అదిగో ఏనుగు.. ఇక ఆ భయం ఉండదా..?
x

అదిగో ఏనుగు.. ఇక ఆ భయం ఉండదా..?

పంటల రక్షణ. రైతులు, ఏనుగుల ప్రాణాలకు భరోసా ఇస్తున్నట్లు అటవీశాఖ చెబుతోంది. బహుళ ప్రయోజనాల కోసమే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ బృందం ఎలా పనిచేస్తుందంటే..


ఏనుగులకు పంటలు చిరుతిండిగా ఎందుకు మారాయి?

శేషాచలం అటవీప్రాంతంలో ప్రపంచ మార్కెట్ ను ప్రభావితం చేయగలిగిన ఎర్రచందనం వనాలు ఉన్నాయి. స్మగ్లర్ల నుంచి ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణా కాకుండా కాపాడేందుకు ఐపీఎస్ అధికారి స్థాయిలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తోంది.

అటవీశాఖ ద్వారా పంటపొలాలను కాపాడడం. రైతుల ప్రాణాలు, వన్యప్రాణుల రక్షణ కోసం మరో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. రైతుల నుంచి సమాచారం అందగానే యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయి సిబ్బంది రంగంలోకి దిగి, నష్టనివారణకు చర్యలు తీసుంటారని తిరుపతి డీఎఫ్ఒ వివేక్ చెబుతున్నారు.

