తిరుపతిలో జూనియర్ డాక్టర్ల మెరుపు సమ్మె
x

తిరుపతిలో జూనియర్ డాక్టర్ల మెరుపు సమ్మె

తిరుపతి స్విమ్స్ (Svims) ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు శనివారం రాత్రి మెరుపు సమ్మెకు దిగారు. డాక్టర్ పైౌ దాడికి నిరసన వ్యక్తం చేశారు.

 &

తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (స్విమ్స్) జూనియర్ డాక్టర్లు మెరుపు సమ్మెకు దిగారు. క్యాజువాలిటీలో ఓ రోగి దాడికి దిగారు. దీంతో ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ లందరూ విధులు బహిష్కరించారు.



కోల్కతా లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ సంఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో డాక్టర్లు శాంతించారు. రాయలసీమ జిల్లాలకే తలమానికంగా ఉన్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో దాడి సంఘటన కలకలం రేపింది. జూనియర్ డాక్టర్లందరూ విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితవెళితే..

తిరుమల అశ్విని ఆసుపత్రి నుంచి తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు. బంగార్రాజు అనే ఈ రోగి మద్యానికి పూర్తిగా బానిస అయినట్లు సమాచారం. అపస్మారక స్థితిలో ఉన్న బంగార్రాజును తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. హత్యస్వర విభాగంలో చికిత్స చేస్తుండగా, ఒక్కసారిగా తిరగబడిన బంగారు రాజు స్పందన పై తిరగబడి దాడి చేశారు. జుట్టు పట్టుకుని కింద పడేయడంతో ఆమె తోటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సమీపంలోనే ఉన్న డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది రోగి నుంచి కాపాడారు.


స్విమ్స్ ఆస్పత్రిలో అత్యవసర విభాగంతో పాటు వార్డులో కూడా విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లు మొత్తం విధులు బహిష్కరించి, ఆస్పత్రి ఆవరణలో ధర్నాకు దిగారు. ఆస్పత్రి ఆవరణలో ఉద్రిక్తత రాజ్యమేలింది. వందలాదిమంది చికిత్స పొందుతుంటే ఈ ఆసుపత్రిలో రోగులు వారి సహాయకులు తీవ్ర ఆందోళన గురయ్యారు.


ఈ సంఘటన జరిగిన సమాచారం తెలుసుకున్న అదనపు సీవీఎస్ఓ శివ కుమార్ రెడ్డి సిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. జరిగిన సంఘటన తెలుసుకొని టీటీడీ ఈవో జై శ్యామలరావుకు సమాచారం అందించారు. జరిగిన సంఘటనపై జూనియర్ వైద్యులను శాంతింప చేయడానికి అదనపు సి వి ఎస్ ఓ శివ కుమార్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారు. తమ డిమాండ్లు అంగీకరించే వరకు ససేమిరా అన్నారు. కాగా దాడికి పాల్పడిన బంగారు రాజు క్యాజువాలిటీలోనే వెంటిలేషన్ పై చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి గమనించిన తర్వాత కూడా జూనియర్ డాక్టర్లు ఆందోళన విరమించడానికి ఏమాత్రం సుముఖంగా లేరు.


స్విమ్స్ ఆస్పత్రిలో శనివారం రాత్రి 11 గంటల వరకు కూడా ఆందోళన కొనసాగుతూనే ఉంది.
టీటీడీ ఈవో జేసీ శ్యామలరావు స్వయంగా వచ్చి తమతో చర్చించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని జూనియర్ వైద్యులు తెగేసి చెప్పడంతో పాటు భీష్మించి కూర్చున్నారు.
" స్విమ్స్ ఆస్పత్రిలో 24 ఇంటు సెవెన్ పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలి" అని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. స్విమ్స్ ఆస్పత్రి ఆవరణలోనే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందుబాటులో ఉంచుతామని అదనపు సివిఎస్వో లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు.
అయినా జూనియర్ డాక్టర్లు తమ పట్టు వీడకుండా బైఠాయించారు. " టీటీడీ ఈవో జె.శ్యామలరావు హామీ ఇవ్వడంతో పాటు, లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలి " పట్టు పట్టారు.


ఈ సంఘటన సమాచారం తెలిసిన వెంటనే తిరుపతి వెస్ట్ డీఎస్పీ వెంకటనారాయణ స్విమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. పరిస్థితి ఆయన సమీక్షించారు. జూనియర్ డాక్టర్ స్పందన పై దాడికి పాల్పడిన తమ అదుపులోనే ఉన్నాడని ఆయన చెప్పారు. ఆస్పత్రి ఆవరణలో భద్రత పెంచడం ద్వారా వైద్యులకు రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీనికి జూనియర్ డాక్టర్లు ఏమాత్రం స్పందించకుండా నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. శ్యామలరావు ఆస్పత్రికి చేరుకునే వరకు పరిస్థితి చక్కబడే వాతావరణం కనిపించడం లేదు.


Read More
Next Story