కుప్పం: కృష్ణమ్మకు సారె, హారతి ఇచ్చిన సీఎం
x
కుప్పం వద్ద కృష్ణా జలాల్లో పసుపు, కుంకుమ వేస్తున్న సీఎం చంద్రబాబు

కుప్పం: కృష్ణమ్మకు సారె, హారతి ఇచ్చిన సీఎం

మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో సీఎం చంద్రబాబు పరమసముద్రం వరకు ప్రయాణం.


కృష్ణా జలాలకు సీఎం ఎన్ చంద్రబాబు కుప్పంలో శనివారం మధ్యాహ్నం 11.30 గంటలకు జలహారతి సమర్పించారు. సుమారు అర్ధగంట పాటు పరమసముద్రం కాలువ వద్ద పూజలు చేశారు.

కుప్పం నియోజకవర్గం లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శుక్రవారం సాయంత్రం శాంతిపురం మండలంలోని తన నివాసానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. శనివారం ఉదయం శాంతిపురం మండలం చిందేపల్లి వద్ద ఉన్న తన నివాసం నుంచి చంద్రబాబు ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణం చేశారు. పరమసముద్రం గ్రామం వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్దకు చంద్రబాబు ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తోపాటు ఎమ్మెల్యేలు కూడా ఆయన ఉన్నారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య సీఎం చంద్రబాబు హంద్రీనీవా కాలువ వద్దకు తీసుకుని వెళ్లారు.

జల హారతి..

కుప్పం స్పర్శించిన కృష్ణా జలాలకు సీఎం చంద్రబాబు సారి సమర్పించారు. ముందు పసుపు కుంకుమ, పూలు కృష్ణా జలాలకు సమర్పించారు. ఆ తర్వాత చీర సారె నీటిలోకి వదలడం ద్వారా పూజలు చేశారు. ఆ తర్వాత కాలువ గట్టుపై ఏర్పాటుచేసిన ఘాట్ మడిగలపై కూర్చున్నారు. కృష్ణా జలాలతో చేతులు శుభ్రం చేసుకున్న ఆయన ఆ జనాలను నెత్తిన చల్లుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ నాయకులు, కుప్పం ప్రాంత ప్రజలపై కూడా కృష్ణా జలాలు చల్లడం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
కుప్పం బ్రాంచ్ కెనాల్ గట్ల పైన పార్టీ శ్రేణులు, నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారందరికీ ఆయన అభివాదం చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.
738 కిలోమీటర్ల ప్రయాణం

నంద్యాల జిల్లా మల్యాల వద్ద జూలై 17 వ తేదీ హంద్రీనీవా కాలువలోకి నీరు వదలడానికి మోటార్లను ప్రారంభించిన విషయం తెలిసింది. రాయలసీమ జిల్లాల పరిధిలోని 738 కిలోమీటర్లు దూరం ఉన్న హంద్రీనీవా కాలువలో సాగిన కృష్ణా జలాలు ఆదివారం చివరి ఆయకట్టు అయిన కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం పరమ సంవత్సరం చెరువును తాకాయి.
చారిత్రక గుర్తుగా..

కుప్పం ప్రాంతాన్ని కృష్ణాజలాలు చేరిన సందర్భంగా ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. పరమ సముద్రం వద్ద కృష్ణా జలాలకు పూజల అనంతరం సీఎం చంద్రబాబు కాలువ ఒడ్డుపై ప్రత్యేకంగా నిర్మించిన పైలాన్ ను ఆవిష్కరించారు. ఇక్కడ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read More
Next Story