
ఎమ్మిగనూరు వద్ద బోల్తా పడిన ప్రయివేటు బస్సు
కర్నూలు: అదుపు తప్పి.. బస్సు బోల్తా
ఎమ్మిగనూరు వద్ద ప్రమాదం. తప్పిన ప్రాణనష్టం.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సమీపంలో మంగళవారం ఉదయం అదుపు తప్పిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. బస్సు పడిపోయిన తీరు భయానకంగా ఉంది. అదృష్టవశాత్తూ 40 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. స్వల్ప గాయాలు మినహా ప్రాణనష్టం లేదని సీఐ ఎస్. చిరంజీవి చెప్పారు. ఈ సంఘటన వివరాలివి
హైదరాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు కర్నూలు జిల్లా ఆదోనికి బయలుదేరింది. ఎమ్మిగనూరుకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరాలదొడ్డి ప్రయాణిస్తుండగా, అదుపుతప్ప రోడ్డు పక్కన తోల్తా పడింది. డ్రైవర్ సీట్ వైపు బస్సు పడిపోవడంతో ఎడమవైపు ఉన్న ప్రయాణికులు అందరూ కింద మీద పడ్డారు. ఈ ప్రమాదంలో చాలామంది స్వల్పంగా గాయపడినట్లు సమాచారం అందింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం.
వేగంగా వెళుతున్న బస్సు ప్రమాదానికి గురికాడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. బస్సు బోల్తా పడటంతో అద్దాలన్నీ ధ్వంసం అయ్యాయి. బస్సులో చెప్పుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకుని వచ్చారు.
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మిగనూరు పోలీసులు స్పందించారు. స్వల్పగాయాలైన వారికి చికిత్స అనంతరం పంపించి వేసినట్లు ఎమ్మిగనూరు సీఐ ఎస్. చిరంజీవి తెలిపారు. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story