జగన్ కు పులివెందులలో..  సీఎం చంద్రబాబు ఝలక్
x

జగన్ కు పులివెందులలో.. సీఎం చంద్రబాబు ఝలక్

విధేయులు రూ. కోట్లు మింగేశారా?. వారికి మాజీ సీఎం వైఎస్. జగన్ పులివెందులలో సహకారం అందించారా?. పేదలకు అప్పులు మిగిల్చిన పెద్దలకు. సీఎం చంద్రబాబు ఎలాంటి ఝలక్ ఇచ్చారు.


"టీడీపీ అధినేతఎన్. చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గాన్ని గత ప్రభుత్వంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా వైఎస్. జగన్ టార్గెట్ చేశారు"

పరిస్థితి తిరగబడింది...
"రాష్ట్రంలో అధికారం మారింది. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీ.టెక్ రవి ద్వారా పులివెందులపై సీఎం ఎన్. చంద్రబాబు ఫోకస్ పెట్టారు"
ఊర్లు అన్నారు. కాలనీ కారు కదా.. వీధి కూడా నిర్మాణం కాలేదు. అనుకూలయైన వారికి బిల్లులు చెల్లింపులో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వేల సంఖ్యలో చేపట్టిన ఇళ్ల నిర్మాణంలో కనీసం వంద ఇళ్ళు కూడా పూర్తి చేయలేదు. దాదాపు రూ. 200 కోట్లు కరిగిపోయాయి. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చాలని సీఎం చంద్రబాబు స్పందించిన తీరు వెనక అసలు కథేమిటి?
గత ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమాలపై సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే అనేక శాఖల్లో సాగించిన అక్రమాలు వెలుగులోకి తీసుకుని వస్తోంది. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారందరి తోపాటు వారికి సారధ్యం వహించిన మాజీ సీఎం వైఎస్. జగన్ పైనే నేరుగా ఫోకస్ పెట్టారు. పులివెందులలో జగనన్న మెగా లే అవుట్ వ్యవహారంలో నిధుల దుర్వనియోగంపై విచారణకు ఆదేశించారు. కాగా, అధికారం కోల్పోయిన తరువాత రెండోసారి పులివెందులకు చేరుకునేలోపే మాజీ సీఎం వైఎస్. జగన్ కు సీఎం ఎన్. చంద్రబాబు షాక్ ఇచ్చారని భావిస్తున్నారు. కాంట్రాక్టర్ అవతారమెత్తిన మాజీ ఎమ్మెల్యేతో పాటు కొందరు అధికారులు కూడా ఇందులో చిక్కుకునే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.
"ఇళ్లు కాదు. ఊళ్లు నిర్మిస్తాం"
ఆ మాటను సొంత ఊరిలోనే మాజీ సీఎం వైఎస్. జగన్ సాకారం చేసుకోలేకపోయారు. దీనిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది. పులివెందులలో ఇళ్లు నిర్మించకుండానే రూ. 64 కోట్లు చెల్లించారు. ఈ వ్యవహారంపై పులివెందులకు చెందిన ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో సీఎం ఎన్. చంద్రబాబునాయుడు విచారణకు ఆదేశించారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకు ప్రధాన కారణం తమ పార్టీకి అనుకూలమైన వారు ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి ద్వారాలు తెరిచింది. స్థలాల కేటాయింపు నుంచి, ఇళ్ల మంజూరు, నిర్మాణం, కాంట్రాక్టర్లకు అప్పగించే సాగించిన అక్రమాలను టీడీపీ ప్రభుత్వం వెలుగులోకి తెస్తోంది.


కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నవైఎస్. జగన్ సీఎం హోదాలో 2021 డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పర్వదినం రోజు 8,400 జగనన్న మెగా లేఅవుట్ కు పునాది వేశారు. లబ్ధిదారులకు పట్టాలు కూడా పంపిణీ చేశారు.నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల నిర్మాణంతో పాటు ఆధునిక వసతులు కల్పించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో ఇళ్ల నిర్మాణాలకు అప్పటి సీఎం వైఎస్. జగన్ సారధ్యంలోని ప్రభుత్వం లబ్ధిదారులకు మూడు ప్రత్యామ్నాయాలు చూపించారు.
"కోర్టు కేసుల కారణంగా గత ఏడాది పట్టాలు ఇవ్వలేకపోయాను. క్రిస్మస్ రోజు పంపిణీ చేయడం ఆనందంగా ఉంది" అని మాజీ సీఎం వైఎస్. జగన్ వ్యాఖ్యానించారు. "చిరునవ్వులతో ఆప్యాయత కురిపించి, ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూసుకునే పులివెందుల ప్రజలకు ఎంత చేసినా తక్కువే" అని భావోద్వేగానికి కూడా గురయ్యారు.
1.లబ్ధిదారులు తమ ఇళ్లను మోడల్ యూనిట్ ప్రకారం నిర్మించుకోవచ్చు. అంటే ప్రభుత్వమే ఇల్లు నిర్మిస్తుంది.
మోడల్ హౌస్లో లివింగ్ రూం, బెడ్రూం, వరండా, కిచెన్, సింథిటిక్ వాటర్ ట్యాంక్, రెండు ట్యూబు లైట్లు, రెండు ఫ్యాన్లు, రెండు ఎల్ఈడీ బల్బులు ఉచితంగా ఇస్తారు.
2. ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుని ఇల్లు నిర్మించుకోవచ్చు.
పులివెందులలో నిర్మించే మెగా లే అవుట్ కావడంతో ప్రభుత్వం ద్వారానే నిర్మించి ఇవ్వడానికి స్ధానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నారు. ఇందులో తిరకాసు ఉందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


