
కడప మహానాడు వేదికపై టీడీపీ అధ్యక్షుడు, సీఎం ఎన్. చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
కడప: మహానాడులో 'సీమ డిక్లరేషన్'
తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో ప్రారంభమైంది. మధ్యాహ్నం అధ్యక్షుడి ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ కీలక అంశాలపై చర్చించనున్నారు.
కడపలో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడులో రాష్ట్ర అభివృద్ధిపై చర్చిస్తారు. అలాగే రాయలసీమ ప్రాజెక్టులపై డిక్లరేషన్ ప్రకటించడానికి ముసాయిదీ తీర్మానం సిద్ధం చేశారు.
రాయలసీమలో తిరుపతి తర్వాత కడప వేదికగా టిడిపి మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది.
టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ఐటిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగత్వపన్యాసంతో ప్రతినిధుల మహాసభ ప్రారంభమైంది.
కడపలో జరుగుతున్న టిడిపి మహానాడుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధులు 23,000 మంది హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతో సహా పార్టీ లో ఎంపిక చేసిన ప్రతినిధులు కూడా వారిలో ఉన్నారు. కొద్దిసేపటి కిందటే టిడిపి జాతీయ అధ్యక్షుడు, సీఎం ఎన్ చంద్రబాబు వేదిక వద్దకు చేరుకున్నారు. మహానాడు వేదిక పైకి వెళ్లడానికి ముందు స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రతినిధిగా పేరు నమోదు చేయించుకుని, ఫీజు చెల్లించి, పార్టీ సమాచారంతో ఉన్న కిట్ తీసున్నారు. సోమవారం రాత్రి ఆయన కడపకు వచ్చారు. అంతకుముందే ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్ కుప్పం నుంచి బెంగళూరు మీదుగా కడపకు చేరుకున్నారు.
భారీ ఏర్పాట్లు
ఆరు అంశాలపై చర్చ
కడపకు సమీపంలోని కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె మండలం చెర్లోపల్లి వద్ద 250 ఎకరాల్లో మంత్రి నారా లోకేష్ కూడా పరిశీలించారు. ఈ మొత్తం విస్తీర్ణంలో 14 ఎకరాల్లో మహానాడు ప్రతినిధుల సభతో పాటు, ఫుడ్ కోర్టులు ఇతర ఏర్పాట్లు చేశారు.
సాధారణంగా మహాసభలు జరిగితే ప్రధాన అంశాలపై తీర్మానాల ప్రవేశపెడతారు. వాటిపై చర్చించి ఆమోదం తెలియజేయడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. టిడిపి మహానాడులో కూడా ఇప్పటివరకు ఇదే వ్యవహారం నడిచింది. కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు భవిష్యత్ కార్యాచరణ కే కాకుండా, రాజకీయంగా కూడా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. ఈ ప్లీనరీలో టిడిపి మూల సూత్రాలు, భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఆరు ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా చర్చించడానికి ముసాయిదా తీర్మానాలు సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.
మంగళవారం మహానాడులో కార్యక్రమాలు ఇవి..
జోడుగుర్రాలు అవసరం
రాష్ట్రంలో ఎదురవుతున్న రాజకీయ సవాళ్లను అధిగమించడానికి పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా చర్చలకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతినిధిగా పార్టీ సమాచారం కిట్ అందుకుంటున్న సీఎం చంద్రబాబు
కడప మహానాడులో నాయకత్వ మార్పు అనేది కీలకం అయ్యే అవకాశం మెండుగా ఉంది. నియోజకవర్గాలు, జిల్లాలో నిర్వహించిన మినీ మహానాడులో టిడిపి ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కు పార్టీ పదోన్నతి పై స్వరాలు జరుగుతున్నాయి.
"పార్టీ పటిష్టం, యువతకు భరోసా ఇవ్వడానికి నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలి" అని మహానాడు ప్రాంగణంలోనే మంగళవారం ఉదయం కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి వ్యాఖ్యానించారు.
