Farmer suicide | రెవెన్యూ వాళ్లు ద్రోహం చేశారు.. చనిపోతున్నా..
x

Farmer suicide | రెవెన్యూ వాళ్లు ద్రోహం చేశారు.. చనిపోతున్నా..

భూములకు నష్టపరిహారం చెల్లించకుండా వేధించారు. అందుకే చనిపోతున్నా అని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదుల చేశారు.


రామాయట్నం వద్ద పోర్టు నిర్మించడానికి 2021లో కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ పోర్టు నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్. జగన్ పునాదిరాయి వేశారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలతోపాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చే సరుకు రవాణాకు ఓడరేవు సేవలు అందించే విధంగా రూపకల్పన చేశారు. ఇవన్నీ సవ్యంగా సాగడానికి అవసరమైన అంతకుముందే భూ సేకరణ కూడా చేశారు. కానీ,

పరిహారంలో జాప్యం
భూములు కోల్పోయిన వారిలో చాలా మందికి పరిహారంలో చెల్లింపులో జాప్యం చేస్తున్నారనే విషయం తాజాగా శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. ఆలస్యంగా గమనించిన ఆయన కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా (ప్రస్తుతం నెల్లూరు) జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం చెవూరు గ్రామానికి చెందిన నక్కల వినోద్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే సమయంలో కూడా మెడకు ఉరితాడు బిగించుకున్న ఆ వ్యక్తి చావు నవ్వుతూనే "తన చావుకు డిప్యూటీ కలెక్టర్ చేసిన జాప్యమే కారణం" అని ఆరోపించాడు. ఆ మేరకు ఓ లేఖ కూడా ముందుగానే రాసి ఉంచాడు.
కందుకూరు నియోజకవర్గం గుడ్లూరుకు చెందిన నక్కల వినోద్ విడుదల చేసిన వీడియోలో ఏమి చెప్పారంటే..
"రామాయపట్నం పోర్టుకు భూములు ఇచ్చినా, భూ పరిహారం రాలేదు. నాకు రూ. 90 లక్షలు మంజూరు చేయలేదు. డిప్యూటీ కలెక్టర్ వల్లే చనిపోతున్నా. నా చావుకు డిప్యూటీ కలెక్టర్ పద్మావతి కారణం" అని ఆరోపించారు.
పోర్టు నిర్మాణానికి తాను కూడా అందరితో పాటు మూడు సంవత్సరాలు గడుస్తున్నా, పరిహారం చెల్లించలేదని ఆవేదన చెందారు. ఎన్నిసార్లు వెళ్లి, కలిసినా స్పందన లేదన్నాడు. ఎంపీటీసీ సభ్యుడు నక్కల శ్రీనివాసులు, మానుకంటె మహీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు నాకు పరిహారం అందకుండా చేశారని లేఖలో ఆరోపించారు.

ఈ వేదన భరించలేక వినోద్ టీడీపీలో చేరాడు. పరిహారం అందుతుందని ఆశ పడ్డాడు. ప్రతిపక్షంలో ఉండగా ఎదురైన అభ్యంతరాలు మళ్లీ కాకుండా చూసుకోవాలని భావించినట్లు ఆయన సెల్ఫీ వీడియోలో చెప్పిన మాటలు బట్టి అర్థం అవుతోంది. ప్రస్తుత ప్రభుత్వంలో తనకు న్యాయం జరుగుతుందని ఆశించినా, ఫలితం లేదు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియోతో పాటు వినోద ముందుగానే రాసిన లేఖలో కూడా తన వేదనను వ్యక్తం చేశాడు.
ఈ సంఘటనపై గుడ్లూరు ఎస్ఐని ఫోన్ లో సంప్రదించగా, "వినోద్ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన ప్రస్తుతం ఒంగోలు ఉంటున్నారు" అని స్పష్టం చేశారు. ఒంగోలు వన్ టౌన్ ఎస్ఐకి కాల్ చేస్తే, తాను కాస్త బిజిగా ఉన్నా, తరువాత మాట్లాడుతా. అని చెప్పడం మినహా వివరాలు వెల్లడించలేదు. కాగా,
తనకు జరిగిన అన్యాయంపై సీఎం ఎన్. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి, చర్యలు తీసుకోవాలని వినోద్ తన చివరి మాటలుగా అభ్యర్థించారు. ఈ సంఘటనపై నెల్లూరు జిల్లా పోలీసులు ఎలా స్పందిస్తారనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story