కొనలేదు. ర్యాంపుల ద్వారా అంటే మరో వ్యాపారిని ఏర్పాటు చేసుకుంది. ఎనిమిది రూపాయలకు బదులు ఆ వ్యాపారి రైతుకు కిలో మామిడి కి ఒకటిన్నర నుంచి రెండు రూపాయలు మాత్రమే అతి కష్టం మీద చెల్లించారు. రోజుల తరబడి ట్రాక్టర్ లోడలతో నిరీక్షించిన రైతులకు తీరా ఫ్యాక్టరీ వద్దకు వెళ్లేసరికి భంగపాటు తప్పలేదు.
ట్రాక్టర్ ట్రాలీలో రోజుల తరబడి నిలువ ఉంచిన కాయలు మాగిపోవడం వల్ల ఫ్యాక్టరీ యాజమాన్యాలు వాటిని కొనుగోలు చేయకుండా తిరస్కరించాయి. ఇదిలా ఉంటే..
బంగారుపాలెం వద్ద ఉన్న మామిడికాయల మార్కెట్ ప్రైవేట్ వ్యక్తులు అంటే వ్యాపారులు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి మామిడి కాయలు తీసుకొచ్చే రైతులకు కూడా గిట్టుబాటు ధర లభించలేదు. మూడు నుంచి ఐదు టన్నుల ఉన్న మామిడికాయల లోటుతో వచ్చే ట్రాక్టర్కు కనీస గిట్టుబాటు ధర కూడా లభించలేదు అనేది ఇక్కడ రైతుల ఆవేదన.
ఈ ప్రైవేట్ మార్కెట్ యార్డులో పిలవకు ఒక రూపాయి నుంచి, ఒకటిన్నర రూపాయి మాత్రమే దక్కింది అనేది విస్తృతంగా ప్రచారం జరిగింది.
రంగంలోకి వైసిపి
మామిడి రైతుల కష్టాలపై మీడియాలో విస్తృతంగా వస్తున్న కథనాలు. పార్టీ నాయకుల ద్వారా సమాచారం అందుకున్న వైసిపి చీఫ్ వైఎస్ జగన్ బంగారు పాలయంలో వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. దగా పడిన రైతులకు భరోసా ఇవ్వడానికి ఆయన ఈ ప్రాంతానికి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
బంగారుపాలెంలో వైయస్ జగన్ పర్యటన కలకలం రేపింది. ప్రభుత్వంలో కూడా కదలిక కనిపించింది. ఈయన పర్యటన పూర్తయిన తర్వాత ఎలాంటి ఫలితాలు ప్రభుత్వం నుంచి వస్తాయి అనేది వేచి చూడాలి.


Read More
Next Story