Mango pulp| చిత్తూరు మామిడిపై యూరప్ యుద్ధమేఘాలు
x

Mango pulp| చిత్తూరు మామిడిపై యూరప్ యుద్ధమేఘాలు

గల్ఫ్ వార్ తరువాత యూరప్ యుద్ధ ప్రభావం 'చిత్తూరు' మామిడి గుజ్జు పరిశ్రమపై పడింది. లక్షల టన్నుల గుజ్జు గోదాముల్లో మగ్గుతోంది.


అది 1990 సంవత్సరం. కువైట్ (Kuwait)పై సద్దాం హుస్సేన్ సారథ్యంలోని ఇరాక్ (Iraq)సేనలు విరుచుకుపడ్డాయి. ఆ గల్ఫ్(Gulf) యుద్ధం వల్ల సర్చార్జీ (SurCharhe) మొదటిసారి విధించారు. ఆ యుద్ధం వల్ల ఉపాధి కోసం వెళ్లిన మిగతా రాష్ట్రాల వారి పరిస్థితి అలా ఉంచితే రాయలసీమ జిల్లాల నుంచి వెళ్లిన తెలుగు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.

24 సంవత్సరాల తర్వాత యూరోపియన్ దేశాల యుద్ధం పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. రష్యా- ఉక్రేయిన్ యుద్ధం. గాజాపై ఇజ్రాయిల్ దాడులు. భారత ఉత్పత్తులపై 28 నుంచి 30 శాతం దిగుమతి సుంకం విధించడం. ఇవన్నీ వెరసి

చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమ కుదేలైంది. లక్షల టన్నుల మామిడి గుజ్జు గోదాముల్లో మగ్గుతోంది. దీనివల్ల పరిశ్రమలకే కాదు. మామిడికాయలు అందించిన రైతులకు చెల్లింపు ఆగిపోయాయి. పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు ఉపాధి కూడా గండి పడే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై మారిటోరియం ఇవ్వకుంటే భారం భరించలేమని " ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్ (all India food processor association- Aifpa) సౌత్ జోన్ చైర్మన్, చిత్తూరు జిల్లా మామిడి గుజ్జు పరిశ్రమల యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి కట్టమంచి గోవర్ధన్ బాబి కోరుతున్నారు.

"యూరోపియన్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం వల్ల ఈ ప్రాంతం నుంచి మామిడి గుజ్జు ఎగుమతికి అవకాశం లేకుండా పోయింది" అని బాబి ఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.
"చిన్నపాటి టిన్నులు, భారీ డ్రమ్ముల్లో నింపిన 2.75 లక్షల టన్నుల మామిడిగుజ్జు నిలువలు గోదాముల్లో పేరుకు పోయాయి" అని బాబి ఆందోళన వ్యక్తం చేశారు.

ఎక్కడో వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలస్తీనా, ఇజ్రాయిల్ దేశాల్లో యుద్ధం జరుతుంంది. ఆ ప్రభావం చిత్తూరు జిల్లాపై పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని (United Arab Emirates) ఒమన్ (Oman) ప్రభుత్వ ఆధీనంలోని డైరీ బయ్యర్లు ముందుకు రాకపోవడం వల్ల చిత్తూరు జిల్లాలో నిల్వలు భారీగా పేరుకు పోవడానికి దారితీసింది. ఈ పరిస్థితులు ఓసారి పరిశీలిద్దాం.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 87,500 ఎకరాల్లో (దాదాపు 1.10 లక్షల హెక్టర్లు) సుమారు 88 వేల మంది రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే 1/3 మూడోవంతు కూడా ఈసారి మామిడి రాలేదు. ధరలు ఉన్నా, దిగుబడి లేక రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఈ పరిస్థితుల్లో ఉన్న కొద్దిపాటి దిగుబడిని రైతులు మామిడి గుజ్జు పరిశ్రమలకు సరఫరా చేశారు.
జిల్లాలో గుజ్జు పరిశ్రమలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరో 47 పరిశ్రమలు చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గం పరిధిలో మామిడి గుజ్జు తీసే పరిశ్రమలు 47 ఉన్నాయి. అందులో తిరుపతి ప్రాంతాల్లో ఆరు మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలో ఏటా సీజన్లో 7 లక్షల టన్నుల మామిడి కాయలు ప్రాసెస్ చేయగలిగినంత సామర్థ్యం ఉంది. ఇంత భారీ స్థాయిలో ప్రాసెస్ చేస్తే, 3.50 లక్షల టన్నుల గుజ్జు దిగుబడి వస్తుంది.
రోజుకు పది వేల టన్నుల ఉత్పత్తి

