Municipal War | హైడ్రామాకు తెరతీసిన స్థానిక సంస్థల పదవులు
x

Municipal War | హైడ్రామాకు తెరతీసిన 'స్థానిక సంస్థల పదవులు'

డిప్యూటీ మేయర్ల ఎంపిక రాజకీయంగా వేడి రగిల్చింది. మూడు చోట్ల ఎన్నిక వాయిదా పడింది. నెల్లూరు సహా మూడు మున్సిపాలీటీలు టీడీపీకి దక్కాయి.


రాష్ట్రంలో రాజకీయ హైడ్రామా నడిచింది. డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య సోమవారం సాగిన వ్యవహారం రాజకీయ చిచ్చు మరింత రగుల్చింది. వైసీపీ అధికారంలో ఉండగా, స్థానిక, నగర పాలక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అన్ని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలను వైసీపీ దక్కించుకుంది.

2004 సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత రాజకీయ సమీకరణలు మారడంతో కొన్ని సంస్థలకు డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సోమవారం జరిగింది. అందులో.. సోమవారం
నెల్లూరు, తిరుపతి, ఏలూరు కార్పొరేషన్లు, హిందూపురం, నందిగామ, పాలకొండ, తుని, నూజివీడు, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం, పిడుగురాళ్ల మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయంటే..
కోరం లేక వాయిదా..

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. వైసీపీలో కొందరు సమావేశానికి హాజరుకాలేదు. దీంతో కోరంలేక వాయిదా వేశారు. తిరిగి మంగళవారం నిర్వహించడానికి ఎన్నికల అధికారి, తిరుపతి జేసీ శుభం బన్సల్ ప్రకటించారు. హాజరైన వైసీపీ కౌన్నిలర్లు కూడా వెనుదిరిగారు. ఇదిలావుంటే,
ఆదివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తమ పార్టీ కార్పొరేటర్లు చేజారకుండా, వైసీపీ వారిని పాండిచ్చేరికి తరలించింది. కొందరిని టీడీపీ కూటమి నేతలు ఆదివారం రాత్రే చిత్తూరులోని ఓ ప్రయివేటు హోటల్ కు తరలించారు. ఈవిషయం తెలిసిన డిప్యూటీ మాజీ మేమర్ భూమన అభినయరెడ్డి ఆ హోటల్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి ఒకనాటి ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన తిరుపతి టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళి (పులిగోరు మురళీ కృష్ణారెడ్డి) ప్రస్తుతం టీడీపీ కూటమిలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. బలవంతంగా తీసుకుని వెళ్లిన వైసీపీ కార్పోరేటర్లను తన ఆధీనంలో ఉంచుకున్నారు. దీంతో రంగప్రవేశం చేసిన అభినయరెడ్డి అనుచరులు వారందరినీ మళ్లీ వెంట తీసుకుని వెళ్లడానికి చేసిన ప్రయత్నంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కాగా,
వైసీపీ కార్పొరేటర్లను తమ ఆధీనంలోకి తీసుకున్న ఆ పార్టీ నాయకులు అక్కడి నంచి ఇళ్లకు చేరుకున్నారు. అయితే, సోమవారం ఉదయం తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం (Sri Venkateswara Univercity) సెనేట్ హాల్ లో డిప్యటీ మేయర్ ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. తిరుపతి జాయింట్ కలెక్టర్ (Tirupati Joint Collector) శుభం బన్సల్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. రాజకీయ హైడ్రామ మధ్య చోటుచేసుకున్న పరిణామాలతో వైసీపీ కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. దీంతో కోరం లేకపోవడం వల్ల ఎన్నిక వాయిదా పడింది.
ఎన్నికల అధికారి తిరుపతి జెసీ శుభం బన్సల్ మాట్టాడుతూ, "50 కార్పొరేటర్లు ఉంటే 22 మంది మాత్రమే హాజరయ్యారు" అని చెప్పారు. దీంతో కోరంలేకపోవడం వల్ల మంగళవారానికి ఎన్నిక వాయిదా వేసినట్లు ఆయన ప్రకటించారు.
డిప్యూటీ మేయర్ల ఎంపిక కోసం నిర్వహించిన ఎన్నికలకు కోరం లేక వాయిదా పడిన కేంద్రాల్లో తిరుపతితో పాటు నందిగామ మున్సిపాలిటీ కూడా ఉంది.
టీడీపీ కైవసం

నెల్లూరు నగర పాలక సంస్థలో టీడీపీ కూటమి ఆధిపత్యం సాగించింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, నగర ఎమ్మెల్యే మంత్రి నారాయణతో పాటు టీడీపీ ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. దీనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పందించారు. మొత్తం 54 డివిజన్లు ఉండగా, సోమవారం ఉదయం జరిగిన ఎన్నికలలో 41 మంది టీడీపీ కార్పొరేటర్లు మద్దతుగా నిలివడంతో డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు.
"రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు నగరంలోని 54 డివిజన్లలో కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారు" అని జోస్యం చెప్పారు.
నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన సయ్యద్ తహసీన్ ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కూడా టీడీపీ ఖాతాలో చేరింది.
బాలకృష్ణ సారధ్యంలో..

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ పీఠం కూడా టీడీపీకి దక్కింది. ఇక్కడి చైర్మన్ గా రమేశ్ ఎన్నికయ్యారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కూడా ఆయన తన ఓటును సద్వినియోగం చేసుకున్నారు. చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించారు. మిగతా కౌన్సిలర్లతో కలిసి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమికి ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిపి 23 మంది బలం ఉండటంతో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. ఆరు నెలల క్రితం వైసీపీ ఛైర్పర్సన్ ఇంద్రజ రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది.


Read More
Next Story