ఆహా.. అన్నా... ఏమి రుచీ...
x

ఆహా.. అన్నా... ఏమి రుచీ...

తిరుపతిలో క్యాంటీన్లు ప్రారంభించారు. మంచి భోజనం అందుబాటులోకి వచ్చింది. ఆహార పదార్థాలు అంత రుచిగా ఉన్నాయి. ఎమ్మెల్యేతో పాటు అధికారులు భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.


న్నా క్యాంటీన్లలో ఆహార పదార్థాలు సూపర్. పేదలే కాదు. ఎవరైనా చక్కగా భోజనం చేయవచ్చు. ఇక్కడ పెద్ద చిన్న అని ఏమీ అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆహార పదార్థాలు రుచిచూసిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మూర్య వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇవి.


తిరుపతిలో కూడా పేదల ఆకలి తీర్చడానికే రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంచిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. నగరంలోని స్విమ్స్ ఆస్పత్రి కూడలి, ఎంఆర్.పల్లి, ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ మూర్యతో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం రాత్రి ప్రారంభించారు. కేవలం రూ. ఐదు కే భోజన సదుపాయం టీడీపీ కూటమి ప్రభుత్వమే మళ్లీ అందుబాటులోకి తీసుకుని వచ్చిందన్నారు.

ఈ క్యాంటీన్లలో తెల్గగా నిగనిగలాడే స్టీల్ ప్లేటులో అన్నం వడ్డించారు. అన్నం, పప్పు, సాంబారు, వడియాలు, పెరుగు ప్లేటు అరల్లో వడ్డిస్తున్నారు. మంచి హోటల్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఇక్కడ ఆహార పదార్థాలు వడ్డించారు. ఈ క్యాంటీన్లలో స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య, అధికారులు, సిబ్బందితో కలిసి ప్రశాంతంగా భోజనం చేశారు.

"తిరుపతిలోని అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్నాహ్నం, రాత్రి భోజనం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ అందరూ తృప్తిగా భోజనం చేయవచ్చు" అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు.

రూ.5కే భోజనం

అన్న క్యాంటీన్లలో నాణ్యత, పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. యధావిధిగానే రూ. 5కే భోజనం అందుబాటులో ఉంచారు. రోజూ ఉదయం 250 మందికి టిఫిన్, మధ్యాహ్నం 350 మందికి భోజనం, రాత్రి 250 మందికి భోజనం అందుబాటులో ఉంచారు. ఈ విషయాలపై తిరుపతి నగర మున్సిపల్ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, "క్యాంటీన్ల వద్ద పారిశుద్ధ్యం, వసతులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం" అని చెప్పారు. "ఈ క్యాంటీన్లకు అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు. పదార్థాలు సిద్దం చేసిన రెండు గంటల్లోనే క్యాంటీన్లకు తరలిస్తారు" అని మౌర్య వివరించారు.
క్యాంటీన్ల సంఖ్య పెంపుదల
తిరుపతికి వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు వేల సంఖ్యలో వస్తుంటారు. వారంతా ఆయా ప్రాంతాల్లోని హోటళ్లను ఆశ్రయిస్తుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఆకలి బాధ లేకుండా చేయడానికి తిరుపతి నగరంలో అన్న క్యాంటీన్లు పెంచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, " వారంపాటు నగరంలో పరిశీలన చేస్తాం. అని ఆమె వెల్లడించారు. "ప్రజలకు నాణ్యమైన భోజనం అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం" అని చెప్పారు.
Read More
Next Story