ముస్లింలు చెబుతున్న త్రిసూత్రాలు ఏమిటి?
x

ముస్లింలు చెబుతున్న త్రిసూత్రాలు ఏమిటి?

ముస్లింల సంక్షేమానికి త్రిసూత్రాలు పాటించడమే కాదు. వక్ఫ్ ఆస్తులకు ఆ జీవోతో రక్షణ కల్పించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే, ప్రభుత్వ పెత్తనం సహించేది లేదని హెచ్చరిస్తున్నాయి.


రాజులు, దాతలు విరాళాలుగా ఇచ్చిన ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం, అజమాయిషీ సహించేది లేదని ముస్లిం మైనారిటీ వర్గాలు తెగేసి చెబుతున్నాయి. పార్లమెంటులో వక్ఫ్ సవరణ చట్టం-2024 బిల్లుపై వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో సమీక్ష కోసం జాయింట్ పార్లమెంట్ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ముస్లిం పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ చట్టంలో 40 సవరణలు చేయాలనే కేంద్ర ప్రభుత్వ బిల్లుపై ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్షం నిరసన వ్యక్తం చేసింది. బోర్డులో ఇతరులను సభ్యులను చేయాలనే ప్రతిపాదన ముస్లింలను అణగదొక్కడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.



దేశంలో వక్ఫ్ ఆస్తులు 9.40 లక్షలు ఉన్నాయి. రాష్ట్రంలో 31 వేల ఎకరాల వరకు ఉన్నాయి. ఆక్రమణలు, ఫ్రీహోల్డ్ చేయడం వల్ల తరిగిపోయాయి. వాటిని రక్షించడానికి 18/2014 జీవో అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్తం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ తెరపైకి తెచ్చారు.

1955 నుంచి 1965 సంవత్సరాల మధ్య జరిగిన మొదటి సర్వే ప్రకారం 35,703 వక్ఫ్ ఆస్తులను గుర్తించారు. అందులో తెలంగాణలో 32,157 ఉంటే 77,538 ఆక్రమణలకు గురైనట్టు సమాచారం. రాయలసీమలో 1,616 ఎకరాలకు 27,044 ఎకరాలు, కోస్తాంధ్రా 1,930కు 40,929 ఎకరాలు ఆక్రమణల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో రాష్ట్రంలో వక్ఫ్ బోర్డుకు స్ధిరమైన ఆస్తులు 10,708 ఉంటే, భూములే 9.40 లక్షల ఎకరాలని ఇన్సాఫ్ ప్రతినిధి షేక్ షరీఫ్ తెగేసి చెబుతున్నారు. అలాగే అత్యధికంగా తమిళనాడులో 60,223 ఎకరాలు, తెలంగాణలో 41,567, గుజరాత్లో 30,883, కర్ణాకటలో 58,578 ఎకరాలు , అత్యల్పంగా మేఘాలయలో 58 ఆస్తులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

దేశంలో వక్ఫ్క్ష్ ఆస్తులు 7,85,934 ఉన్నాయని మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ వెబ్సైట్ స్పష్టం చేస్తోంది. "అవి పాత లెక్కలు సార్, దేశం మొత్తంలో 10 లక్షల ఎకరాల వరకు ఉన్నాయని నేను చెప్పగలను" అని షేక్ షరీఫ్ ఢంకా బజాయించి చెబుతున్నారు.
"ఒట్టి చేతులతో మూరలు వేయడం సాధ్యం కాదు. ఈ మాటకు జిల్లా స్థాయిలోని వక్ఫ్ కార్యాలయాలే నిదర్శనం" అని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇన్సాఫ్ (న్యాయం) సంస్థ జిల్లా కార్యదర్శి షేక్ షరీఫ్ కోరుతున్నారు.

