తిరుపతిలో కనువిందు చేసిన శోభాయాత్ర
x

తిరుపతిలో కనువిందు చేసిన శోభాయాత్ర

వీధుల్లో ఏనుగు అంబారీ ఊరేగింపు. సారెతో తిరుచానూరుకు బయలుదేరిన టీటీడీ అధికారులు


తిరుపతి నగరంలో మంగళవారం ఉదయం నుంచి శోభాయమానంగా మారింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయం నుంచి తిరుచానూరు వరకు రోడ్డు ఖాళీగా ఉంచారు. ఏనుగు అంబారీపై తిరుమల ఆలయ పండితులు కూర్చొన్నారు. శ్రీవారి ఆలయం నుంచి తీసుకుని వచ్చిన వెదురుబుట్టలో ఉన్న సారెను ఏనుగుపై ఉంచారు. అక్కడి నుంచి ప్రారంభమైన శోభాయాత్ర కనువిందుగా సాగింది.

గోవిందరాజస్వామి ఆలయం నుంచి


తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం నుంచి సారెను ఊరేగింపు తీసుకుని బయలుదేరారు. పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, అభరణాలతో కూడిన ఇతర వస్తువులన్నీ కొత్తవెదురు బుట్టల్లో నింపారు. ఆభరణాలను సీల్ వేసిన స్టీల్ బాక్సులో ఉంచారు. తిరుమల నుంచి సారె తీసుకుని వచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య గోవిందరాజస్వామి వారి ఆలయం వరకు చేర్చారు. అక్కడ పూజల అనంతరం తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి సమర్పించడానికి శ్రీవారి తీసుకుని వచ్చిన సారేతో ఊరేగింపుగా బయలుదేరారు.

ఆకట్టుకున్న ఊరేగింపు

తిరుపతి పట్టణంలో ఏనుగు అంబారీపై తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి సారె ఊరేగింపు కనువిందుగా సాగింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన యాత్రికుల తోపాటు స్థానికులు కూడా హారతులు పట్టారు. ఏనుగు అంబారీ ముందు కళాకారుల ప్రదర్శనలు మరింత ఆకర్షణీయంగా సాగాయి.


Read More
Next Story