డప్పు కొట్టకుంటే.. పథకాలు తీసేస్తారా..?!
ఇదేదో పెత్తందారులు జారీచేసిన హుకుం కాదు. కర్నూలు నగరానికి సమీపంలో ఉద్యోగులే మాదిగలను హెచ్చరిక ఘటన ఇది.
డప్పు కళాకారులుగా ఆత్మగౌరవంతో జీవిస్తున్న మాదిగలకు ఆ గౌరవం ఇవ్వరా? పెత్తందారులు ముఖం జారీ చేస్తే, క్రూడా పటాల్సిన ప్రభుత్వ సిబ్బంది ఆ పని చేస్తే? ఎలా..? అనే ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలి.
కర్నూలు నగరానికి అంతర్భాగంగా ఉన్న రూరల్ మండలంలోని ఈ సంఘటన చోటుచేసుకుంది. "పింఛన్లు పంపిణీ జరుగుతుంది"అని ఉచితంగా దండోరా వేయాలని సచివాలయ సిబ్బంది ఆదేశించారు. దీనికి ఆ మాదిగ పల్లెల్లో ససేమిరా అన్నారు. "దండారో వెయ్యకుంటే పింఛన్లు రద్దు చేస్తాం. పథకాలు కూడా అందవు" అని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తిరుగుబాటు ఎదురయింది. ఈ విషయం కాస్త కుల వివక్ష పోరాట సమితి (kvps) దృష్టికి రావడంతో వెలుగులోకి వచ్చింది.
కర్నూలు మండలం జి సింగవరం, ఎదురూరు గ్రామాల్లో చోటు చేసుకున్న వ్యవహారం ఆలస్యంగా వెరైటీ వచ్చింది. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో విద్య, ఉద్యోగ రంగాల్లో దళితులు పోటీపడుతున్నారు. చదువు వైపు దృష్టిసారించిన మాదిగలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు ప్రభుత్వ పథకాలు కూడా తోడ్పాటు అందిస్తున్నాయి. అదే సమయంలో, గ్రామాల్లో అనాదిగా డప్పు కొడుతున్న మాదిగలు కూడా చైతన్యమయ్యారు. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో డప్పు, గజ్జలు, ప్రత్యేక డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. "డప్పు వాయించడంలో ప్రత్యేకత, విన్యాసాలతో కళాకారులుగా గుర్తింపు" పొందారు. ప్రభుత్వం కూడా ఆ తరహాలోనే వారికి ప్రోత్సాహకం అందిస్తుంది. డప్పు కళాకారులుగా సమాజంలో గుర్తింపు పొందిన మాదిగలు ఆత్మగౌరవంతో జీవించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆత్మ న్యూనతా భావాన్ని కూడా వారు దూరం చేసుకున్నారు అని చెప్పవచ్చు. అందుకు నిదర్శనం వారి పేరు తరువాత "మాదిగ" అని చెప్పుకునే స్థాయికి ఎదగడమే. ఈ వ్యవహారాన్ని ఇలా ఉంచితే,
కర్నూలు నగరానికి దగ్గరగానే జి. సింగవరం, ఎదురూరు పంచాయతీల్లో సచివాలయ సిబ్బంది మాదిగలను "ఉచితంగా డప్పు కొట్టాలి" అని ఆదేశించడంపై వివాదం రాజుకుంది. డప్పు కళాకారుల సంఘం లో సభ్యులుగా ఉన్న ఆ గ్రామాలకు చెందిన మాదిగలు ఎక్కడ రాజీపడలేదు. నాయకుల దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారు. దీంతో ఏపీ డప్పు కళాకారుల సంఘం (Ap Dks), కుల వివక్ష పోరాట సమితి ( kvps) స్పందించింది.
"గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ఉచితంగా డప్పు కొట్టాలంటూ బెదిరించిన సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలి" అని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి బి కరుణాకర్ డిమాండ్ చేశారు. కర్నూల్ నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కేకే భువన్ లో జరిగిన ఏపీ డీకేఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ చక్రపాణి, కే రాజ్ కుమార్ తో కలిసి కరుణాకర్ మాట్లాడారు.
"ఈ సంఘటనపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశాం" అని . "ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ "ప్రతినిధికి కరుణాకర్ చెప్పారు. " ఉచితంగా డప్పు కొట్టకుంటే పెన్షన్లు తీసేస్తామని బెదిరించారు. పథకాలు కూడా ఉండవని హెచ్చరించారు" అని చెప్పిన ఆయన "దళితులు మాత్రమే ఉచితంగా కొట్టాలి"అని అంటే ఇది దళితుల పట్ల అధికారులు చూపుతున్న వివక్ష కాదా అని మండిపడ్డారు.
ఈ ఘటనపై మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశామని డప్పు కళాకారుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఆనందబాబు తెలిపారు. " డప్ప కళాకారులను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలి" అని ఆనందబాబు డిమాండ్ చేశారు.
"ఉచితంగా డప్పు కొట్టాలని బెదిరించిన సచివాలయ అధికారులపై చర్యలు తీసుకోవాలి" అని ... కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి జిల్లా అధికారులను కోరారు. నిరక్షరాస్యులు మాట్లాడలేని దళితులు డప్పు కళాకారులపై అధికారులు రాష్ట్రంలో అక్కడక్కడ ఇలా ప్రతాపం చూపుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది అని ఆయన తెలిపారు. అలాంటి వారిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టితో పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలన్నారు.
Next Story