ఐఫోన్ పై కుప్పం ముద్ర
x

ఐఫోన్ పై కుప్పం ముద్ర

కుప్పంలో హిందాల్కో ఐ పోన్లలో వాడే అల్యూమినియం ఛాసిస్ తయారీ ఫ్యాక్టరీ.


చేతిలో ఐ ఫోన్ ఉంటే అదొక దర్పంగా భావించే రోజులు ఇవి. ఆ ఫోన్ ఛాసిస్ తయారు చేసే పరిశ్రమ కుప్పంలో ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి సీఎం ఎన్. చంద్రబాబు కుప్పంలో శనివారం హిండాల్కో ఫ్యాక్టరీ ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చనున్నారు.

హిండాల్కో ఇంతవరకు భారీ వస్తువులనే తయారు చేసేది. ఇపుడు ఆపెల్ ఫోన్స్ కు మెటల్ కేసు తయారు చేసేందుకు ముందుకు వచ్చింది. అది కూడా కుప్పంలో తన ఉత్పత్తులను ప్రారంభించడానికి 586 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైంది. హిండాల్కో తోపాటు ఇంకొన్ని పరిశ్రమల ఏర్పాటుకు కూడా ఒప్పందాలు జరగనున్నాయి.
గతంలో మిస్సయినా..
గతంలో ఐ ఫోన్ యూనిట్ ఆంధ్రలో ఏర్పాటవుతుందనే ప్రచారం జరిగింది. ఆ పరిశ్రమ బెంగుళూరుకు వెళ్లిపోయింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కుప్పంలో ఏర్పాటు చేస్తే భూమి, నీటి సదుపాయంతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తామనే రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు హిండాల్కో సమ్మతించింది. ఆ మేరకు కుప్పంలో ఐఫోన్ ఛాసిస్ తయారీకి ముందుకు వచ్చింది. దీనివల్ల ఐఫోన్ ఉత్పత్తుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కిందనడంలో సందేహం లేదు.
కుప్పంపై గ్రోబల్ ముద్ర

తన సొంత నియోజకవర్గానికి అంతర్జాయ ఖ్యాతి సాధించడానికి సీఎం ఎన్. చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. అందులో ప్రధానమైంది. హిండాల్కో కుప్పంలో అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ ట్రూజన్ ప్లాంటు ఏర్పాటుకు ఆసక్తి చూపించడమే. పరిశ్రమలోని ఓ యూనిట్ సాధించడం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబి ప్రోత్సాహక బోర్డు (( SIPB ) కూడా రెండు రోజుల కిందట అనుమతి ఇచ్చినట్లు అధికారవర్గాల సమాచారం. టీడీపీ కూటమి ఏర్పడిన తరువాత రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడంతో పాటు పరిశ్రమల ఏర్పాటు ప్రధాన లక్ష్యంగా సీఎం ఎన్. చంద్రబాబు కార్యాచరణ అమలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా కుప్పం ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు.
అల్యూమినియం ఉత్పత్తుల్లో హిండాల్కోకు ప్రత్యేకత ఉన్నట్లు మార్కట్ వర్గాలు చెబుతున్నాయి.
యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ ఛాసిస్ (బాడీ)ను ప్రత్యేకంగా తయారు చేస్తోంది. ఆదిత్యా బిర్లా గ్రూపు లో హిండాల్కో అల్యూమినియం, రాగి ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. 1958లో స్థాపించిన ఈ సంస్థ ప్రపంచస్థాయిలో విస్తరించింది. ఆటోమొబైల్స్, విమానాలు, ప్యాకేజింగ్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు హండాల్కో ఉత్పత్తులపై ఆధారపడినట్లు పరిశ్రమ వర్గాల సమాచారం.
వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో..
కుప్పం ప్రాంతంలో ఇప్పటి వరకు పెద్దపరిశ్రమ లేదనే చెప్పాలి. వ్యవసాయాధారిత ప్రాంతం కావడం వల్ల ఉద్యానవన పంటల సాగులో కీలకంగా ఉంది. ఇక్కడి నుంచి విదేశాలకు కూడా పూలు, పండ్లు బెంగళూరు మీదుగా ఎగుమతి జరుగుతోంది. ఇజ్రాయల్ సాంకేతిక పరిజ్ణానం అమలు చేసినా, ఇటీవల కాలంలో ఆ వ్యవసాయం అటకెక్కింది. దీంతో పారిశ్రామీకరణపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు రవాణాలో ప్రధానంగా ఆకాశయానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పునాది వేశారు. శాంతిపురం మండలంలో ఎయిర్ స్ప్రిప్ పనుల్లో భూ సేకరణకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. వీటన్నింటిని అధిగమించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
పది వేల మందికి ఉపాధి
కుప్పంలో హిండాల్కో పరిశ్రమ ఏర్పాటు వల్ల వేలాది మందికి ప్రత్యక్ష్యంగా, పరోక్ష్యంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి లభించనుంది. 2027 నాటికి ఉత్పత్తులు ప్రారంభించే లక్ష్యంగా పరిశ్రమ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. కుప్పంలో ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల వెయ్యి వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. పరోక్షంగా మరో పది వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
Read More
Next Story