వక్ఫ్ బోర్డు పని ఏమిటి?
1995లో వక్ఫ్ చట్టం రూపకల్పన చేశారు. విరాళంగా ఇచ్చిన భూములు నోటిఫై చేసిన ఆస్తులను ఆ సంస్థ నియంత్రిస్తుంది. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ. దానంగా అందిన ఆస్తుల స్థితి. ఆదాయం, సంక్షేమం వంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. వక్ఫ్ ప్రతిఫలాలు హక్కుదారులకు చేరుతున్నాయా లేదా అని కూడా అజమాయిషీ చేస్తుంది. ఆస్తులకు సంబంధించిన రికార్డులను నిర్వహిస్తుంది. వక్ఫ్ మూలాలు, ఆదాయం, హక్కుదారులు తదితర వివరాలతో రికార్డులు నిర్వహించాలి.

సిబ్బంది లేకుండా సాధ్యమా?
కమిషనరేట్ కావాలి..
ప్రతి జిల్లాకు వక్ఫ్‌బోర్డులో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి అధికారి ఉన్నారు. శ్మశానాలపై సరైన పర్యవేక్షణలేక శవాన్ని ఖననం చేసేందుకు స్థలం లేక, సరైన దారిలేక, ప్రార్థన కోసం మసీదులు లేక పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈద్గా ఈనాం భూములను ఆక్రమించి పాస్‌పుస్తకాలు కూడా తీసుకున్నారు. ఈ అక్రమాలను అరికట్టి వక్ఫ్ ఆస్తులను సద్వినియోగపరిచేందుకు దేవాదాయశాఖలో మాదిరిగా వక్ఫ్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ వినిపిస్తున్నారు.

పరాధీనం
రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు 9.40 లక్షల ఎకరాలు, ఇతర స్థిరాస్థులు ఉన్నట్లు ముస్లిం పెద్దలు చెబుతున్నారు. ఇందులో సగం వరకు పరాధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, కొన్ని ఆస్తులకు సంబంధించి కోర్టు వివాదాలు కూడా సాగుతున్నాయి. అల్లా పేరిట పూర్వం చక్రవర్తులు, రాజులు, నవాబులు దానం యిచ్చిన భూములు. పేద ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ఈ భూములపై వక్ఫ్ బోర్డు ద్వారా ఆదాయం వాడాలి. దాతలు యిచ్చిన ఈ భూముల్ని విక్రయించే అధికారం వక్ఫ్ బోర్డుకులేదు. కానీ కొందరు ముతవల్లీలు వక్ఫ్ ఆస్తుల అక్రమ వ్యాపారానికి, కబ్జాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రూ. కోట్ల వక్ఫ్‌ బోర్డు భూములు ఆక్రమణల్లో చిక్కి, అన్యాక్రాంతమవుతున్నాయి.



ఇదే నిదర్శనం

ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ మోరమీదపల్లెలోని మసీదుకు దాతలు సర్వేనంబర్ 278/ ఒకటిలో 1.02ఎకరాలు దానంగా రాసి ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల్లోకి వచ్చేసరికి అది25 సెంట్లుగా మారిపోయింది. వక్ఫ్ రికార్డుల్లో మాత్రం దాత ఇచ్చిన వివరాలు ఉన్నాయి. దీనిపై ఇన్సాఫ్ సంస్థ సాగించిన పోరాటం వల్ల ఆస్తులు మళ్లీ కాపాడుకున్నారు. దీనికి సుదీర్ఘ పోరాటం సాగించాల్సి వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధి షరీఫ్ చెప్పడంతో పాటు ఆధారాలు కూడా అందించారు.

యథేచ్ఛగా ఆక్రమణ
కడప జిల్లాలో వక్ఫ్ ఆధీనంలో 1,960 ఎకరాలు ఉన్నాయి. అందులో వెయ్యి ఎకరాల వరకు ఆక్రమణకు గురయ్యాయి. రికార్డులు తారుమారు చేసినా, ఫ్రీహోల్డ్ చేసి, రిజిస్ట్రేషన్ చేసుకున్నా, అడిగి దిక్కులేకుండా పోయారు. కారణం వక్ఫ్ కార్యాలయంలో ఒకరే ఇన్స్పక్టర్ ఉన్నారు. రికార్డుల నిర్వహణ కూడా అంతంతమాత్రంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆక్రమణలకు హద్దు లేకుండా పోయింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముస్లింల సంక్షేమం కోసం 1925లో కూడా దాతలు ఆస్తులు విరాళం అందించారు. 1943లో ఆస్తులు దానంగా ఇచ్చారు. ఆ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయి.