శేషాచలం అటవులు విస్తరించి ఉన్న 4,755 చదరపు కిలోమీటర్లు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం అసాధ్యం అంటున్నారు. కిలోమీటర్ ఫెన్సింగ్ కు రూ. పది లక్షలు ఖర్చు అవుతుందనేది అటవీశాఖ అధికారులు చెబుతున్న లెక్క.కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ధ్వంసమైంది. కందకాలు కూడా చాలా వరకు పూడిపోయి, ఏనుగులు పంటలపై దాడులు చేస్తున్నాయి. వాటిని బెదరగొట్టే యత్నాల్లో ఇప్పటి వరకు దాదాపు 50 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లులో కౌలు రైతు, అంతకుముందు సీఎం ఎన్. చంద్రబాబు కందులవారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ఏనుగుల దాడిలో మరణించిన ఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి.
"ఏనుగుల వల్ల ప్రజలకు నష్టం జరగకూడదు. జనం వల్ల వన్యప్రాణులకు ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోండి" అని అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ ఆదేశాలతో చిత్తూరు జిల్లా యంత్రాంగం స్పందించింది.
చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పంటలను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఏనుగుల దాడుల వల్ల 2011 నుంచి 25 మంది మరణించారు. 2018 నుంచి 24 వరకు ఏనుగుల దాడుల్లో మరణించిన కుటుంబాలకు రూ. ఐదు లక్షలు మాత్రమే చెల్లించే వారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆ మొత్తం రూ. పది లక్షలకు పెంచారు.
ఈ ఏడాది శివరాత్రి జాగారం కోసం అన్నమయ్య (కడప జిల్లా) జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ఉర్లగట్టుపోడు, కన్నెగుంట ఎస్టీ కాలనీల నుంచి బయలుదేరిన శివభక్తుల అలజడితో ఏనుగులు దాడి చేశాయి. ఇద్దరు గాయపడగా, ముగ్గురు మరణించారు. వారి కుటుంబంలో ఒక్కొక్కరికి రూ. పది లక్షల పరిహారం అందించారు.
చిత్తూరు జిల్లాలో 2015 నుంచి 24 మధ్య కాలంలో 233 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు గుర్తించారు. అందులో 76.321 లక్షలకు గానూ, 2022 నాటికి రూ. 56 లక్షలు చెల్లించారు.
"తిరుపతి జిల్లాలో కూడా గత మూడేళ్లలో రూ.50 లక్షల పంట నష్టం. రైతులకు రూ. 30 లక్షలు చెల్లించాం డీఎప్ఓ వివేక్ తెలిపారు.
"శేషాచలం" అటవీ గ్రామాల్లో దడ
శేషాచలం అటవీప్రాంతం 4,755 చదరపు కిలోమీటర్లలో అన్నమయ్య, కడప, చిత్తూరుకు సరిహద్దులోని నెల్లూరు జిల్లాల వరకు విస్తరించి ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు పడమటి ప్రాంతంలో తమిళనాడులోని కరియమంగళం, కర్ణాటకలోని కౌండిన్య అటవీప్రాంతం అనుసంధానంగా ఉంది. పొరుగు రాష్ట్రాలకు సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు, తంబళ్లపల్లె, పీలేరు నుంచి ఇటు చంద్రగిరి నియోజకవర్గం వరకు, కడప జిల్లా రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు తాలూకాల్లోని అటవీ సమీప గ్రామాల్లో మామిడి, చెరకు, వేరుశెనగ, టమాటతో పాటు మిగతా ఉద్యానవన పంటలకు ఏనుగుల దాడుల్లో తీవ్రంగా నష్టం జరుగుతోంది.
తమిళనాడు నుంచి విస్తరించి ఉన్న శేషాచలం అటవీప్రాంతంలో సుమారు 15 ఏనుగుల మంద సంచరిస్తున్నట్లు అటవీశాఖ యంత్రాంగం గుర్తించింది. వాటి సంతతి పెరిగిన నేపథ్యంలో అడవుల్లో ఆహారం, నీటి కొరత అనడం కంటే, పంటలను చిరుతిండికి అలవాటు పడ్డాయి. తిరుపతి డీఎఫ్ఒ వివేక్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
"మధురమైన వాసనతో పాటు తీపి అంటే ఏనుగులు బాగా ఇష్టపడతాయి. అందుకే చెరువు, మామిడి తోటలపై దాడులకు దిగుతున్నాయి" అని డీఎఫ్ఓ వివేక్ అంటున్నారు. అందువల్ల
రైతుల రక్షణకు టాస్క్ ఫోర్స్
శేషాచలం అటవీప్రాంతంలో అటవీ సమీప గ్రామాల్లో ఏనుగుల వల్ల పంటలకు నష్టం జరగకుండా నివారించడం, గ్రామస్తుల వల్ల వన్యప్రాణులకు ప్రమాదాల నివారణకు అటవీశాఖ టాస్క్ ఫోర్స్ కార్యాచరణ ఉంటుందని డీఎఫ్ఓ వివేక్ స్పష్టం చేశారు.
తమిళనాడులోని సత్యమంగళం, కర్ణాటక ప్రాంత అడవులకు సమీపంలో ఉన్న చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతం కుప్పం నుంచి తంబళ్లపల్లె వరకు ఎలిఫెంట్ కారిడార్ గా గుర్తించారు. ఈ ఏరియాలోని అటవీ సమీప గ్రామాల్లో సాకులోని పంటలపై ఏనుగుల దాడి చేస్తున్న సమాచారం అందగానే తిరుపతి డీఎఫ్ఓ పి. వివేక్ సారధ్యంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ లో చిత్తూరు డీఎఫ్ఓ ఎస్. భరణి, ఫ్లయింగ్ స్క్వాడ్లోని పీలేరు, తిరుపతి డీఎఫ్ఓలు, తిరుపతి సబ్ డీఎఫ్ఓ బాధ్యతలు పర్యవేక్షిస్తారు. ఈ కమిటీలో చిత్తూరు వెస్ట్ ఎఫ్ఆర్ఓ ( Forest Range Officer FRO ) ల బృందం, పది మంది ఎలిఫెంట్ ట్రాకర్స్ అందుబాటులో ఉంటారు.
పంటలపై ఏనుగులు దాడులకు దిగినప్పుడు సమాచారం అందించడానికి అటవీశాఖాధికారుల సెల్ ఫోన్ నంబర్లు గ్రామాల్లో ఇచ్చారు. ఎఫ్ఆర్ఓలను అప్రమత్తం చేయడం ద్వారా "ఏనుగులను అడవుల వైపు మళ్లించడానికి టాస్క్ ఫోర్స్ టీం పని చేస్తుంది. దారి మళ్లించిన ఏనుగుల జాడ, తిరిగి రాకుండా నివారించడానికి డ్రోన్లతో పర్యవేక్షణ ఉంటుంది" అని కూడా డీఎఫ్ఓ వివేక్ స్పష్టం చేశారు. పెద్దసంఖ్యలో ఏనుగులు తరలివస్తే, వాటిని దారిమళ్లించడం లేదా, నిలువరించడానికి కుప్పంలో ఉన్న రెండు కుంకీ ఏనుగులను కూడా అవసరమైన సందర్భాల్లో రంగంలోకి దించడానికి కూడా అటవీశాఖ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ కార్యాచరణ అమలులో ఎలాంటి ఫలితం ఉంటుందనేది వేచి చూడాలి.
Read More
Next Story