మదనపల్లెలో తిరంగాకు సంగీతార్చన
x

మదనపల్లెలో తిరంగాకు సంగీతార్చన

ముందస్తు స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు మిన్నంటాయి. జాతీయజెండాకు సంకీర్తనాలాపనతో ఆ పట్టణం పులకించింది.




జాతీాయగీవం ఊరిపి పోసుకున్న మదనపల్లె పట్టణంలో ముందస్తు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. బుధవారం సాయంత్రం ప్రదర్శనతో ప్రారంభమైన సంబరం సంగీతార్చన అందుకుంది. పట్టణంలో మూడు రోజులుగా సాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రికి తుదిదశకు చేరాయి. ఈ కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా అన్ని పక్షాల నాయకులు, ప్రముఖులు ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రం ప్రారంభమైన ముగింపు కార్యక్రమానికి టీటీడీ ఆస్ధాన విధ్వాంసురాలు పద్మశ్రీ శోభారాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈమెది మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండలమే. మదనపల్లె పట్టణంలో ఏటా రోజుల తరబడి సాంతంత్య్ర దినోత్సవ సంబురాలు నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉంది. అదేమిలో చూద్దాం.



బీటీ కాలేజీ వేదికగా...
ఈ చారిత్రక నేపథ్యంలో 12వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యార్థులను మమేకం చేశారు. అందుకు ప్రధాన కారణం.
జాతీయోద్యమం ఊర్రూతలూగించిన "జనగణమణ అధినాయక జయహే.." జాతీయగీతం అందించిన పట్టణం ఇదే. మదనపల్లె బీసెంట్ థియోసాఫికల్ కాలేజీ లో బస చేసిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ జాతీయగీతాన్ని 1911లో సంస్కృతం నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. కాలేజీ ఆవరణలోని గుల్మొహర్ చెట్టు కింద ఆశీనులైన ఆయన అనంతరం విద్యార్థులతో కలిసి ఆలపించింది కూడా ఇక్కడే. అంటే దాదాపు జాతీయగీతానికి ఇక్కడే స్వరకల్పన చేశారు. దీంతో మదనపల్లె పట్టణానికి జాతీయోద్యమంలో ప్రత్యేక గుర్తింపు లభించంది. ఈ నేపథ్యంలో...


ఏటా కార్యక్రమాలు
మదనపల్లో పట్టణంలో ఏటా స్వాతంత దినోత్సవ సంబురాలు మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం వరకు ఈ కార్యక్రమాలు సాగాయి. సాయంత్రం బెంగళూరు మార్గంలోని టిప్పుసుల్తాన్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత, టీటీడీ ఆస్థాన విధ్వాంసురాలు శోభ రాజ్ హాజరయ్యారు.


అంతకుముందు మదనపల్లె ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాషా సారధ్యంలో వివిధ ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు, మహిళలు, స్థానికులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శోభారాజ్ అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, మహిళల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.


Read More
Next Story