పారా మిలటరీ  సంక్షేమానికి బీజం వేసిన కల్లి తండా
x

'పారా మిలటరీ' సంక్షేమానికి బీజం వేసిన కల్లి తండా

పారా మిలిటరీ జవాన్లకు ఇంటి పన్ను మినహాయిస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. వీరజవాన్ల మాదిరే ఆదుకోవాలని మాజీ సైనిక సంఘం ప్రతినిధులు కోరుతున్నారు.


"రాష్ట్రం నుంచి పారా మిలిటరీ దళాల్లో పనిచేస్తున్న సిబ్బంది, మాజీలు, వారి కుటుంబాలకు ఇంటి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వెసులుబాటు మిలిటరీలో పనిచేసే, సిబ్బంది, విరమణ చేసిన వారికే ఏఉఉద్యోగులకే ఉంది.

కాశ్మీర్ యుద్ధభూమిలో కల్లి తండలో వీరమరణం చెందిన ఎం. మురళీ నాయక్ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాయలసీమ జరిగిన కొన్ని సంఘటనలు దేశ భద్రత కోసం సంస్కరణలకు బీజం చేశాయి.శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన ఎం. మురళీ నాయక్ భౌతికకాయానికి ఆదివారం ఉదయం డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ ఘనంగా నివాళులర్పించారు. తిరిగి వెళ్లిన తరువాత..

