
శేషాచలం అడవిలో ఘోరం.. ఏనుగుల దాడిలో ముగ్గురి మృతి
శివరాత్రి జాగరణ కోసం బయలుదేరిన భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. మృతులు కడప జిల్లా రైల్వేకోడూరు ప్రాంతినికి చెందిన వారే. ప్రభుత్వం వారికి పరిహారం ప్రకటించింది
మహాశివరాత్రి ముందు రోజు విషాదం నింపింది. శివరాత్రి రోజు అటవీ ప్రాంతంలోని శివ క్షేత్రంలో జాగారం చేయడానికి వెళుతున్న యాత్రికులపై ఏనువులు దాడి చేయడంతో ముగ్గరు మరణించారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కడప జిల్లా రైల్వే కోడూరు ఆసుపత్రిలో చికిత్స అనంతరం వారిని తిరుపతి రుయా (Sri Venkateswara ramnarayan ruya hospital) కు తరలించారు.
కడప జిల్లా రైల్వే కోడూరు తాలూకా ఓబులవారిపల్లె మండలం ఎర్రగుంట కోట సమీపంలోని శేషాచలం అడవుల్లో గుండాలకోన
ఎంట్రీ పాయింట్ నుంచి ఈ ప్రాంతమంతా దట్టమైన శేషాచలం అడవులే. ఎర్రగుంట కోటకు చెందిన ఉర్లగట్టుపోడు అరుంధతివాడ, కన్నెమడుగు ఎస్టీ కాలనీకి చెందిన దాదాపు 30 మంది యాత్రికులు సోమవారం సాయంత్రం బయలుదేరి గుండాలకోనకు వెళ్లే ఎంట్రీ పాయింట్ నుంచి చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద ఉన్న తలకోనకు అటవీ మార్గంలో కాలినడకన బయలుదేరారు. అక్కడి సిద్దేశ్వర ఆలయం వద్ద జాగారం చేయాలనేది వారి లక్ష్యం. ఓబులవారి పల్లి మండలం ఎర్రగుంటకోట మీదుగా పది కిలోమీటర్ల దూరంలోని గుండాలకోనకు వెల్లే మార్గంలోని ఎంట్రీ పాయింట్ దాటుకున్నారు. గుండాలకోన వ వద్దకు వెళ్లగానే ఏనుగుల గుంపు కనిపించింది. తమ వెంట తీసుకువెళ్లిన టిఫిన్ క్యారియర్ తో చప్పుడు చేయడంతో బెదిరిన ఏనుగులు దాడి చేశాయి. మంగళవారం వేకువజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఏనుగులను చూసిన జనం భీకర శబ్దాలు చేశారు. దీంతో
ఏనుగుల దాడి
అడవిలో అలజడితో చెలరేగిపోయిన ఏనుగులు జనం పై దాడి చేశాయి. ఈ ఘటనలో కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందిన మణెమ్మ, చంగల్రాయుడు, దినేష్ మరణించారు. మరో ఇద్దర గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బాధితులను గుండాల కోన నుంచి 22 కిలోమీటర్ల దూరంలోని రైల్వే కోడూరు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో అరుంధతివాడకు చెందిన పరిగెల రాజశేఖర్, పాపమ్మ (అమ్ములు)ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
దట్టమైన శేషాచలం అడవుల్లోకి ఎవరిని వెళ్లకుండా అటవీశాఖ అధికారులు కాపలాకాస్తున్నారు. చెల్లచెదురుగా పారిపోయిన వారి సమాచారంతో రైల్వే కోడూరు పోలీసులు, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బాధితులను రైల్వేకోడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే రాష్ట్ర అటవీశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను ఘటనా స్థలానికి వెళ్లమని ఆదేశించారు. ఏనుగుల దాడిలో మరణించిన ముగ్గురిలో ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన ఇద్దరిలో ఒక్కొక్కరికి రూ. ఐదు లక్షలు నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Next Story