ఇదిగో సాక్ష్యం
"ప్రొద్దుటూరు నియోజకవర్గం చాపాడు వద్ద 42 ఎకరాలు దానంగా రిజిస్ట్రేషన్ చేయించిన భూమి ఆక్రమణలో ఉంది. తాళ్లమాపురంలో ఐదు ఎకరాలకు రికార్డులు బయటికి తీసి, రికవరీ చేయించా" అని ఇన్సాఫ్ (న్యాయం) సంస్థ జిల్లా కార్యదర్శి షేక్ షరీఫ్ తెలిపారు.
"ఎర్రగుంట్ల సమీపంలోని చిలంకూరు వద్ద కూడా సర్వేనంబర్ 1113లో 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించి ఫిర్యాదు కూడా చేశాం" అసలు ఆ నంబర్లే లేవని రెవెన్యూ శాఖ అధికారులు వాదించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా రికార్డులు బయటపెట్టించా" అని షరీఫ్ వివరించారు.
"ఇవన్నీ చేసినా, వక్ఫ్ కార్యాలయం కేవలం ఇన్ స్పెక్టర్కుకు మాత్రమే పరిమితం చేయకుండా సిబ్బందిని పెంచకుండా ఈ ఆస్తుల రక్షణ, రికార్డుల నిర్వహణ సాధ్యం కాదు" అని షరీఫ్ చెబుతున్నారు. "నిషేధిత జాబితా నుంచి తొలగించి, విక్రయించారని ఫిర్యాదు చేసినా స్పందన లేదు" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తహసీల్దార్ కార్యాలయంలో సివిల్ సప్ల్పైస్, ఎన్నికల డీటీ ఉన్నారు.
" వక్ప్ ఆస్తుల రక్షణకు మండల స్థాయిలో డిప్యూటీ తహసీల్దార్ ను నియమించాలి" అని ఆయన రాష్ట్ర సూచన చేశారు. లేదంటే, భూములే కాదు. ఆ రికార్డులు కూడా తారుమారు అయ్యేందుకు ఆస్కారం ఉంది" అని అభిప్రాయపడ్డారు.
ప్రయివేటు ఆస్తులు ఆక్రమించి, వక్ఫ్ బోర్డు ద్వారా కోర్టుకు వెళితే..
ఆస్తి యజమాని నిరూపించుకోవాలి అనేది అంశం కూడా ఉంది తమిళనాడు రాష్ట్రం తిరుచెందూరు గ్రామం భూములు తమవని వక్ఫ్ బోర్డు కోర్టులో కేసు కూడా వేసింది. కానీ, సుదీర్ఘకాలంగా అక్కడ నివసిస్తున్న వారంతా హిందువులే. ఆలయాలు ఉన్నాయి. ఆస్తి హక్కులు కూడా ఉన్నాయి.
"ఇది సున్నితమైన అంశం. ఇక్కడ పరమత సహనాన్ని పాటించాల్సిన అవసరం ఉంది" అని షరీఫ్ అభిప్రాయపడ్డారు.
"అక్కడి ముస్లింలకు నచ్చజెప్పి మతాల మధ్య వివాదం లేకుండా పరిష్కరించాల్సిన అవసరం ఉంది" అని ఆయన సూచిస్తూ, "ఒక దాత భూములు విరాళం ఇవ్వగానే గెజిట్ జారీ చేయరు. దానిపై నోటిఫికేషన్ వెలువడుతుంది. వారసులు ఎవరైనా వస్తే, వారి వినతిమేరకు ఆ ఆస్తి వారికి చెందేలా చేయడం కూడా వక్ఫ్ చట్టంలో ప్రస్తావించిన విషయాన్ని ఆయన ఫెడరల్ ప్రతినిధికి వివరించారు. ఈ "అంశంపై నాకు పూర్తిగా అవగాహన ఉంది" అని ఆయన స్పష్టం చేశారు.