"త్రివిధ దళాల్లో పని చేసే సైనికులు, విరమణ చేసిన వారికి మాత్రమే ఇంటి పన్ను నుంచి మినహాయింపు ఉంది. ఈ వెసులుబాటును రాష్ట్రంలో పారా మిలిటరీలోని వారికి కూడా వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది" అని ప్రకటించారు.
పెన్షనర్ల ప్యారడైజ్ మదనపల్లె
సైనిక దళాల్లో మదనపల్లె ప్రాంతం వారికి గుర్తింపు ఉంది. సైన్యంలోకి వెళ్లడ, విరమణ తరువాత ఇక్కడే నివాసం ఉండడానికి ఆసక్తి చూపుతారు. దీంతో మదనపల్లె పెన్షనర్ల ప్యారడైజ్ మారింది.
అమర వీరులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటున్నాయి. విమరణ చేసిన సైనిక సిబ్బంది, మరణించి వారి భార్యలకు న్యాయం చేయాలని మాజీ సైనికోద్యోగుల సంఘం మదనపల్లె డివిజన్ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులునాయుడు కోరారు.
"కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ మేరకు వసతులు కల్పించాలి" అని కూడా ఆయన అభ్యర్థించారు.
ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల్లో 3,800 మంది మాజీ సైనికులు ఉన్నారు. మరణించిన వారి భార్యలు కూడా ఇందులో సభ్యులే అని సైనిక సంక్షేమాధికారి రజాక్ ఖాన్
తెలిపారు. పారా మిలిటరీ సిబ్బందికి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలనే జీవో రాలేదని ఆయన చెప్పారు.
మా పరిధిలో లేదు..
"ప్రస్తుతం మిలటరీలో ఉన్న వారి గణాంకాలు మాకు తెలియవు. అది మా పరిధి కాదు" అని చిత్తూరు జిల్లా సైనిక సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ వై. ప్రమోద్ కుమార్ కన్నా తెలిపారు.
"చిత్తూరు జిల్లలో మాజీ సైనికోద్యోగులు 653 మంది, వారిలో మహిళలు 23 ఉంది ఉన్నారు. తిరుపతి జిల్లాలో 1,718 మంది మాజీ సైనికులు ఉంటే, వారిలో మహిళలు (చనిపోయిన ఉద్యోగుల భార్యలు) 686 మంది ఉన్నారు" అని ప్రమోద్ కుమార్ కన్నా చెప్పారు.
"జిల్లా నుంచి పారా మిలటరీ, మిలిటరీలోకి వెళ్లిన వారి వివరాలు మా వద్ద ఉండవు. మాకు చెప్పరు" అని భద్రతా కారణాలను ఆయన ప్రస్తావించారు.
ఆ వివరాలు తెలియవు..
రాష్ట్రం నుంచి పారా మిలిటరీ దళాల్లో ఉన్న వారి సంఖ్య తమ వద్ద ఉండదని అనంతపురం జిల్లా సైనిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ తిమ్మప్ప 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 4,460 మంది మాజీ సైనికులు ఉన్నారని ఆయన వెల్లడించారు.
రాయలసీమలోని అనంతపురం జిల్లా కల్లి తండకు చెందిన ఎం. మురళీనాయక్ యుద్ధభూమిలో వీరమరణం చెందిన ఘటన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ నిర్ణయం తీసుకునేందుకు బీజం వేసింది. గతంలో కూడా రాయలసీమలో జరిగిన సంఘటనలు దేశ భద్రత, సంస్కరణలకు బీజం వేశాయి. అందులో ప్రధానంగా..
1. కడప ఎంపీ స్థానంలో..
1991లో కడప ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్.రాజశేఖరరెడ్డిపై టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న ఖాజీపేటకు చెందిన పోలంకి వెంకటసుబ్బయ్య పోలింగ్ జరగడానికి ముందు రోజే శవమై తేలారు. ఈ విషయాన్ని అప్పటి కలెక్టర్ డాక్టర్ పి. సుబ్రమణ్యం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. సమీక్షించిన సీఈసీ ను వాయిదా వేసింది.
నిర్ణయం ఈ ఘటన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ఱయం తీసుకుంది. ఎన్నికలకు వెచ్చించే నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడడం కోసం పోటీలోని వారికి భద్రత కల్పించడం, ఏ కారణంతో అయినా అభ్యర్థి మరణిస్తే ఎన్నికల ఆపడానికి వీలేలేకుండా నిర్ణయం తీసుకున్నారు.
2. అలిపిరి బాంబు పేలుడు
అది 2003 అక్టోబర్ నెల తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించడానికి ఉమ్మడి రాష్ట్రంలో సీఎం ఎన్. చంద్రబాబు తిరుపతి నుంచి తిరుమలకు బయలు దేరారు. అలిపిరి దాటగానే, మావోయిస్టులు ల్యాండ్ మైన్లు పేల్చిన ఘటన దేశ వ్యాపితంగా సంచలనం రేకెత్తించింది. సీఎం ఎన్. చంద్రబాబుతో పాటు అప్పటి ఎమ్మెల్యేలు చదవలవాడ కృష్ణమూర్తి (తిరుపతి), రెడ్డివారి రాజశేఖరరెడ్డి (పుత్తూరు), బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (శ్రీకాళహస్తి) తీవ్రంగా గాయపడ్డారు. దర్యాప్తులోకి దిగిన పోలీస్ అధికారులు సెల్ ఫోన్ల కాల్ డేటా పరిశీలించారు. చాలా మంది సంబంధం లేని వారు ఇబ్బంది పడ్డారు. దీని వెనుక జరిగిన పొరబాటు గ్రహించిన ప్రభుత్వాల ఆదేశాలతో..
ఆధార్ అనుసంధానం అలిపిరి సంఘటన నేపధ్యంలో సిమ్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయాలని సెల్ సంస్థలకు కేంద్ర భద్రతా విభాగం అదేశించింది.
3. ఆగని ఎన్నిక
విభజిత రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికలు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి వైసీపీ అభ్యర్థిగా శోభా నాగిరెడ్డి పోటీ చేశారు.
అది 2014 ఏప్రిల్ 23 రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు శోభా నాగిరెడ్డి బయలుదేరారు. మార్గమధ్యలోని దీపగుంట గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. 24వ తేదీ 11 గంటలకు మరణించారు.
కడప ఎంపీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి మరణించిన ఘటన తరువాత కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆళ్లగడ్డ ఎన్నిక ఆగలేదు. ఎన్నికల్లో మరణించిన శోభా నాగిరెడ్డి 92,108 ఓట్ల విజయం సాధించారు. దీంతో మళ్లీ కొన్ని రోజులకు ఉపఎన్నిక జరిగింది.
ఇదిలావుంటే..
దేశ రక్షణలో పారా మిలిటరీ దళాలది కీలకపాత్ర. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( Indian Air Force (IAF) ), సీఆర్పీఎఫ్ ( Central Reserve Force CRPF ) ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (Rapid Action Force RAF ) బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( Border Security Force BSF ) సిబ్బంది, ఉద్యోగ విమరణ చేసిన వారు, అమరవీరులైతే వారి కుటుంబీకుల పేరిట ఉన్న ఇళ్లకు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు.
"పంచాయతీ, మున్సిపాలిటీల్లో పారా మిలిటరీ జవాన్లకు కూడా వర్తిస్తుంది" అని చిత్తూరు సైనిక సంక్షేమాధికారి స్పష్టం చేశారు.
నాకు జానడు స్థలం లేదు..
దేశ రక్షణలో సేవలు అందించిన మాజీ సైనికులపై శ్రద్ధ చూపమని మాజీ సైనికోద్యోగుల సంఘం మదనపల్లె డివిజన్ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు అభ్యర్థిస్తున్నారు. 29 ఏళ్లు మిలిటరీలో పనిచేశా, ఇప్పటికీ నాకు భూమి ఇవ్వలేదనన్నారు.
మదనపల్లె పెన్షనర్ల ప్యారడైజ్. ఇక్కడ 500 మంది మాజీ సైనికులు, మరణించిన వారి కుటుంబాలు ఉన్నాయి" అని శ్రీనివాసులు నాయుడు చెప్పారు. ఇప్పటికి 60 మందికి మాత్రమే భూముల మంజూరుకు పోరాటంతో సాధించాం" అని వేదనకు గురయ్యారు.
"దేశ సరిహద్దులు, నియంత్రణ రేఖ వద్ద జరిపిన పోరాటంలో వికలాంగులైన వారికి కూడా వీరమరణం చెందే వారితో సమానంగా ఆదుకోవాలని అభ్యర్థించారు.
Read More
Next Story