శ్రీవారి గరుడసేవ చూడాలని ఉందా...
x
తిరుమలలో మలయప్పస్వామివారి గరుడసేవ (ఫైల్)

శ్రీవారి గరుడసేవ చూడాలని ఉందా...

మంగళవారం తిరుమలకు వెళదాం.. రండి.


శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గరుడోత్సవం చూడాలనుకునే వారికి మంచి అవకాశం. రేపు రాత్రి (అక్టోబర్ 7వ తీదీ) మలయప్పస్వామి గరుడవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీనికోసం టీటీడీ తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

తిరుమలలో ప్రతి నెలా పౌర్ణమి రోజు గరుడోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పండువెన్నెల పరుచుకున్న వేళ, మలయప్ప గరుడవాహనంపై ఆశీనులై శ్రీవారి ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు.
శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న వాహనమండపం నుంచి మలయప్ప స్వామివారిని అలంకారభూషితుడిని చేసి, గరుడవాహనంపై ఆశీనులను చేస్తారు. రాత్రి ఏడు గంటలకు గరుడవాహన సేవ ప్రారంభమై, రాత్రి తొమ్మది గంటల వరకు సాగుతుంది. స్వామివారి వాహనసేవ ముందు కళాబృందాలు నీరాజనం సమర్పించనున్నాయి. దీనికోసం టీటీడీ అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. స్వామివారి వాహనసేవ ముందు బ్రహ్మోత్సవాలకు తీసిపోని విధంగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి.
Read More
Next Story