కడప:మనవడి కోసం తల్లడిల్లి.. ఆగిన నాన్నమ్మ గుండె..
x

కడప:మనవడి కోసం తల్లడిల్లి.. ఆగిన నాన్నమ్మ గుండె..

భార్య, ఏడాది కొడుకుతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య


నానమ్మ మందలించడంతో ఓ మనవడు తన భార్య, ఏడాదిన్నర కొడుకుతో బయటికి వెళ్లిపోయాడు. ఈ బాధ భరించలేని నానమ్మ గుండెపోటుతో మరణించింది. ఈ విషయం తెలియని ఆ ముగ్గరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కడప నగరంలో ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం ఉదయం వారి ఆచూకీ తెలిసింది. ఇంటి వద్ద విషాద వాతావరణం చూసి పోలీసులు కలత చెందారు.

కడప- కృష్ణాపురం రైల్వేస్టేషన్ల మధ్య భార్య, కొడుకుతో కలిసి ఓ యువకుడు వేగంగా వస్తున్న గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసుల విచారణలో విషాదకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఏమి జరిగింది?
రైలు కింద పడి ఆత్మహత్యం చేసుకున్న మృతులను కడప నగరం శంకరాపురానికి చెందిన వారిగా సోమవారం ఉదయం గుర్తించారు. ఈ వివరాల్లోకి శ్రీరాములు (35), భార్య శిరీష దంపతులకు సంవత్సరం వయసు కొడుకు ఉన్నాడు. శ్రీరాములు నానమ్మ సుబ్బమ్మ వారితోనే కలిసి ఉంటుంది. తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవని పోలీసుల ద్వారా తెలిసిన సమాచారం. ఆదివారం సాయంత్రం కూడా సుబ్బమ్మ మందలించిందని శ్రీరాములు తన భార్య శిరీష ఏడాది వయసున్న కొడుకును తీసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సుబ్బమ్మ గుండెపోటుకు గురైనట్లు తెలిసింది. ఈ విషయం శ్రీరాములుకు తెలియదనే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
రైలుకు ఎదురెళ్లి...?
కడప నగరం శంకరాపురంలోని ఇంటి నుంచి భార్య శిరీష, ఏడాది కొడుకుతో వచ్చేసిన శ్రీరాములు కడప రైల్వే స్టేషన్ కు సమీపంలోనే ఉన్న కృష్ణాపురం రైల్వే స్టేషన్ పట్టాలపైకి చేరుకున్నారని, వేగంగా దూసుకుపోతున్న రైలు బండికి ఎదురువెళ్లి ముగ్గురు ఆత్మహత్య కు పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలిచింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రైలుపట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్న ముగ్గురు మృతదేహాలను కడప రిమ్స్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సోమవారం తెల్లారే వరకు చనిపోయిన ఆ ముగ్గురు ఏ ప్రాంతానికి చెందినవారనేది తెలుసుకోవడానికి రైల్వే పోలీసులు శతవిధాల ప్రయత్నం చేశారు. వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్లు, ఇతర కార్డుల ద్వారా అడ్రస్ తెలుసుకొని ఇంటికి వెళ్లినట్లు తెలిసింది.
ఇంటి వద్ద మరో మృతదేహం..

ఆత్మహత్యకు పాల్పడిన శ్రీరాములు, శిరీష, వారి ఏడాది వయసు కొడుకు ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు వారి ఇంటి వద్దకు వెళ్లేసరికి అక్కడ పరిస్థితి విషాదకరంగా ఉండడం చూసి, ఆవేదనకు గురయ్యా రు. మనవడు శ్రీరాములు భార్య, బిడ్డతో కలిసి వెళ్లిపోవడాన్ని భరించలేక శ్రీరాములు నానమ్మ సుబ్బమ్మ గుండెపోటుతో మరణించారనే విషయం పోలీసులకు తెలిసింది. స్థానికులు చెప్పిన సమాచారం విన్న పోలీసులు కూడా తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More
Next Story