శ్రీవారి దర్శనం పేరిట యాత్రికురాలికి బురిడీ
x

శ్రీవారి దర్శనం పేరిట యాత్రికురాలికి బురిడీ

టీటీడీ అధికారులు సీరియస్. అధికారిక సైట్ మాత్రమే వాడాలని అధికారుల సూచన.


తిరుమల శ్రీవారి దర్శనం, వసతి పేరిట బురిడీ కొట్టించారు. ఆన్ లైన్ లో డబ్బు తీసుకున్న వ్యక్తి ఆ తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. బాధితురాలు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేయడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం, వసతి కోసం టీటీడీ వెబ్ సైట్ మాత్రమే వాడాలని టీటీడీ అధికారులు సూచించారు. ఆన్ లైన్ వ్యవహారాలపై సందేహాలు ఉంటే కాల్ చేయాలని టీటీడీ అధికారులు నంబర్లు ప్రకటించారు.

ఏమి జరిగిందంటే...
శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థానికి రావాలను యాత్రికులు ఆన్ లైన్ లో టికెట్లు, వసతి సదుపాయం కోసం టీటీడీ వెబ్ సైట్ అందుబాటులో ఉంచింది. ఈ సైట్ ను తలపించే విధంగా పేర్లు వాడే కొందరు మోసగాళ్లు యాత్రికులను మోసం చేస్తున్నారు. ఈ తరహా సంఘటన మరొకటి తెరమీదకు రావడంతో టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. వారం రోజుల క్రితం భక్తురాలు ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల దర్శనం, వసతి కోసం గూగుల్ (Google Crome) లో ఊర్వతి శోధిస్తున్నారు. అందులో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ అనే వెబ్ సైట్ కనిపించింది. అందులో ఇచ్చిన మొబైల్ నెంబర్ 8062180322 ను సంప్రదించారు.
"శ్రీనివాసం కాంప్లెక్స్ లో రిసెప్షన్ కి చెందిన వాడిని" అని అభిమన్యు అనే వ్యక్తి సమాధానం చెప్పాడు అని ఊర్వశి టీటీడీ అధికారులకు వివరించారు. ఆ వ్యక్తి మాటలు నమ్మి, వసతి, శ్రీవారి దర్శనం టికెట్లు పీడీఎఫ్ పంపిస్తానని కొంత మొత్తం ఆన్లైన్ లో తీసుకున్నాడని ఆమె వివరించారు. డబ్బు తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి తన ఫోన్ కాల్స్ , వాట్సాప్ మేసేజ్ కు స్పందించలేదని ఆమె ఫిర్యాదు చేశారు. నకిలీ వెబ్ సైట్ ద్వారా మోసపోయానని తెలుసుకున్న ఆమె 1930 క్రైమ్ హెల్ప్ లైన్ కు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
స్పందించిన టీటీడీ
ఈ సంఘటనపై టీటీడీ అధికారులు స్పందించారు.
"ఇటీవల టిటిడి సేవల పేరుతో నకిలీ వెబ్ సైట్ల తో భక్తులను మోసం చేస్తున్న ఘటనలు అధికమయ్యాయి. దీనిపై అప్రమత్తంగా ఉండాలి" అని టిటిడి యాత్రికులకు సూచించింది. అనుమాస్పద వ్యక్తులు, దళారులు ప్రలోభ పెడితే టిటిడి విజిలెన్స్ విభాగం ఫోన్ నంబర్ 0877 – 2263828 కాల్ చేయాలన్నారు. నకిలీ దర్శన టికెట్లు, వసతి పేరుతో దందా చేసే వ్యక్తుల సమాచారం ఉంటే టిటిడి విజిలెన్స్ దృష్టికి తీసుకురావాలని టిటిడి కోరింది.
టీటీడీ సూచన
శ్రీవారి దర్శనం, వసతి కోసం టిటిడి అధికారిక వెబ్ సైట్https://ttdevasthanams.ap.gov.in లేదా ttdevasthanams mobile app ద్వారా మాత్రమే ఆన్ లైన్ లో ఆధార్ కార్డ్ ఆధారంగా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. ఇతర వివరాలకు టిటిడి టోల్ ఫ్రీ నెంబర్ 155257 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని టిటిడి కోరింది.
Read More
Next Story