
తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో సదస్సులో మాట్లాడుతున్నయ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
శాస్త్ర విజ్ణానంతోనే విశ్వమానవ సౌభాగ్యం
దేశ సూపర్ పవర్ కు పదునైన ఆలోచనలు జోడించాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్
విశ్వ మానవాళికి శాస్త్ర విజ్ణానంతోనే సుఖం దక్కుతుందని ఆర్ఎస్ఎస్ (Rashtriya Swayamsevak Sangh RSS) మోహన్ భగవత్ అన్నారు. మనుషులకు సుఖం, దుఖం ఉంటాయని, ఇవి రెండు భౌతికంగా, మానసికంగా ఉంటుందన్నారు. మనం ఈ విశ్వానికి ఎంతో కొంత రుణ పడి ఉన్నాం. మానసికంగా సంతృప్తి లేకుంటే, ఎంతపొందినా సుఖం ఉండదని ఆయన అన్నారు.
తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో శుక్రవారం భారతీయ విజ్ఞాన సమ్మేళనం ద్వారా శాస్త్ర, సాంకేతిక, విజ్ణానాన్ని ప్రజల మధ్య విస్తరింపచేయడం లక్ష్యంగా ఏడో సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్నిముఖ్యమంత్రి నారా చంద్రబాబు, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, విజ్ఞాన్ భారతి (VIBHA)ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ సి. మండే, DRDOమాజీ ఛైర్మన్, రిసెప్షన్ కమిటీ హెడ్ - BVS 2025 డాక్టర్ జి. సతీష్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ జి. ఎస్. ఆర్. కె. మూర్తి,విజ్ఞాన్ భారతి జనరల్ సెక్రటరీ, వివేకానంద పాయ్ తో కలిసి ఆవిష్కరించారు. భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభానికి ముందు మెగా సైన్స్, టెక్ ఎక్స్పో ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భవవత్ కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి ప్రారంభించారు.
అనంతరం జరిగిన సదస్సులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, విశ్వమానవాళి వికాసానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆలోచనలు మరింత పదును పెడుతున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అభినందించారు. వికసిత్ భారత్ కోసం సాంకేతిక రంగం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు ఆదర్శం అని కూడా భగవత్ వ్యాఖ్యానించారు. సాధన ద్వారా లక్ష్యం, దేశపురోభివృద్ధిలో శాస్త్రవేత్తలు మరింత కీలకపాత్ర పోషించాలని భగవత్ అభిలషించారు.
సమాజానికి విజ్ఞానం పంచే విధంగా భారత్ దూసుకుని పోతోందని ఆయన అన్నారు. దూరతీరాల్లోని లక్ష్యాల సాధనకు ఆలోచనలు పరుగు పెట్టించాలని ఆయన శాస్త్రవేత్తలకు సూచించారు.
"భారతదేశం సూపర్ పవర్ లక్ష్యంగా దూసుకుని పోతోంది. అందులో సందేహం లేదు. దీనికి మరింత పదునైన ఆలోచనలు జోడించాల్సిన అవసరం ఉంది" అని ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ దిశానిర్దేశం చేశారు.
ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవాలి
భారత్ వికసిస్తోందని ఇది కేవలంమనకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవాలని మోహన్ భగవత్ సూచించారు. ఆయన ఏమన్నారంటే..
" అన్ని దేశాలు అలాగే ఆలోచన చేస్తున్నాయి. మనిషికి సుఖం అవసరం. వికాసం కూడా అవసరం. విజ్ణానం కూడా ఉండాలి. సూర్యుడు చాలా దూరంలో ఉన్నాడు. అక్కడికి వెళ్లే మార్గం ఆలోచన చేయాలి. ఇది ఆలోచనలు, వికాసంపై ఆధారపడి ఉంటుంది" అని మోహన్ భగవత్ కర్తవ్య బోధ చేశారు.
"2000 సంవత్సరాల నుంచి ప్రపంచలో ఆలోచనలు ఉన్నాయి. సుఖం అనేది భౌతికంగా భావిస్తున్నారు. ఆహారం, నిద్ర, జీవనం మనిషికి ఉంది. జంతువులకు లేదు. వాటికి ఆలోచన శక్త్తి లేదు. మరణించే వరకు మనం జీవించాలి. ఎలా జీవించాలనేది ఆలోచన చేయాలి. సుఖం, దుఖం తాత్కాలికం. జంతువులకు నిరాశ లేదు. మనిషికి ఉంది.
అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మనిషి మానసిక ఆలోచనలు పెంచుకోవాలి. భౌతిక జగత్ తాత్కాలికం. ఏదో శాశ్వతం అనేది ఆలోచన చేయాలి. మనిషి ఆలోచనలపైనే సమాజం ముందుకు సాగుతుంది" అని మోహన్ భగవత్ భవిష్యత్ భారత్ ప్రధానంగా సూపర్ శక్తిగా ఎదగడానికి ఆలోచనల రెక్కలు మరింతగా విప్పారాల్సిన బాధ్యతను గుర్తు చేశారు.
"భారత్ వికాస్ కల్పన అనేది రెండు తలల మధ్య వేలాడుతుంటుంది. మన దృష్టి వేరు. ఈ సృష్టిని జ్నానేంద్రియాలతో చూస్తే అనుభవాల పాఠాలు నేర్పుతాయి" అని ఆలోచనలు ప్రేరేపించే విధంగా మోహన్ భగవత్ అన్నారు. ప్రతి మనిషికీ కూడు, గూడు, గుడ్డ అవసరమనీ, సుఖం ఇచ్చే సంతృప్తి అంతర్లీనంగా ఉంటుందని అని వ్యాఖ్యానించిన ఆయన లోకకల్యాణం కోసం పరితపించాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఒకరి సుఖం వల్ల ప్రయోజనం లేదు. సమాజ హితం కోసం ఆలోచన చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచం సుఖంగా ఉండాలంటే ఆలోచనలకు పదును పెట్టాలి. వికాసం జరగకుంటే, సుఖం దక్కదని కూడా ఆయన హెచ్చరించారు.
Next Story

