
శ్రీవారి దర్శనానికి వస్తూ.. ఐదుగురు తమిళ భక్తుల దుర్మరణం
కంటైనర్ కిందకి కారు దూసుకు వెళ్ళింది. చిత్తూరు జిల్లా పాకాల సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి తమిళనాడు నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య మరింత రెట్టింపు అవుతుంది. సెలవుల నేపథ్యంలో..
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని కోరికతో కారులో బయలుదేరిన ఓ కుటుంబం మొత్తం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పూతలపట్టు జాతీయ రహదారిపై చిత్తూరు జిల్లా పాకాల సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది.

చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేర్రగుంట సమీపంలోని కోనపురెడ్డిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఐదుగురు యాత్రికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన కొందరిని తిరుపతి ఎస్ వి ఆర్ ఆర్ (Sri Venkateswara Rama Narayana Riya hospital SVRR) ఆస్పత్రికి తరలించారు. యాత్రికుల మృతదేహాలను కూడా ఎస్వీఆర్ ఆసుపత్రికి మార్చురీకి పోలీసులు తరలించారు.
మితిమీరిన వేగం..
తమిళనాడు నుంచి తిరుమలకు కొందరు యాత్రికులు కారులో బయలుదేరారు. ఆ వాహనం చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రగుంట సమీపంలోని కోనపరెడ్డి పల్లె వద్ద మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నట్లు స్థానికులు చెబుతున్న కథనం. అదే సమయంలో ముందు వెళుతున్న మరో కారును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న కంటైనర్ కిందికి యాత్రికులు కారు దూసుకుపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న యాత్రికులు గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంతగా నలిగిపోయి ప్రాణాలు వదిలినట్టు చెబుతున్నారు.
జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. కళ్ళు ఎదురుగా జరిగిన ఘటన చూసి స్థానికుడు నిర్ఘాంతపోయారు. వెంటనే చేరుకున్న వారంతా బాధితులను కాపాడడానికి సహాయ చర్య కోసం రంగంలో దిగినట్లు అక్కడ మీడియా ద్వారా తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేశారు. గాయాలతో ఉన్న వారితో పాటు మృతులను కూడా తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story