
కడప:భార్యను చంపి.. ఆపై భర్త ఆత్మహత్య
కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధంతరంగా ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన కడప జిల్లాలో జరిగింది.
కాపురంలో గొడవలు జరిగాయి. క్షణికావేశంలో భార్యను అంతం చేశాడు. ఆ బాధ భరించలేకో.. లేక ఈ జీవితం ఎందుకు అనుకున్నాడో తెలియదు. భర్త కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో దళిత కాలనీనే కాదు. కమలాపురం ప్రాంతంలో కలకలం చెలరేగింది. కడప జిల్లా వల్లూరు మండలంలో సోమవారం జరిగిన ఘటన ఇది.
వల్లూరు మండలం యర్రగుడిపాడు దళితవాడకు చెందిన దంపతులు సుజాత, చెన్నకేశవులు. కుటుంబంలో చెలరేగిన కలహాలత తరచూ వారిద్దరూ గొడవ పడుతున్నట్లు కాలనీ వాసులు చెబుతున్నారు. అదే విధంగా రెండు రోజుల కిందట కూడా వారిద్దరు ఘర్షణ పడ్డారని పోలీసుల ద్వారా తెలిసింది. ఇదిలావుంటే,
ఆ దంపతుల మధ్య ఏమి జరిగిందో తెలియదు. కానీ సుజాత, చెన్నకేశవులు ఘర్షణ పడ్డారని తెలిసింది. దీంతో ఆగ్రహంతో చెన్నకేశవులు విచక్షణ కోల్పోయి, భార్య సుజాతపై కత్తితో దాడి చేయడమే కాకుండా, ఇష్టానుసారంగా నరకడంతో ఆమె మరణించినట్లు సమాచారం. అదే ఆవేశంలో చెన్నకేశవులు కూడా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కమలాపురం ప్రాంతంలో కలకలం రేపింది.
దళితకాలనీ వాసుల ద్వారా సమాచారం అందుకున్న కమలాపురం సీఐ రోషన్ అంబవరం గ్రామాన్ని సందర్శించారు. భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సుజాత మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే రైలు కింద పడి మరణించిన చెన్నకేశవ ఆత్మహత్య సంఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం. ఈ రెండు సంఘటలపై వల్లూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాధ టనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియాలి.
Next Story