
'చిత్తూరు'లో వైసీపీ ఎలా ఆత్మరక్షణలో పడింది?
గంగాథరనెల్లూరులో ఈ రోజు హోంమంత్రి, దళిత ఎమ్మెల్యేలు ఏమి చేయబోతున్నారు.
చిత్తూరు జిల్లాలో నకిలీ మద్యం తయారీ ఘటన రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. జిల్లాలోని గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం దేవళంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై వైసిపి ఆత్మరక్షణలో పడింది.
" జరగని ఘటనను జరిగినట్లుగా చిత్రీకరించి, రాజకీయ. లబ్ధికి కుట్రకుతెర తీశారు" అని గంగాధర నెల్లూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే వి.ఎం థామస్ ఆరోపించారు. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి శనివారం మధ్యాహ్నం రాష్ట్ర హోం మంత్రి తో పాటు రాయలసీమలోని తొమ్మిది మంది టిడిపి దళిత ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనున్నారు. ఈ పరిస్థితుల్లో
"రాజకీయంగా ఆ శాంతి సృష్టించడం ద్వారా లబ్ధి పొందాలని వైసిపి ప్రయత్నిస్తోంది. వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం" అని జీడీ నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ vm. థామస్ స్పష్టం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం కే నారాయణస్వామి పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జరగని ఘటనను జరిగినట్లు చిత్రీకరించి మాజీ మంత్రి నారాయణస్వామి అనుచరుడు సర్పంచ్ గోవిందయ్య సంచలనం సృష్టించడానికి ప్రయత్నించారు" అని జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఆరోపించారు.
ఘటన ఇది...
గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామం వద్ద ఈ నెల మూడో తేదీ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపింది. విచారణ తర్వాత జరిగిన సంఘటనను దళిత సర్పంచ్ గోవిందయ్య పక్కదారి పట్టించారని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తేల్చి చెప్పారు. అంతకుముందే వైసిపి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి తో పాటు వైసిపి మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు భారీగా తరలి వెళ్లి దేవళంపేట వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు..
"కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులకు రక్షణ లేకుండా పోయింది. అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేసిన వారిని శిక్షించాలని" వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
దేవుళంపేటలో అప్పటికే విచారణ సాగిస్తున్న చిత్తూరు పోలీసులు, ఈ ఘటనకు అసలు బాధ్యుడు వైసిపి మద్దతుదారుడైన సర్పంచ్ గోవిందయ్యే కారణమని తేల్చారు. దీంతో వైసిపి ఆత్మ రక్షణలో పడింది.
తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువు వద్ద నకిలీ మద్యం వ్యవహారం తెరపైకి రాగానే సీఎం ఎన్ చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించడంతోపాటు టిడిపి తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ దాసర్లపల్లి జై చంద్ర రెడ్డి తో పాటు సతీష్ నాయుడు ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కేసులో వారిని నిందితులుగా కూడా చేర్చారు..మొలకలచెరువు ఎక్సైజ్ విభాగం సీఐ హిమబిందువును రాష్ట్ర కార్యాలయానికి అటాచ్ చేసి ఆ తర్వాత సస్పెండ్ చేశారు. ఇవన్నీ గంటల వ్యవధిలో అమలు కావడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దీంతో వైసిపికి గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. మినహా, ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ లో పీక లోతు కష్టాల్లో ఉన్న వైసీపీకి టిడిపిని ఎదుర్కొనపెట్టే అస్త్రం దొరకకుండా పోయింది.
జీడి నెల్లూరులో సెల్ఫ్ గోల్..
గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురు కుప్పం మండలం దేవలంపేట వద్ద అంబేద్కర్ విగ్రహానికి సమీపంలో ఉన్న దుకాణంలో చెలరేగిన మంటలు ప్రమాదానికి కారణమయ్యాయి. ఈ మంటలు సోకి అంబేద్కర్ విగ్రహం స్వల్పంగా దెబ్బతినింది. ఈ సమాచారం తెలిసినప్పటికీ దీనికి మసిబూసి మారేడు కాయ చేయాలని డిప్యూటీ మాజీ సీఎం కళాత్తూరు నారాయణస్వామి మద్దతుదారుడైన దేవులంపేట దళిత సర్పంచ్ గోవిందయ్య ధర్నాలు, రాస్తారోకో చేయించడం ద్వారా సంచలనం సృష్టించడానికి ఎత్తుగడ వేశారని విషయం పోలీసులు దర్యాప్తులో తేలిపోయింది. ఆత్మ రక్షణలో పడిపోయింది. ఈ ఘటనపై ఆ తర్వాత వైసీపీ నాయకుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం కూడా దీనికి కారణం.
ఈ పరిస్థితుల్లో వైసిపి ఏదో ఒక సంఘటన ఆసరాగా చేసుకుని అశాంతి నెలకొల్పడానికి కుట్రలు పన్నుతోందని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఆరోపించారు.
లోకేష్ ఆదేశంతో కదిలిన ఎమ్మెల్యేలు..
"వైసిపి కుట్రలు పన్నడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని ఎత్తున వేస్తోంది.. దీనిని సమర్థవంతంగా తిప్పి కొట్టండి" అని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దళిత ఎమ్మెల్యేలకు సూచన చేసినట్లు టిడిపి నాయకుల ద్వారా తెలిసింది.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం విగ్రహానికి కళంకం ఆపాదించాలని ప్రయత్నించిన దేవళంపేట వద్దకు శనివారం మధ్యాహ్నం రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తో పాటు. చిత్తూరు జిల్లాలోని దళిత ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు. వారిలో
చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, సులూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్, గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హాజరుకానున్నారు. హెంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు ఏమి చేయబోతున్నారనేది వేచిచూడాలి.
Next Story