ఈ జీవో అమలుతోనే రక్ష
దాతలు సౌహార్థ్ర హృదయంతో ముస్లింల సంక్షేమం కోసం మసీదులు, దర్గాలు, పీర్లచావిడి కోసం కొందరు ముస్లింలు ఉదారంగా ఆస్తులు ఇచ్చారు. వాటి రక్షణ భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో 18/2014 జీవో అమలు చేయడం మాత్రమే పరిష్కారం అని ముస్లింపెద్దలు చెబుతున్నారు.



ఆస్తులను కాపాడుకోవడంలో ఉన్న లోపాలకు కారణాలు అనేకం. జిల్లా మొత్తం మీద ఉన్న ఆస్తుల పర్యవేక్షణకు అధికారికి సిబ్బంది కొరత ఏర్పడింది. పట్టణాలు, గ్రామాల్లో ముస్లిం మతపెద్దలే రక్షణ కల్పించే పరిస్థితి ఏర్పడింది. ఇందులో చాలా మంది పెద్దలు పోరాటాలు సాగిస్తున్నా, రాజకీయ ముసుగులో ఉన్న ఘరానా పెద్దలు ముస్లిమేతరుల సహకారంతో ఆక్రమణకు యత్నాలు సాగిస్తున్నారు.
అందుకు సాక్ష్యం ..

"కడప నగరం రహీబ్ షావలీ దర్గాకు సంబంధించిన రెండు ఎకరాలు ఆక్రమణకు గురైంది" అని కడప నగరం ఆప్ కి అవాజ్ సంస్థ రాష్ట్ర కార్యదర్శి షేక్ మగ్బుల్ తెలిపారు. "ఈ స్థలాన్ని డిప్యూటీ మాజీ సీఎం సోదరుడు, ఇంకొందరితో కలిసి ఆక్రమణకు పాల్పడ్డారు" అని ఆయన ఆరోపించారు. దీనిపై పోరాడుతున్న నాపై కూడా కేసు నమోదు చేశారని తెలిపారు. మొత్తానికి దర్గాకు కేవలం 27 సెంట్ల స్థలం మాత్రమే ఉందని చెబుతూ, రికార్డుల తారుమారు చేయడానికి యత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు.

"కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లే మార్గంలో కోర్టు ఎదుట ఉన్న దర్గా ఆస్తులపై కూడా ఆక్రమణ గద్దలు వాలుతున్నాయి" అని మగ్బుల్ ఆవేదన చెందారు. ఇలా చెప్పుకుంటూ వెళితే, అంతం లేదని చెబుతున్న ఆయన ఖచ్చితంగా "వక్ఫ్ బోర్డును పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి" అని డిమాండ్ చేశారు.
త్రిసూత్రాలు పాటించండి
1. ముస్లిం లాబోర్డు
2. మిల్లీ కౌన్సిల్
3. జమాత్ ఉలేమా కమిటీ సభ్యులతో చర్చించాకే "వక్ఫ్ బోర్డు, చట్టం వంటి అంశాల జోలికి వెళ్లాలి" అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం
"వక్ఫ్ చట్టం రక్షణకు జేఏసీ ఏర్పాటు చేయాలని కడన నగరంలో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది" అని షేక్ మగ్బుల్ తెలిపారు.
దేశంలో రూ. కోట్ల వక్ఫ్ సంపదను కాపాడే లక్ష్యంగా కడప జిల్లా జేఏసీ ఏర్పాటుకు అఖిలపక్షం నిర్ణయించింది. "వక్ఫ్ చట్టానికి 40 సవరణలు ప్రతిపాదించడం దారుణం. బోర్డు కౌన్సిల్లో ముస్లిమేతర సభ్యులను నియమించాలను కోవడం మైనార్టీలను అణగదొక్కడమే" అని నిరసించారు.
"ముస్లింలకు మేలు చేసే ఉద్దేశ్యం ఉంటే.. రంగనాథ కమిషన్ సిఫార్సులు అమలు చేయండి" అని కర్నూలుకు చెందిన ముస్లిం పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ డిమాండ్ చేశారు. ఆ మేరకు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Read More
Next Story