తిరుమలలో స్వర్ణరథంపై మలయ్యప్ప విహారం
x

తిరుమలలో స్వర్ణరథంపై మలయ్యప్ప విహారం

కనువిందు చేసిన రథోత్సవం చిత్రాలు చెప్పే మాటలు ఇవి..


తిరుమల కలిగిన వైకుంఠం అనే మాట సాకారమైంది. స్వర్ణరథంపై అధిరోహించిన మలయప్ప స్వామి వారు మంగళవారం ఉదయం తిరుమల మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.


వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి సన్నిధిలోని వైకుంఠ ద్వారాలు వేకువజామున బ్రహ్మ ముహూర్తంలో 1. 35 గంటలకు తెరుచుకున్నాయి. మొదట విబిఐపిలకు దర్శనం తర్వాత సామాన్య యాత్రికులకు కూడా దర్శనం కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి స్వర్ణరథంపై ఆసీనులయ్యారు. మాడవీధుల్లో విహరిస్తూ గ్యాలరీలోని భక్తులకు దర్శనమిచ్చారు.

తిరుమలలోని వాహన మండపం నుంచి స్వర్ణ రథాన్ని పుష్పాలు పత్రాలతో అలంకరించి ఉన్న తర్వాత ఉభయ దేవరులతో ఉన్న మలయప్ప స్వామి వారిని వేద పండితులు ఆసీనులను చేశారు. హారతి సమర్పించిన తర్వాత స్వర్ణ రథాన్ని మాడవీధుల్లోకి తీసుకురావడానికి అంటే ఈ రథం లాగడానికి టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, సిబిఎస్ మురళీకృష్ణ, తిరుపతి ఎస్ పి ఎల్ సుబ్బారాయుడు తోపాటు మహిళలు ఆసక్తి చూపించారు. సామాన్య యాత్రికులు కూడా స్వర్ణరథం లాగడానికి పోటీపడ్డారు. మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కనులవిందుగా సాగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాత్రికులు వైకుంఠ ద్వారం లోనుంచి వలుపలికి వచ్చారు.

తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరిస్తున్న మలయప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో గ్యాలరీలో యాత్రికులు నిరీక్షించారు. తిరుమల శ్రీవారి తో పాటు స్వర్ణ రథం పై ఊరేగుతున్న మలయప్ప స్వామి వారి దర్శనం కల్పించడానికి కూడా టిటిడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తిరుమల మాడవీధుల్లో భక్తుల కరతాళధ్వనులతో ..


స్వర్ణరథం ముందు టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్


తిరుమల ఆలయం, పరిసరాల్లో కిక్కిరిసిన యాత్రికులు


మలయప్ప ఆశీనులైన స్వర్ణరథం ముందు ఏనుగుల సవారీ


స్వర్ణరథం లాగడంలో మహిళల ఆసక్తి...


తిరుమల శ్రీవారి ఆలయం ముందు సాగుతున్న మలయప్ప స్వర్ణరథం




Read More
Next Story