STEEL PLANT BLAST | 'స్టీల్ ప్లాంట్'లో పేలుడు..మిన్నంటిన హాహాకారాలు
అగర్వాల్ స్టీల్ ప్లాంట్ లో పేలుడుతో పెన్నేపల్లి ఉలిక్కిపడింది. ఆరుగురు కార్మికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.
నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు. ఆ ఆనందం వెంట తీసుకున్న కార్మికులు విధులకు వెళ్లారు. ఇదిలావుంటే, సమీపంలోని స్టీల్ ప్లాంట్ లో బాయిలర్ పెలడంతో పల్లె ఉలిక్కిపడింది. ఎగసిన మంటలు చూసి ఆందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి ప్లాంట్ లో ఉన్న వారిలో ఆరుగురు వసల కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని సంఘటనతో గ్రామం మొత్తం స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకున్నది. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
గాయపడిన వారిలో నలుగురి ఆరోగ్యం నిలకడగా ఉంది. మరొకరు పరిస్థితి మాత్రమే విషమంగా ఉన్నట్లు ఎస్ఐ నాగరాజు చెప్పారు. ఈ సంఘటన వివరాల్లో వెళితే..
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద ఉన్న ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పెన్నేపల్లి వద్ద ఉన్న అగర్వాల్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నారు. యథావిధిగానే బుధవారం కూడా 50 మంది కార్మికులు విదులకు హాజరయ్యారని తెలిసింది. వారి పనిలో ఉండగా, కర్మాగారంలోని బాయిలర్ భారీ శబ్దంతో పేలడం వల్ల ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఈ శబ్దాలు విన్ని సమీపంలోని గ్రామస్తులు భారీగా పరిశ్రమ వద్దకు చేరుకున్నట్లు తెలిసింది. కర్మాగారం లోపల ఇనుము తుక్కు ఉన్న ప్రదేశానికి మంటలు వ్యాపించినట్లు సమాచారం. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫైర్ సేఫ్టీ అధికారులు గాయపడిన కార్మికులను అతికష్టంపై వెలుపలికి తీసుకుని వచ్చారని తెలుస్తోంది.
బాయిలర్ పేలుడుధాటికి గాయపడిన రవి బర్వాజ్, సోనూ మహ్మద్, విశ్వకర్మ, సీ. ముని నాయుడుపేట ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సంఘటన సమాచారం తెలిసిన వెంటనే పెళ్లకూరు ఎస్ఐ నాగరాజు చేరుకున్నారు. అదేసమయంలో అగ్నిమాపకశాఖ సిబంది కూడా వాహనంతో చేరుకుని మంటలు అదుపు చేయడానికి పోరాడారు. ప్రమాదం జరగడానికి దారితీసిన పరస్థితి ఏమటనేది, స్టీల్ ప్లాంట్ అధికారులే చెప్పాలి. ఇదిలా ఉండగా,
పెళ్లకూరు మండలం పెన్నేపల్లి సమీపంలోని అగర్వాల్ స్టీల్ ప్లాంట్ లో బాయిలర్ పేలుడు ధాటికి సమీపంలో పనిచేస్తున్న కార్మికుల హాహాకారాలు మిన్నంటాయి. ఈ కర్మాగారంలోని రెండో యూనిట్ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి గ్రామ పంచాయతీ అనుమతి కూడా లేదని చెబుతున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయక జరిగిన ప్రమాదంలో రెండో యూనిట్ లో కూడా పేలుడు సంభవించి ఉంటే, ప్రమాద తీవ్రత పెరగడంతో పాటు, ప్రాణనష్టం ఎక్కువగా ఉండేదని చెబుతున్నారు.
ఈ సంఘటనపై పెళ్లకూరు ఎస్ఐ నాగరాజుతో 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధి గురువారం ఉదయం మాట్లాడినప్పుడు.. "స్టీల్ ప్లాంట్ లో ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే చేరుకున్నాం." అని చెప్పారు. లోపల ఉన్న కార్మికులను రక్షించడానికి కర్మాగారం సేఫ్టీ అధికారులకు తోడు అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా జత కలిశారు" అని చెప్పారు. ఆ తరువాత నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, రూరల్ సీఐ సంగమేశ్వరరావు, తహసీల్దార్ ద్వారకానాథరెడ్డితో పాటు ప్రభుత్వ శాఖల అధికారులు చేరుకున్నారు.
"ఈ ప్రమాదంలో ఆరుగురు మాత్రమే గాయపడ్డారు. వారిని వెంటనే నాయుడుపేట ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించాం" ఎస్సై నాగరాజు చెప్పారు. గాయపడిన వారిలో సిపా రిమాల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం వల్ల కర్మాగారం ప్రతినిధులు మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించారు" అని చెప్పారు. ఈ ప్రమాదం జరగడానికి దారితీసిన పరిస్థితి ఏటమినేది దర్యాప్తు జరుగుతోంది. ఎస్ఐ నాగరాజు స్పష్టం చేశారు.
Next Story