కృష్షా జలాలతో చంద్రబింబం..
x

కృష్షా జలాలతో 'చంద్ర'బింబం..

కుప్పంలో సీఎం చంద్రబాబుకు వినూత్నంగా కృతజ్ణతలు తెలిపిన యువకులు.


కృష్ణా జలాలు హంద్రీనీవా కాలువకు చేరాయి. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి కుప్పంలోని కొందరు యువకులు వినూత్న రీతిలో సీఎం చంద్రబాబుకు కృతజ్ణతలు తెలిపారు. నీటితో చంద్రబాబు చిత్రాన్ని ఆవిష్కరించడం ద్వారా తమ సంఘీభావం తెలిపారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


కుప్పం బ్రాంచ్ కాలువలో ఆయకట్టుకు చివరి వరకు నీరు వచ్చింది. హంద్రీనీవా కాలువ ద్వారా శాంతిపురం సమీపంలోని చెరువు నీటితో నిండింది. ఈ దృశ్యం ప్రజలను ప్రధానంగా టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ మద్దతుదారులు ఆనంద డోలికల్లో ఉన్నారు. దీంతో నిర్ణీత కార్యక్రమం మేరకు కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో కృష్ణా జలాలతో నిండిన పరమసముద్రం వద్ద సీఎం చంద్రబాబు శనివారం మధ్యాహ్నం జలహారతి ఇవ్వడానికి చురుగ్గా సాగుతున్నాయి. ఇదిలాఉండగా,

కుప్పం ప్రాంతంలోని కాలువలోకి నీరు చేరగానే శాంతిపురం, కుప్పం ప్రాంతంలో పండుగ చేసుకున్నారు. అదే సమయంలో కొందరు యువకులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. కృష్ణా జలాలను తరలించడం ద్వారా చిరకాల కల నెరవేర్చారంటూ ఆనందం వ్యక్తం చేశారు.

యువకులు ఏమి చేశారు

కుప్పం ప్రజల చిరకాల కల నెరవేర్చారంటూ కొందరు యువ కళాకారులు తమదైన పద్ధతిలో ఆనందం వ్యక్తం చేశారు. హంద్రీనీవా కాలువలో పారుతున్న నీటిని ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లలో నింపుకున్నారు. కాలువకు సమీపంలో నీటితో చంద్రబాబు ప్రతిబింబాన్ని చిత్రీకరించిన సంఘటన ఆకట్టుకుంటోంది.
కుప్పం పట్టణానికి చెందిన హర్ష, ధర్మతేజ, ఏసీ సంపత్ కుమార్ అనే యువకులు తమ మిత్రులతో కలిసి..
"ధ్యాంక్యూ సీఎం సార్" అనే అక్షరాలను తీర్చిదిద్దారు. తద్దారా ఆ యువకులు ప్రత్యేకత చాటుకున్నారు. ఈ దృశ్యాన్ని డ్రోన్ తో చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు చిత్రం సిద్ధం చేసిన తరువాత ఆ బొమ్మకు పైన నిలబడిన ఆ యువకులు తలవెంట్రుకలను పోలిన రీతిలో ఆకర్షణీయంగా చిత్రీకరించారు.
కుప్పం కాలువలో చంద్రబాబు ప్రతిరూపాన్ని నీటితో చిత్రీకరించిన దృశ్యం, వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది ఎప్పుడు చిత్రీకరించదనేది తెలియలేదు. కానీ, ఆ యువకులు కళాకారులే అని తెలిసింది. విభిన్న ప్రత్యేక వ సందర్భాల్లో బొమ్మలు చిత్రీకరించడం వారికి ఉన్న ప్రత్యేకత అని కుప్పం ప్రాంత మీడియా ప్రతినిధులు చెప్పారు.
Read More
Next Story