Brutal murder | వ్యక్తిని హత్య చేసి... కాలు నరికి ఊరేగింపు
x
మృతుడు శేషన్న. బైక్ లో కాలు తీసుకుని వెళుతున్న నిందితులు

Brutal murder | వ్యక్తిని హత్య చేసి... కాలు నరికి ఊరేగింపు

కర్నూలులో గగుర్పొడిచిన ఘటన.


వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కాలు నరికేసి, బైక్ పై ఊరేగిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద పడేశారు. ఒళ్ళు గగురుపొడిచే సంఘటన కర్నూలు నగరంలో మంగళవారం రాత్రి జరిగింది.

గతంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో మొదట పోలీసులు కూడా సరిగా స్పందించలేదనేది మృతుడి కూతురు చేసిన ఆరోపణ. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కర్నూలు నగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూదిరెడ్డిపల్లికు చెందిన కురువ శేషన్నకు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం మహిళ ఇంట్లో తెలియడంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. దీనిపై పరస్పరం ఫిర్యాదులు కూడా పెట్టుకున్నారు. ఇదిలావుండగా, మంగళవారం రాత్రి శేషన్న ఇంట్లోకి వెళ్లి నలుగురు హత్య చేశారు. ఆయన కాలు నరికేసి ఊరేగిస్తూ తీసుకెళ్లడం కలకలం రేపింది. ఈ ఘటనపై శేషన్న కూతురు మాట్టాడుతూ,
"నన్ను ఓ వ్యక్తి గట్టిగా పట్టుకున్నాడు. మిగతా ముగ్గురు మా నాయనను చంపారు" అని శేషన్న కూతురు ఆరోపించారు.
గత నెల 30వ తేదీ
రెండు రోజుల కిందట మా ఇంటిపైకి దాడికి వచ్చిన విషయంపై
"పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళితే స్పందించలేదు" అని శేషన్న కూతురు ఆరోపించారు.
గ్రామంలోని కొందరు తమపై దాడులకు దిగుతున్న విషయంపై పోలీసులు చెబుదామని వెళితే, కేసు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. నా తండ్రిపైనే రేప్ కేసు ఉంది. మరుసటి రోజు పొద్దున్నే రమ్మని పోలీసులు సూచించారని ఆ మహిళ చెప్పింది.
ఇదిలా ఉంటే..
సూదిరెడ్డిపల్లెలోని శేష ఇంటికి నలుగురి వ్యక్తులు వేటకుడవళ్ళు, కత్తులతో వెళ్లారు. ఇంట్లో పిల్లలు ఉంటే వారిని బయటికి పంపించారు అని శేషన్న కూతురు ఆరోపించింది. కొద్దిసేపటికి ఓ వ్యక్తి నన్ను చేతులు గట్టిగా బంధించి పట్టుకుంటే, మరో ముగ్గురు నా తండ్రి శేషనన్ను దారుణంగా హత్య చేశారని ఆరోపించింది.
కాలు నరికి... ఊరేగింపు
ఇంట్లోనే శేషన్నను నిందితులు హత్య చేశారు. ఆయన కాలు నరికివేసి వెంట తీసుకొని బైక్లో బయలుదేరారు. కర్నూలు నగర వీధుల్లో ఆ ముగ్గురు రక్త మోడుతున్న కాలు తీసుకుని వెళ్లడం చూసిన ప్రజలు భయకంపితులయ్యారు. గతంలో ఎప్పుడు కూడా ఈ తరహా కిరాతక హత్య జరగలేదు అనేది అక్కడి వారు చెబుతున్న మాట.
శేషన్న కాలును కర్నూలు నగరం రూరల్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో పడవేసి వెళ్లిపోయారని తెలిసింది. ఆ తర్వాత హత్యకు పాల్పడిన పరుశురాం అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురు కూడా పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిసింది.

ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని కర్నూలు రూరల్ ఎస్ఐ నరేష్ చెప్పారు. కొందరు నిందితులను పట్టకుని వచ్చాం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read More
Next Story