SHAR | నింగిలోకి వెళ్లిన ఆ రాకెట్ ఎటు పోయింది?
x

SHAR | నింగిలోకి వెళ్లిన ఆ రాకెట్ ఎటు పోయింది?

దేశ రక్షణకు ఉద్దేశించిన రాకెట్ మూడో దశలో గతి తప్పింది. మిషన్ అసంపూర్తిగా మిగిలిందని ఇస్రో చైర్మన్ ప్రకటించారు. శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.


శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (shar) నుంచి అతి కీలకమైన సమయంలో polaar satellite launch vehicle (PSLV (C61) రాకెట్ ప్రయోగం విఫలమైంది. సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోట ( shar ) రాకెట్ ప్రయోగ కేంద్రం విజయాల పరంపరలో 100 రాకెట్ల మైలురాయిని దాటింది.

శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం తెల్లవారుజామున ప్రయోగించిన PSLV-C61 స్వదేశీ పరిజ్ఞాన రాకెట్ మూడవదశలో ఉండగా, మోటార్లలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల విఫలమైంది.
ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో ఈ రాకెట్ ప్రయోగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇస్రో చైర్మన్ గా వి నారాయణ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఇది మొదటి రాకెట ప్రయోగం. భారత సైన్యానికి ఈ రాకెట్ కూడా అమ్ముల పొదిలో ఓ అస్త్రం అయ్యేది. ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టే మూడో దశలో రాకెట్ ప్రయోగం గతితప్పడం సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్లో ఉద్విజ్ణ వాతావరణం కనిపించింది.

"ఎక్కడ లోపం ఉందనే విషయంపై పరిశీలిస్తున్నాం. మిషన్ ప్రయోగం అసంపూర్తిగా ఉంది" అని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ మీడియాకు చెప్పారు.
"దీనిపై పరిశీలన జరుగుతోంది. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అని ఆయన చెప్పారు. మినహా ప్రశ్నలకు కూడా ఆస్కారం ఇవ్వలేదు.
శ్రీహరికోట నుంచి PSLV C61 రాకెట్ ప్రయోగానికి శనివారం ఉదయం ఉదయం 7.59 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 6.59 గంటలకు నింగిలోకి పంపించడానికి 22 గంటల పాటు నిరంతరాయంగా అన్ని వ్యవస్థలను గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి లోపాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత గణిత సమయానికి PSLV C61 ఉపగ్రహ వాహక నౌకను నింగిలోకి పంపించారు.
నిప్పులు చింందుతూ ఆకాశంలోకి తీసుకుపోయిన PSLV C61 రాకెట్ మొదటి రెండు స్టేజీలు సజావుగానే దాటుకుంది. కీలకమైన మూడో దశలో అనేది రాకెట్ నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెడుతుంది. ఆ సమయంలో మోటార్లలో తలెత్తిన సమస్య కారణంగా రాకెట్ కంట్రోల్ రూం నుంచి సంకేతాలు అందని స్థితిలో దారితప్పినట్లు అంచనా వేస్తున్నారు.
ఈ ప్రయోగాన్ని సహచర శాస్త్రవేత్తలతో కలిసి ఇస్రో చైర్మన్ వి. నారాయణ కూడా పర్యవేక్షించారు.
మూడో దశలో రాకెట్ మొరాయించిన విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత నారాయణన్ ఆదివారం ఉదయం మీడియా సెంటర్ కు వచ్చి క్లుప్తంగా మాట్లాడారు. Twitter లో ISRO ట్వీట్ చేసింది.

"అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేశాయి. సరైన సమయంలోనే నింగిలోనికి పంపించాం. రెండు దశలు సజావుగా రాకెట్ ప్రయాణించింది. మూడో దశలో సాటిలైట్ విచ్చుకునే దశలో మోటార్లలో సమస్య తలెత్తింది" అని ఇస్రో చైర్మన్ నారాయణన్ వివరించారు. ఆ రాకెట్ గమనం తప్పి తిరుగుతోందా? సమీపంలోనే ఉన్న బంగాళాఖాతంలో కూలిపోయిందా అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.
"మోటార్లలో సమస్య తలెత్తడానికి దారి తీసిన అంశాలు ఏంటి అనేది పరిశీలిస్తున్నాం. రాకెట్ ప్రయోగం అసంపూర్తిగానే మిగిలింది" ఆ వివరాలు మళ్లీ వెల్లడిస్తాం" అని మాత్రమే చెప్పారు.
కీలక దశలో

దేశ రక్షణ రంగానికి బలమైన ఆయుధంగా అందించేందుకు isro శాస్త్రవేత్తలు PSLV C61 స్వదేశీ ఉపగ్రహ వాహక నౌక తయారు చేశారు. ఈ రాకెట్ నింగిలో పరిభ్రమిస్తూ సైనిక రంగానికి గూడచారిల సమాచారం అందించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను అమర్చినట్లు శాస్త్రవేత్తల నుంచి తెలిసిన సమాచారం. భూమితలంపై శత్రుశుభిరాలను కూడా కనుగొనే విధంగా పరికరాలు అమర్చారు.
భూతలంపై ప్రతి అణువును శోధించి సమగ్రమైన ఫోటోలు ఇస్రో కేంద్రానికి పంపించడంలో ఈ ఉపగ్రహ వివాహక నౌక కీలక పాత్ర పోషించే విధంగా తయారు చేశారు.
త్రివిధ దళాలకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి అందులో ప్రధానంగా సరిహద్దులపై నిఘ, శత్రువుల కదలికలను కూడా పసిగట్టి సైనికులకు సాయపడడంలో కీలకంగా వ్యవహరించేందుకు ఈ ఉపగ్రహ వాహక నౌకలో హై రిజల్యూషన్ కెమెరాలతో రాత్రి పగలు అనే తేడా లేకుండా నిఘా వేయడానికి ఈ శాటిలైట్ తయారు చేసినట్లు శాస్త్రవేత్తల నుంచి తెలిసిన సమాచారం.
Read More
Next Story