BREAKING | 'చిత్తూరు'లో ఘోర ప్రమాదం...
బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. 14 మంది గాయపడ్డారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి చెన్నై జాతీయ రహదారిపై జరిగిన ఈ సంఘటనతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు స్తంభించాయి. కొద్దిసేపటి కిందటే (ఆదివారం రాత్రి) రాత్రి సుమారు 11 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మందికి పైగానే తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది.
ఆంధ్ర- తమిళనాడుకు సరిహద్దులో ఉన్న చిత్తూరు జిల్లా నగరి మండలం రామాపురం వద్ద ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు అందిన సమాచారం. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితులను నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాత్రి కావడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ప్రమాద ధాటికి భయకంపితులయ్యారు. చీకట్లో ఏమి జరిగిందనేది తెలుసుకునే లోపల గాయపడిన వారి ఆర్తనాదాలు, రోదనలు మిన్నంటాయి. పరిస్థితి విషమంగా ఉన్న వారిని తిరుపతి ఎస్వీఆర్ఆర్ (SVRR Hospital)కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story