
శ్రీశైలం ఆలయంలో ప్రధాని నరేంద్రమోదీకి వేదాశీర్వచనం అందిస్తున్న అర్చకులు
శ్రీశైలం దేవస్థానాన్ని ఎంతమంది ప్రధానులు సందర్శించారు
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి సేవలో ప్రధాని నరేంద్ర మోదీ..
దేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శ్రీకాళహస్తి తర్వాత శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం రెండవది. ఈ ఆలయ సందర్శనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం ఉదయం వచ్చారు. గతంలో నలుగురు ప్రధానులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. ఆ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీకి ఐదవ స్థానం దక్కింది. శ్రీశైలం దేవస్థానంలో స్వామి అమ్మ వాళ్లకు పూజల చేయడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు
"ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ పట్టు పంచె, కాషాయ వస్త్రాన్ని శరీరంపై కప్పుకున్నారు"
ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం ఆలయం వద్దకు రాగానే అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, స్వామి వారి పూలహారాన్ని మోదీ మెడలో వేశారు. ఆయన కంటే ముందు శేష వస్త్రాలు ధరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయంలోకి వెళ్లారు.
సీమపై చెరగని సంతకం
రాయలసీమలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో తిరుమల తర్వాత శ్రీకాళహస్తి, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఉన్న ప్రముఖులు తిరుమల సందర్శనకు ప్రాధాన్య ఇస్తారు. అంతర్జాతీయంగా ప్రముఖులు కూడా శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లాలంటే దట్టమైన నల్లమల అటమీ ప్రాంతంలో సుమారు 50 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సామాన్య యాత్రికులతో పాటు రాష్ట్రంలోని ప్రముఖులు ఎక్కువగా ఏ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు.
ఐదో ప్రధాని..
శ్రీశైలం దేవస్థానాన్ని ఇప్పటివరకు నలుగురు ప్రధాన మంత్రులు సందర్శించి పూజలు చేసిన చరిత్ర ఉంది. శ్రీశైలం నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే ఉంటుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీవీ నరసింహారావు పోటీ చేసి అద్వితీయవైన మెజారిటీతో గెలిచారు. అప్పటికే ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉన్నారు. ఇదిలా ఉంటే,
శ్రీశైలం దేవస్థానాన్ని భారత దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదట సందర్శించిన రికార్డు ఉంది ఆ తర్వాత ప్రధానమంత్రి హోదాలో ఇందిరా గాంధీ కూడా శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించారు. పంజాబ్లో ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇందిరాగాంధీని సెక్యూరిటీ గార్డు హత్య చేసిన విషయం తెలిసింది. వారి వారసుడుగా ప్రధానమంత్రి పీఠం అధిష్టించిన రాజీవ్ గాంధీ కూడా తన పదవీకాలంలో శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించి పూజలు చేశారు.
కొన్ని దశాబ్దాల తర్వాత నరేంద్ర మోడీ శ్రీశైలం దేవస్థానానికి రావడం అనేది రాయలసీమ చరిత్రలో ఓ చెరగని సంతకంగా మిగిలిపోయే రీతిలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు చేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి శ్రీశైలం వెళ్లారు. కొన్ని దశాబ్దాల కిందటి పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ, శ్రీశైలం దేవస్థానం తో పాటు సమీప ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు కాదు. ప్రధాని నరేంద్ర మోడీ మరిచిపోలేని విధంగా ఏర్పాట్లు చేయడంలో టిడిపి కూటమి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది
నంద్యాల కు ప్రత్యేక గుర్తింపు
కర్నూలు జిల్లా నంద్యాల లోక్సభ స్థానానికి రాజకీయంగా చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 1977లో నీలం సంజీవరెడ్డి నంద్యాల నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. లోక్సభ స్పీకర్ గా కూడా పనిచేసిన నీలం సంజీవరెడ్డి ఆ తర్వాత అత్యంత ప్రధాన పదవి రాష్ట్రపతిగా కూడా ఆయన పని చేశారు.
1991లో లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో ఉన్న ప్రధాని రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీ పెరంబదూరు వద్ద ఎన్నికల సభలో ఎల్టిటి మానవ బాంబు దాడిలో మరణించడంతో పీవీ నరసింహారావుని మొదట ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఆ తర్వాత ఆయన నంద్యాల లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 5.80 లక్షల మెజార్టీతో గెలిచి ప్రధానమంత్రి పదవిని పరిచయం చేసుకున్నారు. రెండవసారి కూడా 1996 లో ఆయన నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించారు.
నంద్యాల నియోజకవర్గ భారత ప్రధానిని దేశానికి అందించిన అరుదైన గౌరవం కూడా దక్కించుకుంది.
ఇదిలా ఉంటే..
కర్నూలు నగరంలో ముగ్గురు ప్రధానులు
ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఎంపీగా గెలిచిన ప్రధాని హోదాలో పీవీ నరసింహారావు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తర్వాత 2004లో ఓర్వకల్లు మండలం సోమయాజుల పల్లెలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చలించిపోయారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కర్నూలుకు వచ్చారు. ఆ తర్వాత కర్నూలు నగరంలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాదం మోపారు. ఈ పర్యటన కన్నులు జిల్లా నే కాదు రాయలసీమ పారిశ్రామిక, రవాణా ఇతర అనేక రంగాలలో అభివృద్ధి జట్ వేగంతో సాగుతుందనే ఆశాభావం సర్వత్ర వినిపిస్తోంది. అందుకు కారణం 13వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
Next Story