కర్నూలుకు మరోసారి వరదముప్పు
x

కర్నూలుకు మరోసారి వరదముప్పు

రాయలసీమలోని కర్నూలుకు రెండోసారి వరద ముప్పు ఏర్పడింది. రాష్ట్రంలో ప్రాజెక్టులకు అదే పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.


కర్ణాటక నుంచి కర్నూలు జిల్లాలోని హంద్రీ నదికి వరదనీరు పోటెత్తుతోంది. జీవనదులు లేని కర్నూలు జిల్లాకు మరోసారి వరదనీటితో ముప్పు ఏర్పడింది. జారీ చేసింది. కర్నూలు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదిలావుండగా, కర్ణాటక ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరదనీటి వల్ల కూడా కర్నూలు జిల్లాతో పాటు, దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి కూడా ప్రమాదం పొంచి ఉంది. గత్యంతరం లేని స్థితిలో ఈ నీరంతా దిగువన ఉన్న నాగార్జునసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టు ఆ తరువాత కృష్ణా బ్యారేజీలోకి వదలాల్సిన పరిస్థితి. ఇక్కడ కూడా నిలువకు మించి నీటి సామర్థ్యం ఉన్న కారణంగా ఈ నీరంతా సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు దారితీసిన పరిస్థితి ఇది.

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి సేద్యపునీటి ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. ఈ నీటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. రాయలసీమ రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర జలాలు సముద్రంపాలయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఊడిన టీబీ డ్యాం గేటు
ఇదే మొదటిసారి


కర్ణాటకలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర డ్యామ్ కు ఉన్న క్రస్ట్ గేట్టలో ఒకటి కొట్టుకుపోయింది. శనివారం రాత్రి డ్యామ్ గేట్లు మూసివేస్తుండగా చైన్ తెగి 19వ నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో నీరు భారీగా కిందకి వస్తోంది. ఇటీవలి వరదలకు డ్యామ్ కు వరద పోటెత్తింది. దీంతో అధికారులు మొత్తం 33 గేట్లు ఎత్తి నీటిని వదిలారు. శనివారం వరద తగ్గడంతో గేట్లు మూసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే 19వ నంబర్ గేటు ఊడిపోయిందని అధికారులు వెల్లడించారు. హోస్పేట వద్ద 70 ఏళ్ల క్రితం నిర్మించిన బహుళార్థకసాధక ప్రాజెక్టు క్రస్ట్ గేటు ఊడడం ఇదేమొదటిసారి. దీంతో 35 వేల క్యూసెక్కుల నీరు కిందికి వెళుతోందని చెప్పారు. డ్యామ్ గేటు ఊడిపోవడంతో
కర్నూలుకు ముప్పు

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలపై ప్రభావం ఉండవచ్చని హెచ్చరించింది.
ఈ నంబర్లకు కాల్ చేయండి
వరదనీరు ముంచెత్తి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే, సాయం అందించడానికి కూడా చర్యలు తీసుకున్నారు. అత్యవసరమైతే సహాయం కోసం 1070 112, 1800 425 0101 నంబర్‌కు కాల్ చేయాలని కోరింది.


తుంగభద్ర డ్యాం గేటును పునరుద్ధరించేందుకు కర్ణాటక అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. డ్యామ్ లో నుంచి 60 టీఎంసీల నీటిని బయటకు పంపాక గేటును అమర్చుతామని ప్రకటించారు. కాగా, డ్యామ్ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసి కర్ణాటక మంత్రి శివరాజ్ ఆదివారం ఉదయం తుంగభద్ర డ్యామ్ వద్దకు వెళ్లి పరిశీలించారు.

కొనసాగుతున్న వరద ప్రవాహం
కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరదనీటి ప్రవాహం ఇప్పటికే పోటెత్తుతోంది. దీంతో ఈ జలాశయం ఐదు గేట్లు పది అడుగుల మేర ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో : 1,86,211 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 2,03,523 క్యూసెక్కులు వదులుతున్నారు. డ్యాం నీటి నిలువ సామర్థ్యం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.70 అడుగులకు ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం : 202.9673 టీఎంసీలు ఉన్నట్లు వివరించారు. దీంతో శ్రీశైలం జలాశయం కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.


రెండోసారి ముప్పు
కర్ణాటకలోని ఎగువప్రాంతంలోని హోస్పేట సమీపంలో నిర్మించిన తుంగభద్ర జలాశయం నీరు కర్నూలు జిల్లా పరివాహక ప్రాంతం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. 2009 అక్టోబర్ నెలలో ఒకసారి కర్నూలు నగరం నీటమునిగింది. రాకపోకలు స్తంభించాయి. ఎగువ నుంచి వస్తున్న నీటిని అంచనా వేయడం ద్వారా శ్రీశైలం నుంచి దిగువకు నీరు విడుదల చేస్తారు. అయితే ఆ ఏడాది అధికారుల అలసత్వం వల్ల శ్రీశైలం గేట్లు ఎత్తడంలో జరిగిన జాప్యంతో బ్యాక్ వాటర్ నగరాన్ని ముంచెత్తింది. ఇదిలావుండగా,
సీఎం చంద్రబాబు అప్రమత్తం

తుంగభద్ర డ్యామ్‌ గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారని తెలిసింది. డ్యామ్ వద్దకెళ్లి పరిస్థితిని గమనించాలని, అక్కడి పరిస్థితిని తనకు వివరించాలని కర్నూలు సీఈ, విజయవాడ సెంట్రల్ డిజైన్స్ కమిషనర్, జాతీయ డ్యామ్ గేట్ల నిపుణులు కన్నం నాయుడిని ఆదేశించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. తాత్కాలిక గేటు ఏర్పాటుపై డ్యామ్‌ అధికారులతో మాట్లాడాలని, అందుకు అవసరమైన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను చంద్రబాబు ఆదేశించారు. అయితే, పాత డిజైన్‌ కావడం వల్ల స్టాప్‌లాక్‌ గేట్‌ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని మంత్రి తెలిపారు.
Read More
Next Story