శ్రీవారి భక్తులకు స్నేహపూర్వక సేవలు
x

శ్రీవారి భక్తులకు స్నేహపూర్వక సేవలు

శ్రీవారి భక్తులకు స్నేహపూర్వక సేవలు అందిస్తా అని టీటీడీ అదనపు ఈవో సీహెచ్. వెంకయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఐఆర్ఎస్ 2005 బ్యాచ్ అధికారి అయిన ఆయన శనివారం తిరుమల ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.


రుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ అదనపు ఈవోగా సీహెచ్. వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సమేతంగా శనివారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పారాయణదారులు వేదశీర్వచనం చేశారు.



ఆయనకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తీర్థప్రసాదాలు, స్వామివారి ఫోటో, అగరబత్తులు, గో ఉత్పత్తులను అందించారు. ఆయనను ఎస్వీబీసీ సీఈవో షణ్ముగకుమార్, సీఈ నాగేశ్వరరావు, ఎస్‌ఈ2 జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు లోకనాథం, హరీంద్రనాథ్, ప్రశాంతి, సీపీఆర్వో డాక్టర్ టీ.రవి స్వాగతించారు.టీటీడీ తిరుమల అదనపు ఈఓగా ఐఆర్ఎస్ 2005- బ్యాచ్ అధికారి సీహెచ్. వెంకయ్యచౌదరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (24న) ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో కమిషనర్ గా ఉన్న ఆయనను మూడేళ్ల కాలపరిమితితో డిప్యూటేషన్ పై తీసుకు వచ్చింది.


బాధ్యతలు స్వీకారించిన అరువాత అదనపు ఈవో మాట్లాడారు. "శ్రీవారి దర్శనార్థం ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు స్నేహపూర్వక, సౌకర్యవంతమైన సేవలు అ అందివ్వడానికి శ్రద్ధ తీసుకుంటా" అన్నారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు.భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. శ్రీవారి ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు, భక్తులకు అత్యంత అంకితభావంతో సేవలందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అంతకుముందు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ భూవరాహస్వామిని దర్శించుకున్నారు.
Read More
Next Story