భూలోక స్వర్గాన్ని తలపిస్తున్న తిరుమలలో గంతులేసిన ఆనందం..
x
తిరుమల శ్రీవారి వాహనసేవ ముందు కళాకారుల ఆనందహేల

భూలోక స్వర్గాన్ని తలపిస్తున్న తిరుమలలో గంతులేసిన ఆనందం..

జగన్మోహనాకారుడిగా ఆదివారం మురిపించిన మలయప్ప


తిరుమల మాడవీధులు కళా ప్రదర్శనలతో పులకిస్తున్నాయి. ఆనంద పారవశ్యం పురివిప్పితే గంతులేసిన ఆనందం శ్రీవారిని మురిపించాయి. దేవతామూర్తుల అలంకారాల్లో కళాకారులు శ్రీవారి క్షేత్రాన్ని భూలోక స్వర్గాన్ని తలపింప చేస్తున్నారు. విభిన్న సాంస్కృతిక వారసత్వ కళలతో 20 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాలు భూలోకస్వర్గంగా మార్చారు.


తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఉదయం మోహినీ అలంకారంలో జగన్మోహనకారుడిగా ఊరేగుతున్న మలయప్పస్వామి వాహన సేవ ముందు కనువిందు చేశాయి. గంతులేసిన కళాకారుల నృత్యాలు గ్యాలరీల్లోని భక్తులకు కనువిందే చేశాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం జరిగిన మోహినీఅలంకారంలో ఊరేగుతున్న స్వామివారి వాహనసేవ ముందు భారతీయ కళలు సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించాయి. జానపదం, సంప్రదాయ నృత్యాలతో అలరించారు.

తిరుమల శ్రీవారి మాడవీధులన్నీ ఆదివారం ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి. ఉదయం జరిగిన వాహనసేవలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తోపాటు బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ రోజు రాత్రికి గరుడవాహనంపై శ్రీవేంకటేశ్వరస్వామివారు విహరించనున్నారు ఆ వాహనసేవ చూసేందుకు భారీగా యాత్రికులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమల మరింత రద్దీగా మారింది. ఇదిలావుంటే,

ఉదయం మోహినీ అవతారంలో ఊరేగుతున్న స్వామివారి వాహన సేవ ముందు కళలు వికసించాయి. వెన్నకోసం ఉట్టికొట్టే దృశ్యం కనువిందు చేసింది. ఉభయదేవేరులతో శ్రీవేంకటేశ్వరస్వామి వారు దివికి దిగివచ్చారా? అనే సందేహం కలిగించేలా కళాకారులు గ్యాలరీల్లోని యాత్రికులను మైమరిపించారు.

ఇక నాట్యాలతో యువతులు, మహిళలు తన్మయత్వంతో వాహనసే ముందు నాట్యనీరాజనం అందించారు. ఈ చిత్రాలు చెప్పే కథలు ఎలా ఉన్నాయంటే...

తిరుమల మాడవీధుల్లో విభిన్న రాష్ట్రాల కళలు ప్రతిబింబిస్తున్నాయి. వాటిలో మోహినీ అట్టం, గోపికానృత్యం తిరువథారకలి నృత్యాలతో అలరించిన కళా బృందాలు కనువిందు చేశారు.


హావభావాలతో ఈ యువతుల నాట్య ప్రదర్శన ప్రత్యేకంగా కనిపించింది.


హరహర మహాదేవా... డప్పుల చప్పళ్లు, మాడవీధుల్లో శ్రావ్యంగా వినిపించే అన్నమాచార్య కీర్తనలు, గోవిందనామ స్మరణలు విని, పులకించిన ఈ కళాకారులు శివాలెత్తారు. తన్మయత్వానికి లోనైన వారు నేలపై కాలు ఆనదనే విధంగా, చిందులు తొక్కిన దృశ్యం యాత్రకులను మరింతగా ఆకట్టుకుంది.


ఝల్లుమన్న మువ్వలసవ్వడి.. స్వచ్ఛా విహంగాల్లా నృత్యంతో మైమరిపించిన కళాకారులు


ధింసా... గిరిజన సంస్కృతిని ప్రతిబింబించిన త్దుయమ్ములేపిన మహిళలు


రాగం.. తాళం.. పల్లవి..


తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సంబురంలో మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఈ తరహా కళారూపాలతో ఆధ్యాత్మిక క్షేత్రం పులకిస్తోంది. మాడవీధుల్లో మలయప్ప స్వామివారి ఊరేగింపు ఉదయం, రాత్రి, ఒకో వాహనసేవలో ఊరేగుతూ దర్శనం ఇస్తున్నారు. ఆ వాహనసేవ ముందు కళాకారుల ప్రదర్శనలు సాగుతున్న తీరు చెప్పడం కంటే.. చూస్తేనే దేశంలోని అన్ని కళలు ఒకో చోట కేంద్రీకృతమయ్యాయి.



Read More
Next Story