శ్రీవారి సేవకుడిలా... అలిపిరి కాలినడకన
x
తిరుమలకు అలిపిరి నుంచి కాలినడకన వెళుతున్న అశోక్ కుమార్ సింఘాల్

శ్రీవారి సేవకుడిలా... అలిపిరి కాలినడకన

ఈ రోజు ఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న సింఘాల్


తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించడానికి అశోక్ కుమార్ సింఘాల్ తిరుమలకు నడకమార్గంలో చేరుకున్నారు. బుధవారం వేకువజామున అలిపిరి కాలిబాటన నడిచివెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది ఆయన వెంట ఉన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించకున్న తరువాత సింఘాల్ టీటీడీ 28 కార్యనిర్వహణాధికారిగా బుధవారం మధ్యాహ్నం 11. 30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రంగనాయకుల మండపంలో సింఘాల్ కు ప్రస్తుత ఈఓ జే. శ్యామలరావు బాధ్యతలు అప్పగించనున్నారు. కాగా,

కాలినడకన తిరుమలకు
టీటీడీ ఈఓగా నియమితులయ్యే ఐఏఎస్ అధికారి బాధ్యతల స్వీకరణ కోసం అలిపిరికి కాలినడకన నడిచి వెళ్లడం ఆనవాయితీ పాటిస్తున్నారు. నడవడం ద్వారా మార్గమధ్యలోని యాత్రికుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. అంతేకాకుండా, శ్రీవారికి మొక్కు చెల్లించడానికి కూడా అలిపిరి లేదా శ్రీవారిమెట్టు మార్గంలో నడిచి వెళుతూ ఉంటారు. టీటీడీ చరిత్రలో ఐఏఎస్ అధికారిగా ఈఓగా పనిచేసే అవకాశం అశోక్ కుమార్ సింఘాల్ కు దక్కింది. గతంలో కూడా ఆయన టీడీపీ ప్రభుత్వంలో 2017 మే నెల ఆరో తేదీ నుంచి 2020 అక్టోబర్ నాల్గవ తేదీ వరకు కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు.
విడదీయలేని అనుబంధం
తిరుమల ప్రత్యేకాధికారిగా ఏవీ. ధర్మారెడ్డి ప్రత్యేకాధికారిగా వైఎస్. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆ తరువాత వైసీపీ ప్రభుత్వంలో కూడా అదనపు ఈఓగా ధర్మారెడ్డి పనిచేశారు. ఈయన కొడుకు అకాల మరణంతో తాత్కాలిక ఈఓగా అశోక్ కుమార్ సింఘాల్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాత మళ్లీ దేవాదాయ శాఖకు కార్యదర్శిగా నియమిలైన ఆయన ఎక్స్ అఫీషియా సభ్యుడిగా కూడా సింఘాల్ కు ధార్మిక కార్యక్రమాలతో మమేకం కావడం ద్వారా టీటీడీ పరిపాలన, ఉత్సవాల నిర్వహణపై అనుభవం సాధించారు.
Read More
Next Story