
శ్రీవారికి కానుకగా రూ. మూడు కోట్ల ఆభరణాలు
పారిశ్రామికవేత్త సంజీవ్ గోయంకా ఐదు కిలోల ఆభరణాలు సమర్పించారు.
నగదు తోపాటు బంగారు ఆభరాలు సమర్పిస్తున్నారు. శుక్రవారం పారాశ్రామికవేత్త 3.6 కోట్ల
రూపాయల విలువైన భారీ ఆభరణాలను శ్రీవారికి కానుకలుగా సమర్పించారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడానికి ముందే కలకత్తాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయింక శ్రీవారికి ఐదు కేజీల బంగారు ఆభరణాలనుకానుకగా సమర్పించారు. ఆ ఆభరణాల విలువ ఐదు కోట్ల రూపాయలు అని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఆభరణాలు ఇవి
తిరుమలలో శ్రీవారికి అలంకరించడానికి అనేక రకాల ఆభరణాలు ఉన్నాయి. వాటికి తోడు పారిశ్రామికవేత్త శుక్రవారం ఉదయం శ్రీవారి మూలవిరాట్టుకు అలంకరించేందుకు 5 .267 కిలోలలతో తయారు చేయించారు. అందించిన ఆభరణాల్లో కటి హస్తం (నడుము భాగంలో అలంకరించే ఆభరణం), వరద హస్తం (దయచూపే భుజానికి సంబంధించిన ఆభరణం) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బంగారుతో తయారు చేసిన ఆ ఆభరణాల్లో వజ్రాలు, రత్నాలు పొదిగారు.
టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరి, అధికారులు దాత నుంచి ఆభరణాలను స్వీకరించారు. అనంతరం దాత సంజీవ్ గోయింకాకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. తరువాత ప్రత్యేకంగా సత్కరించడంతో పాటు శ్రీవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
ఆలయం వెలుపలి పారిశ్రామికవేత్త సంజీవ్ గోయింక మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి దివ్యదర్శనం కలిగిందన్నారు. స్వామివారి సేవ చేయడం అనేది నా జీవితంలో ఎంతో గొప్ప సందర్భం అన్నారు.
Next Story