"మంత్రి నారా లోకేష్ పార్టీ వ్యవహారాలను చూసుకుంటారు. సీఎం చంద్రబాబు పరిపాలన వ్యవహారాలు, రాజకీయాలు చూసుకునేందుకు వీలు కలుగుతుంది" అని ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అభిప్రాయపడ్డారు.
ముసాయిదా తీర్మానాలు
కడపలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న టీడీపీ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. మొదటిరోజు కీలక అంశాలపై చర్చించడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. అందులో..
1. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో సాధించిన విజయాలు
2. రాష్ట్రంలో నదులు అనుసంధానం చేయడంతో పాటు రాయలసీమలోని బనకచర్ల వరకు గోదావరి జలాల మళ్లింపు తోపాటు సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చ ఉంటుంది.
3. ఒకే రాజధాని అమరావతి. అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశాలపై ముసాయిదా తీర్మాలను సిద్ధం చేశారు. ఇందులోనే ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి పై ఒక డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది.
4. విద్యారంగంలో సంస్కరణలు
5. మహిళలు, సంక్షేమం
6. సాంకేతిక పరిజ్ఞానం వారంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం
7. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు. పరిష్కార మార్గాలు
8. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలపై విజన్ డాక్యుమెంట్
9. మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కేంద్రం అందిస్తున్న తోడ్పాటుతో చేయాల్సిన అభివృద్ధి.
10. ప్రధానంగా రాష్ట్రంలో పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తల సంక్షేమం పై ప్రత్యేక చర్చ
11. పేదరికం లేని సమాజం కోసం అమలు చేస్తున్న పి ఫోర్
12. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనకు ఎంచుకున్న లక్ష్యాలు. పనిచేయాల్సిన కార్యాచరణ పై చర్చ
రాయలసీమపై
రాయలసీమలో సేద్యపు నీటిని అందించడానికి ప్రాజెక్టు చేయడం, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి అవసరమైన విజన్ డాక్యుమెంట్పై చర్చిస్తారు. అంతేకాకుండా వర్గ కక్షలు నివారించడానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చించి, గ్రామాలలో శాంతియుత వాతావరణం నెలకొనడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తారు.
రాయలసీమలో హంద్రీనీవా, గాలిలో నగరి ప్రాజెక్ట్, తెలుగు గంగ, ముత్తు మర్రి ఎత్తిపోతల పథకాల నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు తీసుకున్న జాగ్రత్తలు, శ్రద్ధపై ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని అంశంపై ప్రత్యేకంగా ఇందులో చర్చిస్తారు.
అధ్యక్ష ఎంపికకు నోటిఫికేషన్
ప్రతి మహాసభలోను పార్టీ అధ్యక్షుని ఎన్నుకోవడం ఆనవాయితీ. దీనికోసం మంగళవారం మధ్యాహ్నం మహానాడు ప్రతినిధుల సభలో పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎన్ చంద్రబాబు ప్రసంగం తర్వాత పార్టీకి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది.
టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎంపిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనికోసం పార్టీలోనే ఒక నాయకుడిని ఎన్నికల రిటర్న్ అధికారిగా నియమించుకుంటారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన తర్వాత, రెండవ రోజు అధ్యక్షుని ప్రకటించే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.
మధ్యాహ్నం తర్వాత
మొదటి రోజు టిడిపి మహానాడులో మధ్యాహ్నం తర్వాత నారా లోకేష్ కీలక అంశాలను పై ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా,
"కార్యకర్త అధినేత, యువగలం పేరిట యువత సంక్షేమం, ఉపాధి అవకాశాలు, ప్రజా పాలనలో సాంకేతికత, వాట్సాప్ గవర్నెన్స్ అంశాలపై" చర్చిస్తారు.
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్లపై కూడా చర్చించిన తర్వాత మహానాడు ప్లీనరీ బుధవారానికి వాయిదా పడుతుంది.
Next Story