తిరుమలలో భద్రత ఆధునీకరణకు ఎల్ అండ్ టీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది?
x
తిరుమల శ్రీవారి నిలయం (ఫైల్)

తిరుమలలో భద్రత ఆధునీకరణకు 'ఎల్ అండ్ టీ' ప్రణాళిక ఎలా ఉండబోతుంది?

రానున్న 40 ఏళ్ల అవసరాలపై దృష్టి పెట్టాలన్న ఈఓ.


తిరుమల శ్రీవారి క్షేత్రంలో భద్రతను ఆధునికరించే బాధ్యతలను ఎల్ అండ్ టి (‌ larsen and turbo) సెక్యూరిటీ సొల్యూషన్స్ అప్పగించబోతోంది. ఆ సంస్థ ప్రతినిధులు, అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఈఓ జే. శ్యామల రావు సమావేశమయ్యారు.

"మరో 40 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని భద్రతా ప్రణాళిక తయారు చేయండి" అని ఎల్ అండ్ టి (‌ larsen and turbo) సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రతినిధులనుటిటిడి ఈఓ శ్యామలరావు కోరారు.
తిరుమలలో ప్రస్తుతం ఐదంతల భద్రతా వ్యవస్థ ఉంది. సాంకేతికంగా మరింత ఆధునిక పరిజ్ఞానంతో కట్టుదిట్టం చేయాలని టిటిడి సంకల్పించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీటీడీ కార్యాచరణకు సిద్ధమైంది. తిరుమలలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో..

"టిటిడి భద్రతా వ్యవస్థను మరింతగా ఆధునీకరించడానికి ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం. అత్యధిక భద్రత వ్యవస్థ ఎలా ఉండబోతుంది" అనే విషయాలపై ఎల్ అండ్ టి సాంకేతిక ప్రతినిధుల బృందం టిటిడి అధికారులకు వివరించింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసమే కాకుండా, భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకునీ భద్రత ఏర్పాట్లకు ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్లు టిటిడి ఈవో స్పష్టం చేశారు. అది కూడా రానున్న 40 సంవత్సరాల భవిష్యత్ కార్యాచరణను దృష్టిలో ఉంచుకొని భద్రత ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
దీనిపై అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుమల వరకు భద్రతా వ్యవస్థను ఆధునికరించడానికి అవసరమైన కార్యాచరణను ఎల్ అండ్ టి ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో...
"అలిపిరి తనిఖీ కేంద్రం ఆధునీకరణ, అధిక సామర్థ్యం కలిగిన స్కానర్లు, త్వరితగతిన తనిఖీలు పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్కింగ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ కంట్రోల్, ఇంటిగ్రాటెడ్ సర్వేలన్స్ సిస్టం, కామన్ అలారం మానేజ్మెంట్ సిస్టం, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ, నో హెల్మెట్ డిటెక్షన్, ఆటోమెటిక్ ట్రాఫిక్ కంట్రోల్ & క్లారిఫికేషన్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ" పై ఎల్ అండ్ టి సంస్థ సాంకేతిక ప్రతినిధుల బృందం టిటిడి అధికారులకు వివరించింది.
ఈ సమావేశంలో టీటీడీ సీవీఎస్ఓ ( TTD chief vigilance and security officer) మురళీకృష్ణ, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఎల్ అండ్ టి సాంకేతిక నిపుణుల బృందం, టీటీడీ ట్రాన్స్పోర్ట్, ఐటి జి ఎం, శేషారెడ్డి, తిరుమల అడిషనల్ ఎస్పీ సత్య నారాయణ, ఏఎస్పీ శరామకృష్ణ, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, సదా లక్ష్మీ, అధికారులు పాల్గొన్నారు.
ఎస్ ఎస్ డి కౌంటర్ల నిర్వహణపై
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతిలో జారీచేస్తున్న టైం స్లాట్ టోకెన్లు (SSD Token's) జారీ చేసే కౌంటర్ల నిర్వహణ, అభివృద్ధి పనుల పురోగతిపై కూడా టీటీడీ ఈవో శ్యామలరావు విభాగాల వారీగా సమీక్షించారు. తిరుమలలో అన్నప్రసాదం విభాగం ఆధునీక‌ర‌ణ‌, పరకామణి నిర్వహణ, పారిశుద్ధ్యం, టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా బాలాజీ నగర్ గృహాల ప‌రిశీల‌న‌ చేసే అంశాలపై సమీక్షించారు.
తిరుమలకు వెళ్లే కాలిబాట మార్గాలలోని దుకాణాల‌ తనిఖీలు, యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాల్లో కేంద్రీకృత లాకర్ కేటాయింపు వ్య‌వ‌స్థ‌, ఎఫ్ఎంఎస్‌ మొబైల్ యాప్ వినియోగం, తిరుమలలో ల్యాండ్‌స్కేప్ సర్వే, కొత్తగా రూపొందిస్తున్న కాటేజ్ డొనేషన్ పాలసీ, సీఆర్వో పునర్నిర్మాణం వంటి అంశాల‌పై వివ‌రంగా చ‌ర్చించారు.
"భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు నిర్దేశిత స‌మ‌యంలో ప‌నులు పూర్తి చేయాలీ" అని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఈవో ఆదేశించారు.
Read More
Next Story