జిల్లాలోని ఒకటి 1.10 లక్షల హెక్టార్లలోని మామిడి తోటల నుంచి వచ్చే దిగుబడిలో 75% తోతాపురి రకం మామిడికాయలు ఈ పరిశ్రమలకు తీసుకొని వస్తారు. ఈ 47 గుజ్జు పరిశ్రమల నుంచి రోజుకు ఎనిమిది వేల నుంచి పదివేల టన్నుల గుజ్జు తీయడానికి సామర్థ్యం ఉన్న యంత్రాలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో సింగిల్ లైన్, అధిక ఉత్పత్తి చేయడానికి సామర్ధ్యం కలిగిన ఫోర్ లైన్ స్థాయిలో మామిడి కాయలు ప్రాసెసింగ్ చేసేందుకు యంత్ర పరికరాలు ఉన్నట్లు Aifpa సౌత్ జోన్ చైర్మన్ కట్టమంచి గోవర్ధన్ బాబి వివరించారు.
ఏటా ఏప్రిల్ నుంచి జూన్, జూలై వరకు మామిడి కాయల దిగుబడి ఉంటుంది. అందులో జూన్ జూలై చివరి నాటికి సీజన్ పూర్తవుతుంది. ఆయా సందర్భాలలో వ్యవసాయ మార్కెట్లు, పొరుగు ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఆ కోవాలోనే ఈ ఏడాది కూడా జిల్లా కలెక్టర్ మద్దతు ధర ప్రకటించారు. ఆ మేరకు రైతుల నుంచి పల్ఫ్ పరిశ్రమల యజమానులు కొనుగోలు చేశారు.
"పల్ఫ్ పరిశ్రమ నిర్వహణ, రైతుల నుంచి మామిడికాయల కొనుగోలుకు పెట్టుబడి అవసరం. ఇందుకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం" అని కట్టమంచి గోవర్ధన్ బాబి గుర్తు చేశారు.
యూరోపియన్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం వల్ల ఎగుమతులకు ఆస్కారం లేకుండా పోయింది. ఆ దేశాల నుంచి బయ్యర్లు కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల విభజిత చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు నియోజకవర్గాలోల్ పరిశ్రమలు ప్రాసెస్ చేసిన మామిడి గుజ్జు డ్రమ్ములు గోదాముల్లో మగ్గుతోంది. ఎగుమతులకు ఆస్కారం లేని స్థితిలో రైతులకు బకాయిలు చెల్లించడం, పరిశ్రమ నిర్వహణ భారంగా మారినట్లు బాబి విశ్లేషించారు.
కువైట్ ప్రధాన ఇంపోర్టర్

సాధారణంగా ఈ ప్రాంతం నుంచి ఒమన్, కువైట్ (Kuwait) దేశాలు మామిడి గుజ్జు కొనుగోలు ప్రధాన ఇంపోర్టర్స్ గా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాల చరిత్రలో కరోనా పరిస్థితుల తర్వాత రెండోసారి యూరోపియన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్లే పల్ఫ్ పరిశ్రమకు ఎంతటి భారీ కుదుపు ఏర్పడిందని విశ్లేషిస్తున్నారు.
ఆ భారం భరించలేం..

