
తిరుపతి సభలో మాట్లాడుతున్న సీఎం ఎన్. చంద్రబాబు
CM babu Fir e | రౌడీ రాజకీయాలు చేస్తే గుండెల్లో నిద్రపోతా..
తిరుపతి సభలో ఘాటుగా హెచ్చరించిన సీఎం చంద్రబాబు
తిరుపతి నుంచి సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లతో పాటు సమాజంలో చెత్తను ఏరివేసినట్లే రాజకీయ మలినాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని సీఎం ఎన్. చంద్రబాబు అన్నారు.
"రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలను అనిచివేస్తా. రౌడీ రాజకీయాలు చేయాలనుకుంటే వారి గుండెల్లో నిద్రపోతా" అని సీఎం ఎన్. చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఫ్యాక్షన్, రాడీరాజకీలు, తీవ్రవాద కలాపాలకు అడ్డుకట్ట వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రజావేదిక నుంచి ఆయన మాట్లాడారు. తిరుపతి నగర పర్యటనకు శనివారం మధ్యాహ్నం చేరుకున్న సీఎం చంద్రబాబు క్షణం విరామం లేకుండా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అంతకుముందు కపిలేశ్వరాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం తరువాత సీఎం చంద్రబాబు ఆలయ మండపంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రం చేశారు.
తిరుపతి కపిలేశ్వరాలయంలో కార్మికులతో కలిసి మండపంలో శుభ్రం చేస్తున్న సీఎం ఎన్. చంద్రబాబు
ఏపీ లిక్కర్ కుంభకోణంలో A-4 నిందితుడిగా ఉన్న తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు, రాజంపేట ఎంపీ వెంకట మిథున్ రెడ్డి విజయవాడలో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ( Special Investigation Team SIT ) ముందు విచారణకు హాజరయ్యారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు తిరుపతి సభలో ఆసక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు.
తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎక్కడ హత్య, రౌడీ రాజకీయాలకు చోటే ఇవ్వకుండా పనిచేశానని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
తిరుపతిలో కూడా రౌడీ రాజకీయాలు చేసిన వారిని అణిచివేయడంలో టిడిపి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేర రాజకీయాల మనకు అవసరమా? దీని అడ్డుకోలేమా? అని కూడా ప్రశ్నలు లేవనెత్తారు.
స్వచ్ఛ రాజకీయాలు అవసరం
స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ ఒకటే కాదు. స్వచ్ఛత అన్ని రంగాల్లో ఉండాలఅని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
"ఒక పక్క రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. రాజకీయాల పూర్తి గా కలుషితం అయ్యాయి. నేర చరిత్ర కలిగిన వారు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్కపెట్టకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. ఇంట్లో ఏ విధంగా చెత్త క్లీన్ చేస్తున్నారో.. రాజకీయాల్లో కూడా మలినాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం వచ్చింది" ఆ బాధ్యత మీ పైనే ఉంది అని చంద్రబాబు అప్రమత్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నేర రాజకీయాలపై పాత్ర వేయడానికి ఉక్కు పాదం మోపిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
"ఫ్యాక్షన్ రాజకీయాలను కూడా రూపుమాపడానికి ఎక్కడ రాజీ పడలేదు. తీవ్రవాద కలాపాలను కూడా అణిచివేశాం" అని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు సమాజంలో రౌడీ, భూ ఆక్రమణదారులు, కుంభకోణాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.
రాష్ట్రాన్ని పరిశుభ్రం చేయాలి
"పరిసరాలు, ఇల్లే కాదు. అన్ని రంగాల్లో స్వచ్ఛత పాటించాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రాన్ని కూడా రాజకీయంగా పరిశుభ్రం చేయాలి" అని సీఎం చంద్రబాబు అన్నారు. మలినాలను దూరంగా పడేయడానికి ఎలాంటి శ్రద్ధ తీసుకుంటామో రాజకీయాల్లో నేరస్తులు మలినంగా మారారు. వారిని కూడా దూరంగా ఉంచాలని ఆయన హితవు పలికారు. లేదంటే, వ్యర్ధాల వల్ల రోగాలు వ్యాపించినట్లే నేరస్తుల రాజకీయాల వల్ల సమాజం కూడా చెడిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
"నేర రాజకీయాలు తన డిక్షనరీ లోనే లేవు. హత్య రాజకీయాలు కూడా నాకు తెలియవు. వాటిని నేను ఎన్నడూ ప్రోత్సాహించలేదు" అని సీఎం చంద్రబాబు తన గత జీవితాన్ని ఆవిష్కరించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చదువుకున్నా అని గుర్తు చేసిన ఆయన
"విద్యార్థి దశ నుంచి నేనెప్పుడైనా హత్య రాజకీయాలు చేశానా?" ఎవరినైనా చంపానా? మీరు ఎప్పుడైనా విన్నారా? అని సభలో ప్రస్తావించారు. లేదు.. లేదు అని సమాధానం జనం నుంచి సమాధానం వచ్చింది.
మళ్లీ మోసపోకూడదు
2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి ys వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు ఆ నేరం కత్తి తన చేతిలో పెట్టలేని ప్రయత్నం చేశారంటూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ పై మండిపడ్డారు.
"ఈ విషయంలో నేను పొరపాటు పడ్డాను. జనానికి పూర్తిగా చెప్పలేకపోయాను. ప్రజలకు కూడా అదే నిజమనుకుని మోసపోయారు. ఇకపై నేను కానీ, మీరు (ప్రజలు) వైసిపి అబద్ధాల ప్రచారాన్ని నమ్మకూడదు" అని హితవు పలికారు. వైసిపి కుటిల రాజకీయాల నుంచి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
అందుకే దేవుడు కాపాడాడు..
తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తెరిచిన పుస్తకం లాంటిది చంద్రబాబు అన్నారు. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి తప్పులు చేయకపోవడం వల్లే 2003 లో తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లే సమయంలో 23 క్లెమోర్ మైన్స్ నక్సలైట్లు పేల్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన సభలో పంచుకున్నారు.
"సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగానే దిగివచ్చి నాకు ప్రాణ బిక్ష పెట్టాడు. నేను శ్రీవారి భక్తుడిని కావడమే కారణం" అని చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు.
ఫ్యాక్షన్ పై ఉక్కు పాదం
యాక్షన్ వల్ల రాయలసీమలో అనేక గ్రామాలు అడ్రస్ లేకుండా పోయాయని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. గ్రామాల్లో ప్రశాంతత కోసం ఫ్యాక్షన్ భూతాన్ని అణిచివేయడంలో ఎక్కడ రాజీ పడలేదన్నారు.
"రాయలసీమలో ఉన్న ఈ జార్యాన్ని రూపుమాపడానికి తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచి చిత్తశుద్ధితో కృషి చేసింది" అని చెప్పిన చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడ ఈ తరహా కలాభాలకు ఆస్కారం ఇవ్వబోము అని హెచ్చరించారు.
Next Story