Rayachoti |ఆ ఉగ్ర బాంబులు జనం మధ్య పేలి ఉంటే..
x
రాయచోటి నిర్మానుష్య ప్రదేశంలో ఐఈడీ బాంబులు నిర్వర్యం చేస్తున్న పోలీసులు

Rayachoti |ఆ 'ఉగ్ర బాంబులు' జనం మధ్య పేలి ఉంటే..

ఐఈడీ పేలుళ్లతో దద్దరిల్లిన రాయచోటి శివారు ప్రదేశం.



అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణ శివారులో ఐఈడి బాంబు (improvised exposure device) పేలుళ్లతో దద్దరిల్లింది. జన సంచారం ఉన్న ప్రదేశంలో ఉగ్రవాదులు వీటిని పేల్చి ఉంటే, తీవ్రపాల నష్టం ఉండేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.
రాయచోటి పట్టణంలో అల్ ఉమా గ్రూపునకు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిక్, వరుసకు అతని సోదరుడైన మహమ్మద్ అలీ ని ఇంటెలిజెన్స్ బ్యూరో, తమిళనాడు ఆంటీస్ స్క్వాడ్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పట్టణంలోని వేరువేరు ప్రదేశాల్లో సుమారు 37 గా తలదాచుకున్న వారి నివాసాల్లో అన్నమయ్య జిల్లా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందులో సాహిత్యం ఆయుధాలతో పాటు 50 లు తయారు చేయడానికి అవసరమైన విడిభాగాలు, పదార్థాల తో పాటు కొన్ని ఐ ఈ డి, సూట్ కేస్ బాంబులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
"దేశంలోని మూడు నగరాల్లో పేలుళ్లకు కుట్రపన్నారు" అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. తీవ్రవాదుల వీళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్న మ్యాపులు, ఇతర వివరాల ద్వారా ఈ విషయం బట్టబయలైన విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
బాంబుల నిర్వీర్యం

కర్నూలు రేంజీ డీఐజీ కోయ ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో బాంబు స్క్వాడ్ నిపుణులు

పట్టణంలో అరెస్టు చేసిన ఉగ్రవాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న నాలుగు ఐ ఈ డి, సూట్ కేస్ బాంబులను శుక్రవారం ఉదయం నిర్వీర్యం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా రప్పించిన బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (bamboo disposal squad) నిపుణులు రాయచోటి డిఎస్పి కార్యాలయానికి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఈ బాంబులను నిర్వీర్యం చేశారు.
కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సారధ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ప్రత్యేక వాహనంలో ఐఈడి బాంబులను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లారు. రాళ్లు గుట్టలతో నిండి ఉన్న ప్రదేశంలో ఇసుక బస్తాల ఒక్కొక్కటిగా ఐఈడి బాంబులు అమర్చి, పేల్చివేశారు.
రాతిగుట్టల మధ్య ఈ బాంబులను నిర్వీర్యం చేసే సమయంలో వచ్చిన పేలుడు దాటికి ఆ ప్రాంతాలు దద్దరిల్లాయి. బాంబుల విస్పోటనం ఆ స్థాయిలో ఉంది.
కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మీడియా సమావేశంలో చెప్పినట్టు "జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశంలో ఉగ్రవాదులు వీటిని పేల్చి ఉంటే ప్రాణనష్టం ఎక్కువగా ఉండేది" అనే విషయం బాంబులను నిర్వీర్యం చేసే సమయంలో స్పష్టంగా కనిపించింది.
భద్రత మధ్య...



ఉగ్రవాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఐ ఈ డి, సూట్ కేస్ బాంబులను నిర్వీర్యం చేయడానికి ముందే కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ముందస్తుగా గట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నారు.
నిర్మానుష్య ప్రదేశానికి బాంబులను ప్రత్యేక సిబ్బంది తీసుకువెళ్లారు. స్థానిక పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. అనుకోని పరిణామం ఎదురైతే వైద్య సహాయం వెనువెంటనే అందించడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడానికి ఎస్బి విద్యాసాగర్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఐఈడి బాంబు అంటే..
తీవ్రవాద సంస్థలు బాంబులు స్వయంగా తయారు చేస్తారనే విషయం అనేక ఘటనల్లో పోలీసులు నిర్ధారించిన విషయం తెలిసింది. రాయచోటి పట్టణంలో ఇంటెలిజెన్సీ బ్యూరో సిబ్బంది అరెస్టు చేసిన ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధికి, మహమ్మద్ అలీ కూడా బాంబుల తయారీలో నిష్ణాతులు అని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం బాంబుల తయారీకి స్థానికంగా వస్తువులు వాడతారు.
ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED) అనేది ప్రామాణిక సైనిక లేదా వాణిజ్య ఉత్పత్తి సౌకర్యాల వెలుపల తయారు చేయబడిన లేదా అమర్చబడిన బాంబు లేదా పేలుడు పరికరం. ఈ పరికరాలు తరచుగా సులభంగా అందుబాటులో ఉన్న పదార్థాలు మరియు భాగాలను ఉపయోగించి నిర్మించబడతాయి. విధ్వంసం, గాయం లేదా అంతరాయం కలిగించేలా తయారుచేస్తారు. దీని విస్ఫోటనం వల్ల నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది అనే విషయం స్పష్టమైంది. రాయచోటిలో నిర్మాణస్య ప్రదేశంలో ఆ ఐ ఈ డి పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే సమయంలో శబ్దం, విస్పోటనం అలా కనిపించింది.
ఒకరి తండ్రి పోలీస్?
రాయచోటి పట్టణంలో పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒక వ్యక్తి తండ్రి తమిళనాడు పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ ఉగ్రవాది వల్ల ఆ కుటుంబానికి కూడా తిప్పలు తప్పవని భావిస్తున్నారు. ఆ పోలీస్ తండ్రికి ఇతనితో సంబంధాలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ, ఆయనను కూడా విచారణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శిక్షణ ఇచ్చారా?
పట్టణంలో ఎవరికి సందేహం రాకుండా ఇద్దరు ఉగ్రవాదులు తమ కళాపాలకు పదులు పెట్టినట్లు విషయం బయటపడింది. ఇన్నేళ్లుగా ఈ ప్రాంతంలో మకాం వేసిన ఉగ్రవాదుల కదలికలు బయటికి తిరిగినప్పటికీ, వారు ఏమి చేశారు? ఎవరెవరితో మాట్లాడుతున్నారు. యువతను పెడదామా పట్టించడానికి మనసులు కలుషితం చేశారా? తీవ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గు చూపే విధంగా శిక్షణ ఇచ్చారా? అనే కోణంలో కూడా నిఘా వర్గాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిసింది.
Read More
Next Story