
ఎస్వీయులోకి చిరుత ఎలా వచ్చింది..!
బోనులో చిక్కిన చిరుతను ఏం చేశారు?
తిరుమల శేషాచలం అడవులకు దిగువ భాగంలో చిరుతల సంచారం పెరిగింది.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో ఓ మగ చిరుత అటవీశాఖ అధికారులు అమర్చిన బోనులో ఆదివారం రాత్రి చిక్కింది.
"ఈ చిరుతను శేషాచలం అడవుల్లో సురక్షితంగా వదలడానికి తీసుకు వెళుతున్నాం" అని తిరుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుదర్శన రెడ్డి (Tirupati forest range officer FRO) చెప్పారు.

తిరుమలకు ముఖద్వారంగా ఉన్న అలిపిరి నుంచి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వరకు చిరుతలు ఎందుకు సంచరిస్తున్నాయి? ప్రజలు కూడా తీసుకోవలసిన జాగ్రత్తలను అటవీశాఖ గుర్తుచేస్తోంది.
అలిపిరి నుంచి ఎస్వి జూ పార్కుకు వెళ్లే బైపాస్ రోడ్డు మొత్తం శేషాచలం అడవులకు దిగువ భాగంలోని ఉంది. ఈ రోడ్డుకు రెండు పక్కల పడవేస్తున్న వ్యర్థ పదార్థాలు ప్రధానంగా ఎస్వీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఆహార పదార్థాల కోసం కుక్కలు ఎక్కువగా వస్తున్నాయి. వీటికి తోడు వన్యప్రాణుల సంచారం కూడా అధికంగా ఉంది. అందువల్ల
"తిరుమలగిరిల నుంచి చిరుతలు దిగువ ప్రాంతానికి వస్తున్నాయి" అని తిరుపతి అటవీ శాఖ అధికారి సుదర్శన్ రెడ్డి విశ్లేషించారు.

అలిపిరి బైపాస్ రోడ్డులో అరబిందో కంటి ఆసుపత్రికి సమీపంలో మూడు వారాల కిందట బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తిపై చిరుత పులి దాడి చేసింది. ఈ సంఘటనతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు శేషాచలం కొండలకు దిగువన అడవిలో ఒక బోను ఏర్పాటు చేశారు. అందులో ఓ జంతువును ఉంచి, ట్రాప్ కెమెరాలు అమర్చారు. 15 రోజులుగా నిరంతరం నిఘా ఉంచినప్పటికీ చిరుతం బోనులో చిక్కలేదు.
ఈ పరిస్థితిని అధ్యయనం చేసిన తిరుపతి అటవీ శాఖ అధికారులు, చిరుత సంచారం పై తులసితంగా దృష్టి నిలిపారు.
" తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పరిపాలనా భవనం వెనుక వైపు తో పాటు మరో మూడు చోట్ల కూడా బోర్లు అమర్చినట్లు" తిరుపతి అటవీ శాఖ అధికారి సుదర్శన రెడ్డి చెప్పారు.
"తిరుమల ఏడవ మైలు నుంచి అటవీ ప్రాంతంలో అలిపిరి బైపాస్ రోడ్డుకు కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఆహారం కోసం దిగు ప్రాంతానికి చిరుతలు వస్తున్నాయి" అని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుదర్శన్ వివరించారు.
చిరుత ఎలా దొరికిందంటే..
వన్యమృగాల వల్ల ప్రజలకు నష్టం జరగకూడదు. అటలాగే కొన్ని ప్రాణులు కూడా సురక్షితంగా ఉండాలని దిశగానే అటవీ శాఖ చర్యలు తీసుకుంటోంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తో పాటు సమీప ప్రాంతాల్లోని అడవిలో నాలుగు చోట్ల చిరుత కోసం బోన్లు ఏర్పాటు చేశారు. అందులో ఎస్వీయూలో చిరుత దొరికిన వివరాలను ఎఫ్ఆర్ఓ సుదర్శనరెడ్డి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో పంచుకున్నారు.
"గత మూడు వారాలలో, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) క్యాంపస్, వేదిక్ విశ్వవిద్యాలయం, అలిపిరి–జూ రోడ్డు సమీపంలో చిరుతపులి సంచారంపై వచ్చిన నివేదికల ఆధారంగా నాలుగు ట్రాప్ బోనులను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశాం. ఆదివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో, ఒక మగ చిరుతపులి ఈ బోనులో చిక్కింది" అని ఎఫ్ఆర్ఓ సుదర్శన్ రెడ్డి చెప్పారు.
ఈ ప్రదేశాలను జనసంచారంతో పాటు అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రజలు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజా భద్రత, మానవ-వన్యప్రాణుల సంఘర్షణను తగ్గించడానికి చేసిన ఆపరేషన్ ఫలించింది అని ఆయన వివరించారు.
అటవీ శాఖ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (SOPలు) ప్రకారం అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఈ చిరుతను బంధించాం అని ఎఫ్ఆర్ఓ వివరించారు.
చిరుతల సంరక్షణ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బంధించిన ఈ చిరుతను జనాభాసాలకు దూరంగా ఉన్న దట్టమైన అడవిలో సురక్షితంగా వదిలివేయడానికి తీసుకు వెళుతున్నాం అని వివరించారు.
Next Story