సాధారణ రోజుల్లో సముద్రమార్గాన కంటైనర్ రవాణా జరిగేది. చిత్తూరు జిల్లాలోని పరిశ్రమల నుంచి కంటైనర్ లో పల్ఫ్ డబ్బాలు, భారీ డ్రమ్ములు నింపేవారు. ఈ కంటైనర్ (container) చెన్నై సమీపంలోని నౌకాశ్రయానికి చేరేది. అక్కడి నుంచి ఓడల్లో (ship) ఎర్రసముద్రం (Red Sea) మీదుగా గల్ఫ్, అరబ్ ఎమిరేట్స్, ఇతర యూరోపియన్ దేశాలకు రవాణా జరుగుతుంది. అయితే,
యూరోపియన్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఎర్రసముద్రం మీదుగా రవాణాకు ఆటంకం ఏర్పడింది. పైరెట్ల దాడులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల ఒక షిప్పును కూడా ఆ ప్రాంతంలో పేల్చివేశారు. దీనివల్ల శ్రీలంక మీదుగా అనేక దేశాలు చుట్టుకుంటూ ఓడలు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
"దీనివల్ల మామిడి గుజ్జు కంటైనర్లు రవాణా చేయడానికి ఆటంకం ఏర్పడింది" గోవర్ధన్ బాబి పరిస్థితి తమ ఇక్కట్లు వివరించారు.
1. చెన్నై వరకు పరిశ్రమల యజమానులు తరలించడం ఒక పద్ధతి. అక్కడి నుంచి బయ్యర్ తరలిస్తారు.
2. రెండో విధానం. ఒక పద్ధతిలో కొంతవరకు పరిశ్రమల యజమాను రవాణా చేస్తారు. ఆ తర్వాత పొరుగు దేశాల బయ్యర్లు కంటైనర్లు తీసుకువెళ్తారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
"అన్ని ఖర్చులు పరిశ్రమల యజమానులు భరించాల్సి రావడం వల్ల ఆర్థిక భారం భరించడం శక్తికిమించిన భారంగా మారింది" అని బాబి పరిశ్రమల యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
ప్రభుత్వం స్పందించాలి
యూరోపియన్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం. పల్ప్ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో కీలకంగా వ్యవహరించే గల్ఫ్, యూఏఈ బయ్యర్లు ముందుకు రాని స్థితిలో నిల్వలో పేరుకుపోయాయి. బ్యాంకులో నుంచి తీసుకున్న రుణాలకు వడ్డీ పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని బ్యాంకు రుణాలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసర్ అసోసియేషన్ సౌత్ జోన్ చైర్మన్ కట్టమంచి గోవర్ధన్ బాబి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. తమ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం ఎన్ చంద్రబాబును కలిసి సమస్యను వివరిస్తాం అని ఆయన చెప్పారు.
భరించలేని రవాణా భారం
అరబ్, యూరోపియన్ దేశాల ఆర్డర్ల మేరకు చెన్నై మీదుగా కంటైనర్ ప్రయాణించాలంటే ఖర్చు పెరిగిపోయింది.
ఊదాహరణకు ఎర్రసముద్రం మీదుగా ఓ కంటైనర్ తీసుకువెళ్లాలంటే వెయ్యి డాలర్లు అవుతుందనుకుందాం. ఇప్పుడు శ్రీలంక మీదుగా అనేక దేశాలు చుట్టుకుని వెళ్లడం వల్ల ఆ భారం 5వేల నుంచి 6000 డాలర్లకు భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే 500 నుంచి 600. శాతం భారం పెరిగింది. అని గోవర్ధన్ బాబి విశ్లేషించారు.
ఇందులో రెండు పద్ధతులు ఉంటాయి.
1. Fob (forwarding on board)పరిశ్రమ నుంచి చెన్నై వరకు కంటైనర్ చేరవేయడం యజమాని బాధ్యత. అక్కడి నుంచి షిప్ లోకి ఎక్కించడం. వారికి అవసరమైన దేశానికి తరలించే బాధ్యత బయ్యర్ ఖర్చు భరిస్తారు
2. C and F (clearing and forwarding) అంటే మామిడి గుజ్జు తీసిన పరిశ్రమ నుంచి కంటైనర్ చెన్నై షిప్పియార్డుకు తీసుకెళ్లడం. అక్కడి నుంచి నిర్దిష్ట దేశానికి తరలించే ఖర్చు మొత్తం పరిశ్రమ యజమాని భరించాలి.
"మొదటి పద్ధతి వల్ల కొంతమేరకు మాత్రమే పరిశ్రమ యజమాని ఖర్చు భరించాలి. రెండో పద్ధతిలో పూర్తిగా భరించడం మరింత భారం అవుతుంది" అని బాబి వివరించారు. యూరోపియన్ యుద్ధం, ఎర్రసముద్రంలో పైరెట్ల దాడుల నేపథ్యంలో విదేశీ బయ్యర్లు కొనుగోలుకు ముందుకు రావడం లేదు. అందువల్ల ఈ ప్రాంత ప్రాసెసింగ్ యూనిట్ లో యజమానులే ఆ భారం మొత్తం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
"ఇది అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం వల్ల ఇగుమతులకు సాహసించలేకపోతున్నాం" అని బాబి విశ్లేషించారు.
ప్రభుత్వం స్పందించాలి..
రైతుల పరిస్థితి. పరిశ్రమల యజమానుల ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని పల్ఫ్ పరిశ్రమల యజమానులు కోరుతున్నారు.
"ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో చిక్కీ అందిస్తున్నారు. మామిడి పల్ప్ తో తయారుచేసిన తినుబండారం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి" అని పరిశ్రమల యజమానులు అభ్యర్థిస్తున్నారు. దీనివల్ల మామిడి ఉత్పత్తిదారులైన రైతులు, మామిడి గుజ్జు చూస్తే పరిశ్రమల యజమానులు, అందులో పని చేసే కార్మికులకు ఊతం ఇచ్చిన వారు అవుతారు. అని సూచిస్తున్నారు. దీనికి ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
Read More
Next Story