మూడేళ్లలో 99 ఇళ్లే
పులివెందుల పట్టణ శివార్లలో జగనన్న హౌసింగ్ మెగా లేఅవుట్ అప్పటి సీఎం వైఎస్. జగన్ ప్రారంభించారు.
323 ఎకరాల్లో మొత్తం 8,042 మంది పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. వారిలో ముగ్గురు మహిళలకు లాంఛనంగా పట్టా పత్రాలు పంపిణీ చేశారు. ఈ కాలనీలో రూ. 147 కోట్లతో మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ లెక్కవేస్తే, ఒక్కో లబ్ధిదారుడి పట్టా రూ. ఆరు లక్షలు విలువ చేస్తుందనడంలో సందేహం లేదు.
అయిన వారికి పనులు
మెగా కాలనీలోని లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ వందల సంఖ్యలో ఆధార్ వివరాలు లేవని తెలిసింది. వాటిలో 6,900 ఇళ్ల పనులు కాంట్రాక్టరుకు అప్పగించారు. ఇళ్ల నిర్మాణం పనుల కాంట్రాక్టు దక్కించుకున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశరెడ్డికి చెందిన రాక్రీట్ సంస్థకు 4,937 ఇళ్ల నిర్మాణ పనుల బాధ్యతలు అప్పగించడంతో పాటు అ రూ. కోట్ల 84 కోట్లు బిల్లులు కూడా చెల్లించారని సమాచారం. కాగా, మూడేళ్లలో. నిర్మాణం సా...గుతూనే ఉంది. ఇన్ని రోజులు కాలగర్భంలో కలిసినా, కేవలం 99 ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగారు. మిగతావన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముళ్లపొదలకు ఆవాసంగా మారిన పరిస్థితి. నిధులు మంజూరు అనంతరం పనులు చేపట్టడానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు నిర్మాణ పనులను గాలికి వదిలేయడం వెనుక అధికార పార్టీ వారికి మేలు చేయడానికి మాత్రమే యత్నించారని టీడీపీ నేతలు ఆరోపించారు. అందుకు సజీవసాక్షం మెగా లే అవుట్లో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోవడమే.


కాలనీలోని వేలాది ఇళ్లు పునాదులు, గోడల వరకే పరిమితం అయ్యాయి. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇనుము, సిమెంట్ దశలవారీగా మంజూరు చేయాలనే నిబంధనలు కూడా తుంగలో తొక్కారని తెలిసింది. అంతేకాకుండా, గతంలో పునాదుల వరకు ఇంటి నిర్మాణానికి రూ. 53 వేలు మంజూరు చేసేవారు. కాంట్రాక్టర్ తమ వాడు కావడంతో ఆ మొత్తం రూ. 70 వేలకు పెంచారని చెబుతున్నారు. దీంతో పునాదుల వరకు నిర్మాణాలు పూర్తి చేసిన కాంట్రాక్టర్ పనులు అర్ధంతరంగా ఆపేసి, వెళ్లారని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. బిల్లుల రూపంలో రూ. 85 కోట్లు చెల్లించారని, మౌలిక సదుపాయాల కోసం రూ. వంద కోట్లు కేటాయించారు. అంటే మొత్తం మీద రూ. 200 కోట్లు ధారబోసినా వంద ఇళ్లు కూడా పూర్తి చేయని పరిస్థితి. అనంతపురం జిల్లాలో కూడా రాక్రీట్ సంస్థ ఇదే విధంగా వేలాది ఇళ్లను అర్ధంతరంగా వదలేశారని సమాచారం.
ఫిర్యాదుతో కదిలిన డొంక
రాష్ట్రంలో గతంలో జరిగిన అవినీతి కార్యక్రమాలను తాజాగా టీడీపీ కూటమి ప్రభుత్వం బయడపెడుతోంది. రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ సీఎం వైఎస్. జగన్ కోట పులివెందులలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి రెండు రోజుల క్రితం లేఖ ద్వారా సీఎం ఎన్. చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా జగనన్న మెగా హౌసింగ్ లేఅవుట్లో అనర్హులకు, లేని వారికి పట్టాలు ఇచ్చారు. పనులు చేయకుండానే రూ. దాదాపు 200 కోట్ల వరకు స్వాహా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో సీరియస్ గా స్పందించిన సీఎం ఎన్. చంద్రబాబు విచారణకు ఆదేశించడంతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారం పులివెందులలో ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనంతపురం జల్లా రాప్తాడు వరకు వ్యాపించిని పులివెందుల ప్రకంపనలు ఎవరిని చుట్టుముడతాయి. ఈ పాపంలో బలయ్యే అధికారులు ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.
Read More
Next Story