BIG BREAKING | పులివెందులకు ఉప ఎన్నిక తప్పదా?!
డిప్యూటీ స్పీకర్ ట్రిపుల్ వ్యాఖ్యలు మంటలు పుట్టించాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు.
రాష్ట్రంలో రానురాను రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఆర్. రఘురామకృష్ణం జు చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని రాజేసేలా ఉన్నాయి.
"60 రోజుల పాటు అసెంబ్లీకి రాని వారి సభ్యత్వం రద్దు అవుతుంది" అని రఘురామ కృష్ణమరాజు ఢిల్లీలో సోమవారం రాత్రి వ్యాఖ్యానించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. వైఎస్. జగన్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో మిగతా వారికి కూడా ఆయన వ్యాఖ్యలు వర్తిస్తాయా? అంటే నిబంధనలు అమలు చేస్తారా? అనేది చర్చకు దారితీసింది. అదే సమయంలో నిబంధనల "ట్విస్ట్ కూడా ఉంది" అనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీంతో ఏమి జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
2024 సార్వత్రిక ఎన్నికల తరువాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉంటూ ఎన్నికలు ఎదుర్కొన్న వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో వైసీసీ 11 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. టీడీపీ కూటమిలోని భాగస్వామ్యపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ 164 సీట్లు సాధించింది. అందులో స్వతహాగా టీడీపీ 144 సీట్లలో పోటీ చేసి 135 స్థానాలు దక్కించుకుంది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని సీట్లలో గెలిచింది. బీజేపీ పది స్థానాలకు ఎనిమిది సీట్లు సాధించింది.
అసెంబ్లీకి దూరం
అధికారం కోల్పోయిన తరువాత వైసీసీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్. జగన్ సహా 11 మంది అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. అందుకు వారు చెబుతున్న కారణాలు, కోరికలు కూడా విడ్డూరంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేసిన వారికి కొదవలేదు. పులివెందుల నుంచి విజయం సాధించిన మాజీ సీఎం వైఎస్. జగన్ "తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా" అని మారాం చేశారు. అంతటితో ఊరుకోకుండా హైకోర్టును కూడా ఆశ్రయించిని ఫలితం లేకుండా పోయింది.
దీనికి ప్రతిగా వైసీపీ కూడా ఎదురు దాడికి దిగింది. "అసెంబ్లీలో రాగింగ్ చేయడానికే టీడీపీ కూటమి ప్రయత్నిస్తోంది" అని వ్యాఖ్యానించిన వైసీపీ నేతలకు కొదవ లేదు. ఇదెలా ఉంటే...
డిప్యూటీ స్పకర్ ఏమన్నారంటే...
వైసీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్. జగన్ అసెంబ్లీకి రాకపోవడం మొదటికి ఎసరు తెచ్చేలా ఉన్నట్లు వాతావరణం కనిపిస్తోంది. "ఆయన అసెంబ్లీకి వస్తా అంటున్నారు. కానీ, రావడం లేదు. 60 రోజులు సభా సమావేశాలకు రాకుంటే వేటు పడుతుంది" అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమ రాజు వ్యాఖ్యానించారు. దీని వెనుక బలమైన కారణమే ఉన్నట్లు కనిపిస్తోంది. వైఎస్. జగన్ తో పాటు ఆయన సహచర ఎమ్మెల్యేలు 10 మంది కూడా హాజురు కావడం లేదు. వారిపై కూడా వేటు పడుతుందా? అనేది కూడా తెరమీదకి వచ్చింది.
ఆయన వ్యాఖ్యల వెనుక..
టీడీపీ కూటమి ఏర్పడి ఏడు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణస్వీకారం రోజు మినహా ఎక్కడా సభలో కనిపించలేదు. తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో 2014 ఎన్నికలకు ముందు నుంచి అక్రమాస్తులు, మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులు వైఎస్. జగన్ ను వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఈ కేసుల్లో ఇటీవల తాజాగా జగన్ కేసులపై రోజు వారి విచారణ సాగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో ప్రమాద ఘంటికలు బలంగా మోగుతున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేసుల విచారణకు హాజరు కావాల్సి రావడం, ఒక వేళ శిక్షకు గురైతే పరిస్థితి ఏమిటి?
ఈ పరిణామాలను అంచనా వేయడం వల్లనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు అలా వ్యాఖ్యాచించారా? లేక మరో కారణం ఏమిటనేది చర్చనీయాంశమైంది.
ముక్తాయింపు : డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు ఓ మాట అన్నారు. అందులో హెచ్చరికతో పాటు సూచన కూడా కనిపిస్తోంది. అంతేకాకుండా, నిబంధనలు కూడా ఆయన ఉటంకించారు.
"60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుంటే ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడుతుంది. పులివెందులకు ఉప ఎన్నిక వస్తుంది" అని రఘురామకృష్ణమరాజు వ్యాఖ్యానించారు. అయితే, ఇందులో ముందుగా "స్పీకర్ అనుమతి తీసుకుని గైర్హాజరు కావచ్చు" అయితే "ఇక్కడ ఓ నిబంధన వర్తిస్తుంది" అని ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకీ జగన్ విషయంలో ఏమి జరగబోతోంది. అనేది వేచిచూడాల్సిందే.
Next Story